కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది.
మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్‌లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు..
(చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క)
అఫ్గనిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు.
(చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్)
మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ..
‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment