hunger
-
ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్!
‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది. స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా ‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది. నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు. ఆహారం– మానసిక అనారోగ్యం! మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం. ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి వార్థక్యం పోంచి ఉంటుంది బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్ -
మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశంలోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్‌లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? సోనమ్ వాంగ్‌చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్‌లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్‌తో వాంగ్‌చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్‌చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్‌చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
ఇంటర్నేషనల్ ఫుడ్ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?
World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు మీకోసం.. 1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్ ఫుడ్ డే ధీమ్ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోంది మీకు తెలుసా? మీకు తెలుసా... ►ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్ ఫుడ్ డేను ఆచరిస్తున్నాం. ► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు. ►ఇజ్రాయెల్ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది. ►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. ► కోవిడ్-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. Water is not an infinite resource. We need to stop taking it for granted. What we eat and how that food is produced all affect water. On #WorldFoodDay @FAO calls on countries to take greater #WaterAction for food.https://t.co/DKBqAUky9y pic.twitter.com/I3TYWf4LrL — UN Environment Programme (@UNEP) October 16, 2023 ► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. ►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు ఆకలి సూచీలో అధోగతి -
ఆకలి సూచీలో అధోగతి!
ఎన్నో విజయాలు సాధిస్తున్నాం... అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో దూరంలో లేదని చెప్పుకొంటూనే ఉన్నాం. కానీ ఆకలి భూతాన్ని అంతం చేయటంలో వెనకబడే ఉన్నామని ఏటా వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ సిండీ మెకెయిన్ మాటలు విన్నా, తాజాగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)ని గమనించినా మన పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని అర్థమవుతుంది. జీహెచ్ఐ జాబితాలో మొత్తం 125 దేశాలు వుంటే, అందులో మన స్థానం 111. నిరుటికన్నా నాలుగు స్థానాలు కిందకు దిగజారామని ఆ నివేదిక చెబుతోంది. 2015 వరకూ ఎంతో పురోగతి సాధించిన భారత్ ఆ తర్వాత వరసగా నేల చూపులు చూస్తుందన్నది దాని సారాంశం. భారత్‌కు సంబంధించి నంతవరకూ ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అసలు జీహెచ్ఐ కోసం నిర్దేశించిన ప్రమాణాలు, తీసుకుంటున్న నమూనాలు, మొత్తంగా ఆ ప్రక్రియ సక్రమంగా లేదని కేంద్రం ఆరోపణ. ప్రపంచంలో 2030 నాటికి ఆకలన్నదే ఉండరాదన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కేవలం ఆహారం లభించటం ఒక్కటే ఆకలి లేదన టానికి గీటురాయి అనుకోవటానికి లేదనీ, ఆ లభిస్తున్న ఆహారంలో మనిషికి అవసరమైన కేలరీలు వుండాలనీ సమితి వివరించింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని అందుకోవలసి వుండగా అనేక దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని జీహెచ్ఐ అంటున్నది. జాబితా గమనిస్తే పాకిస్తాన్ 102తో మనకన్నా మెరుగ్గా వుండగా, బంగ్లాదేశ్ (81), నేపాల్ (69), శ్రీలంక (60) దాన్ని మించిన మెరుగుదలను చూపించాయి. 28.7 స్కోర్‌తో ఆకలి తీవ్రత భారత్‌లో చాలా ఎక్కువగా ఉందన్నది జీహెచ్ఐ అభియోగం. పౌష్టికాహార లోపంలోనూ 16.6 స్కోర్‌తో మనం చాలా కింది స్థాయిలో వున్నాం. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1గా ఉందని నివేదిక వివరిస్తోంది. మొన్న ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఆహారధాన్యాలు అందించామనీ, కానీ 2022–23లో ఆహార సబ్సిడీల బిల్లు రూ.2.87 లక్షల కోట్లకు చేరుకున్నందున అదనంగా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నిలిపేశామనీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పౌష్టికాహారలోపం కేవలం ఆహారధాన్యాలు ఉచితంగా అందించటం వల్ల మాత్రమే తీరేది కాదు. అవసరమైన పోషకాహారాన్ని అందించటంతో పాటు మహిళా విద్య, శిశు సంరక్షణ, మెరుగైన పారిశుద్ధ్యం, సురక్షితమైన మంచినీరు లభించేలా చూడటం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రంగాలన్నిటా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఏపాటి? సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పేరు మారి సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 అయింది. కానీ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఒక శాతం తగ్గి 20,554 కోట్లకు పరిమితమైంది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మధ్యాహ్న భోజన పథకం)కు నిరుడు రూ. 12,800 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో అది రూ. 11,600 కోట్లకు తగ్గింది. బాలికల విద్యకు నిరుటితో పోలిస్తే కేవలం 0.2 శాతం పెంచి రూ. 37,453 కోట్లకు సరిపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో, బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ) తదితర పథకాలతో కూడిన సంబాల్ స్కీమ్‌కైతే కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. మహిళలకు అందించే ఇలాంటి పథకాలైనా, శిశువులకు ఉద్దేశించిన పథకాలైనా పరిస్థితిని మెరుగుపరచగలవు. జీహెచ్ఐ సూచీ ప్రాతిపదికలు, మొత్తంగా అది రూపొందించే ప్రక్రియ లోపరహితమైనదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయనవసరం లేదు. ఎందుకంటే ఇంత జనాభా గల దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణించటానికి కేవలం 3,000 మంది వివరాలు మాత్రమే తీసుకుంటే అది సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుందా? తీవ్రమైన పోషకాహారంతో పిల్లలు అతి బలహీనంగా వుండటం జీహెచ్ఐ సూచీ ప్రకారం 18.7 శాతం వుండగా, మన పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ప్రతి నెలా సాగిస్తున్న పర్యవేక్షణలో అది కేవలం 7.2 శాతానికి పరిమి తమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 11 లక్షల 80 వేల టన్నుల ఆహారధాన్యాలను 28 నెలలపాటు అందించామని కూడా వివరించింది. అలాగే పోషకాహార లోప సవాల్‌ను ఎదుర్కొనడానికి వివిధ పథకాల కింద ఎంతో చేస్తున్నామంటున్నది. జీహెచ్ఐ సూచీకి తీసుకున్న నమూనాలు సక్రమంగా లేవనడం వరకూ ఏకీభ వించొచ్చు. అయితే నివేదికే పక్షపాతంతో వున్నదనీ, భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే దీని లక్ష్యమనీ అనడం సరికాదు. ఎందుకంటే ఇదే ప్రక్రియ సూచీలోని 125 దేశాల్లోనూ అమలు పరిచివుంటారు. దేశ జనాభాలో నిర్దిష్టంగా ఫలానా శాతం అని పెట్టుకుని దాని ప్రకారం నమూనాలు తీసుకుంటే ఈ సూచీ వెల్లడిస్తున్న అంశాలు వాస్తవానికి మరింత చేరువగా ఉండేవనటంలో సందేహం లేదు. ఒకపక్క బడ్జెట్ కేటాయింపుల్లో, కేటాయించిన నిధులు వ్యయం చేయటంలో మనం సక్రమంగా లేమని అర్థమవుతున్నప్పుడు ఆకలి సూచీ వంటివాటిపై ఆరోపణలు చేయటంవల్ల ఉపయోగం లేదు. పోషకాహారం విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వుంది. రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కూడా తేడాలున్నాయి. ఇవన్నీ సరిచేసుకుంటే నిస్సందేహంగా మెరుగుపడతాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరవవుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాలి. -
MS Swaminathan: ఆకలి లేని సమాజమే ఆయన కల
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగ ప్రవేశం వేశారు. హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తోనూ స్వామినాథన్ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. సివిల్ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు. కరువు పరిస్థితులు చూసి.. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రిక ల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా వీధుల్లో తిరుగుతూ.. ఆకలితో అలమటిస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి. రెండేళ్లుగా బాగానే ఉన్నా ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైంది. ఆస్పత్రిలో చేర్చినా భయాందోళనతో బయటికి వెళ్లిపోయింది. తన పేరేమిటో కూడా సరిగా చెప్పలేని స్థితికి చేరుకుంది. చివరికి ఆకలితో అలమటిస్తూ అక్కడి వీధుల్లో తిరుగుతోంది. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులూ మిన్హాజ్ జైదీ దీన గాథ. ఆమెను గమనించిన ఓ హైదరాబాదీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఎవరన్నది తెలిసింది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆకలితో అలమటిస్తూ.. లులూ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్సిటీలో చదువుతోంది. తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల కింద మానసిక ఒత్తిడికి లోనైంది. నాలుగు నెలల నుంచి తల్లికి ఫోన్ చేయడం కూడా మానేసింది. ఆమె ప్రవర్తనలో విపరీత మార్పును చూసిన తోటి విద్యార్థులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. లులూ జైదీ తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె ఆస్పత్రిలోంచి వెళ్లిపోయింది. వీధుల్లో తిరుగుతూ, ఎవరేమైనా పెడితే తింటూ గడుపుతోంది. ఈ క్రమంలో షికాగో నగరానికి చేరుకుంది. అక్కడ ఓ వీధిలో ఆకలితో ఆలమటిస్తున్న లులూ జైదీని అక్కడే ఉంటున్న హైదరాబాదీ గమనించి మాట్లాడారు. ఆమె పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో హైదరాబాద్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అమెరికాలోని హైదరాబాదీలు, తోటి విద్యార్థులు ఇది చూసి.. లులూ జైదీని షికాగోలోని సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు లులూ జైదీ దుస్థితి గురించి తెలిసిన ఆమె తల్లి.. తన కుమార్తెను కాపాడి, తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జైశంకర్.. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. లులూ జైదీ ఎవరి వద్ద ఉందో తమతో టచ్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. -
ఆకలికి వైద్యం అన్నం పొట్లం
హాస్పిటల్‌లోని పేషెంట్లకు వైద్యులు వైద్యం చేస్తారు. కాని వారి ఆకలికి ఎవరు వైద్యం చేస్తారు? కేరళలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పేషెంట్ల కోసం, వారిని చూసుకుంటూ ఉండిపోయిన బంధువుల కోసం ఎందరో గృహిణులు వంట చేస్తారు. ‘అన్నం పొట్లం’ కట్టి అందిస్తారు. ఇలా దాదాపు రోజూ 40 వేల అన్నం పొట్లాలు అక్కడి యూత్ ఫెడరేషన్ ద్వారా నిత్యం సరఫరా అవుతూనే ఉంటాయి. ఉదయాన్నే లేచిన సౌమ్య ఆఫీసుకు వెళ్లే భర్త కోసం క్యారేజీ కట్టే హడావిడిలో ఉంది. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్సులు కట్టాలి. ఒకటిన్నర గ్లాసుల బియ్యం పడేస్తే సరిపోతాయి. కాని ఆమె ఆ రోజు రెండు గ్లాసులకు పైనే వండింది. భర్తకు, పిల్లలకు కట్టగా తను తినాల్సింది గిన్నెలో పెట్టి మిగిలింది పొట్లంగా కట్టింది. అన్నంతో పాటు పప్పు, పచ్చడి, తాలింపు, ఒక ఆమ్లెట్టు... చక్కగా అరిటాకులో వేసి న్యూస్పేపర్లో చుట్టింది. ఆ పొట్లాన్ని కాసేపటికి ఒక కార్యకర్త వచ్చి సేకరించుకుని వెళ్లాడు. అలా ఆ కార్యకర్త ఆ వీధిలో అన్నం పొట్లం కట్టమని చెప్పిన ఇళ్లన్నింటికీ వెళ్లి అన్నం పొట్లాలను సేకరించాడు. ఇలా సేకరించినవి మధ్యాహ్నానికి ఊళ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతాయి. లోపల ఉన్న పేద పేషెంట్లకూ వారి కోసం బయట కాచుకుని ఉన్న అటెండర్ల కోసం పంచుతారు. ‘ఏ తల్లి కట్టిచ్చిన అన్నమో’ అని తిన్నవారు ఆ గృహిణులను ఆశీర్వదిస్తారు. ఇలా కేరళలో గృహిణుల వల్ల గత నాలుగేళ్లుగా రోగుల ఆకలి తీరుతోంది. వారి ఆరోగ్యం బాగుపడుతోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి కేరళలోని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) 2017లో 300 అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే పెద్దాస్పత్రులకు పంచే కార్యక్రమం మొదలు పెట్టింది. దీనికి వారు పెట్టిన పేరు ‘హృదయపూర్వం పొత్తిచోరు’. అంటే ‘హృదయపూర్వకంగా అన్నం పొట్లం’. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు అన్నం కొనుక్కునే స్తోమత అన్ని వేళలా ఉండదు. అలాగే వారిని చూసుకోవడానికి వచ్చే బంధువులు కూడా అన్నం కొనుక్కోలేరు. పేదవారు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా అని డివైఎఫ్ఐ కార్యకర్తలకు అనిపించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఓ అమ్మ అన్నం వండుతుంది. ఒక గుప్పెడు అదనంగా వండమని కోరుదాం. ఒకరికి భోజనం పొట్లం కట్టి ఇవ్వమని అడుగుదాం. ఇస్తారు’ అని స్త్రీల కరుణ మీద ఉండే విశ్వాసంతో ధైర్యంగా రంగంలోకి దిగారు. కార్యక్రమ ప్రారంభం రోజున 300 అన్నం పొట్లాలు వచ్చాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40,000 అన్నం పొట్లాలు పంపిణీ అవుతున్నాయి. పకడ్బందీగా సేకరణ కేరళ అంతా డివైఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు. వారు తమ తమ ఊళ్లలో ఎన్ని అన్నం పొట్లాలు అవసరమో లెక్కించి తమ ఏరియాలో ఉన్న గృహిణులను ముందు రోజే రిక్వెస్ట్ చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం పొట్లం ఇవ్వమంటారు. అలా ఒకోరోజు ఒక ఏరియాలో కొన్ని ఇళ్లను ఎంపిక చేసుకుని అడుగుతారు. మళ్లీ ఆ ఇళ్లలోని గృహిణులను అడగడానికి వారం పదిరోజులు పట్టొచ్చు. అందుకని స్త్రీలు సంతోషంగా అన్నం పొట్లం కట్టి ఇస్తారు. కొందరు స్త్రీలు రెండు మూడు పొట్లాలు కట్టిచ్చి సంతోష పడతారు. సారీ అంకుల్! ఈ అన్నం పొట్లాల పంపిణిలో ఎన్నో ప్రేమమయ సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక రోగికి తన వంతుగా అందిన అన్నం పొట్లంలో చిన్న చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది. ‘అంకుల్.. అమ్మకు వీలు కాలేదు. నేనే స్కూల్‌కు వెళ్లే హడావిడిలో వంట చేశాను. అంత రుచిగా లేవు. క్షమించండి. మీరు తొందరగా కోలుకోండి’ అని ఒక అమ్మాయి రాసింది. దానిని అందుకుని ఆ రోగి ఆ చీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ‘బంగారుతల్లీ... నువ్వు పంపిన భోజనం ఎంతో రుచిగా ఉంది. మెతుకు మెతుకులో నీ ప్రేమ ఉంది’ అని రాశాడు. అన్నం పొట్లం కట్టివ్వడానికి అమ్మలాంటి స్త్రీలు ఎందరో ఉంటారు. చేయవలసిందల్లా ప్రయత్నమే. -
అన్నార్తుల సేవలో.. కర్నూలు మహిళ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అన్నార్తుల ఆకలి తీర్చే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఒకరు.. ఇద్దరు కాదు.. కొన్ని కోట్ల మంది అభాగ్యుల కాలే కడుపులు నింపింది. కట్టుబట్టలతో ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చిన వలస జీవులకు బాసటగా నిలిచింది. మూడేళ్ల క్రితం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కర్నూలు నగరానికి చెందిన అనిత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో అన్నార్తులను ఆదుకున్నారు. 200 మంది సభ్యులతో వలస వెళ్లే కార్మికులు, సాధారణ పౌరులకు అండగా నిలిచారు. ఏడాది క్రితం ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించగా ఆ సంస్థ హెడ్‌గా నైజీరియాలో ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీజ్లి చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవల ఆమె కర్నూలు రాగా ‘సాక్షి’తో మాట్లాడారు. తల్లిదండ్రులు, భర్త, కుమార్తెతో.. ‘మా నాన్న అర్థోపెడిషియన్ డాక్టర్ వెంకట శెట్టి నాకు స్ఫూర్తి. ఆయన 1,500 మందికి పోలియో ఆపరేషన్స్ ఉచితంగా చేశారు. ఆ చిన్నారులు, తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను. అరుదైన సేవలకు ఒక సార్థకత ఉంటుందని భావించి నేను సాఫ్ట్వేర్ రంగం నుంచి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రతినిధిగా ఎంపికయ్యాను. ఇటీవల ఆప్ఘనిస్తాన్‌లో సంభవించిన రాజకీయ పరిణామాలతో అక్కడి పౌరులు భారీ స్థాయిలో ఇతర దేశాలకు వలస వెళ్లిన క్రమంలో వాళ్లను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఆత్మీయంగా గుండెలకు హత్తుకుంది. వాళ్లు ఎక్కడ విడిది చేస్తే అక్కడే గుడారాలు వేసి ఆహారాన్ని అందించింది. గతంలో యెమెన్‌లో భారీ సంఖ్యలో (దాదాపు 2 కోట్ల మంది) వలసలు జరిగినప్పుడు డబ్ల్యూఎఫ్‌పీ వారిని ఆదుకుంది. నైజీరియా, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి ప్రజలు వలసవెళ్లిన సందర్భాల్లో ఆహారం సరఫరా చేయడంతో పాటు కొన్ని నెలల పాటు పునరావాసం కల్పించాం. ఏదైన దేశంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడి తమ మనుగడ ప్రమాదకరంగా మారినప్పుడు చాలా మంది వలస వెళ్తున్న సమయంలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక విడిది ఏర్పాటు చేస్తాం. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సరఫరా చేస్తాం. వలసదారులతో పనిచేసే క్రమంలో వాళ్లు మాట్లాడే హౌసా, ఇగ్లో, ఎరూబా భాషలను కూడా నేను నేర్చుకోగలిగా. నా భర్త హరికృష్ణ, కుమార్తె మేధా అందించిన సహకారం మరవలేనిది’ అని అనిత చెప్పారు. -
బిడ్డ ఆకలి..రోడ్డుపై పడేసిన పండ్లే పంచామృతం
సాక్షి, జనగామః బిడ్డ ఆకలి తీర్చేందుకు ఓ తల్లి పడే వేదన.. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఏడాదిన్నర చిన్నారిని తన ఒడిలో వేసుకుని బిక్షాటనకు బయలు దేరిన తల్లి... రోడ్డుపై పడేసిన పండ్లే పంచామృతంగా స్వీకరిస్తోంది. జిల్లా కేంద్రం సిద్ధిపేట రోడ్డు లోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెత్త బుట్టలో కుల్లిన పండ్లు, కూరగాయలను వేశారు. ఆ సమయంలో చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చిన ఓ తల్లి... చిన్నారి ఆకలి తీర్చేందుకు..బుట్టలో ఉన్న పండ్లు, కూరగాయలను ఏరుకుని...సంతోషంగా వెళ్లిపోయింది. కన్న బిడ్డ కోసం తల్లిపడే తపన ప్రతి ఒక్కరి మనసును కదలిస్తుంది. పండ్లను సేకరిస్తూ జోలెలో వేసుకునే సమయంలో ఒడిలో ఉన్న చిన్నారి ముఖంలో కనిపించే చిరునవ్వు. కోట్లు ఖర్చు చేసి కారుకొనిచ్చినా రాదు కావచ్చు. -
ఎలన్‌కు 24 ఏళ్ల యువకుడి సవాల్..! నువ్వు 45 వేల కోట్లిస్తే..? నేను..!
American Boxer Jake Paul Promises To Donate 10 Million: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి 24 ఏళ్ల యువకుడు సవాల్ విసిరాడు. ఆకలి సమస్యని తీర్చేందుకు ఎలన్ 6 బిలియన్లను (4,49,13,30,00,000 రూపాయలు) అందిస్తే తాను 10మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని తెలిపాడు. అయితే ఇందుకు తాను పెట్టిన ఒక షరతును ఎలన్ ఒప్పుకోవాలని తెలిపాడు. ఇటీవల యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ మాట్లాడుతూ..వరల్డ్ వైడ్‌గా 155 మిలియన్ల మందికి సరైన ఆహార లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు సంపన్నులైన అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌లు 6 బిలియన్ల డాలర్లను డొనేట్ చేయాలని కోరారు. అయితే డేవిడ్ బిస్లీ వ్యాఖ్యలపై ఎలన్ స్పందించారు. 6 బిలియన్ల డాలర్లతో ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార సమస్యను ఎలా పరిష్కరించవచ్చో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఆ ప్రణాళికను ప్రజలందరి ఎదుట బహిర్గతం చేస్తే తాను తన టెస్లా షేర్లు అమ్మి ఆ మొత్తాన్ని దానం చేస్తామని స్పష్టం చేశారు. ఆ అంశం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చాంశనీయమైంది. ఎలన్ చేసిన ప్రకటనపై 24ఏళ్ల అమెరికన్ బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ స్పందించారు. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్డబ్ల్యూఎఫ్పీకి తాను 10 మిలియన్లను (74,50,05,000.00 రూపాయలు) విరాళంగా అందిస్తానని చెప్పాడు. అయితే తాను డొనేషన్ ఇవ్వాలంటే ఈ రెండు కండీషన్లకు కట్టుబడి ఉండాలని తెలిపాడు. అందులో ఒకటి మస్క్ 6 బిలియన్ డాలర్లను ఇవ్వడం, రెండోది తాను చేసిన ట్వీట్‌కు 690కే రీట్వీట్ వస్తే విరాళం ఇస్తామని చెప్పాడు. కాగా,పాల్ చేసిన ట్వీట్‌కి ఇప్పటివరకు 10,000 రీట్వీట్లు వచ్చాయి. చదవండి: ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను -
ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను
వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు వారి సంపదలో చాలా తక్కువ మొత్తాన్ని దానం చేస్తే భూమ్మీద ఆకలి సమస్య ఉండదన్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ ఫౌండర్, బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ క్రమంలో యూఎన్డబ్ల్యూఎఫ్పీకి ఓ సవాలు విసిరారు ఎలన్ మస్క్. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ మంచి ప్రణాళికతో వస్తే తాను 6 బిలియన్ డాలర్లు(4,49,13,30,00,000 రూపాయలు) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ సంస్థ డైరెక్టర్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. ‘‘మస్క్ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చు’’ అన్నారు. సీఎన్ఎన్లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్‌ని ఎలన్ మస్క్ సంస్థ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలి డేవిడ్ ట్వీట్ చేశారు. (చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) ఎలి డేవిడ్ ట్వీట్‌పై మస్క్ స్పందిస్తూ.. ‘‘6 బిలియన్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఇక్కడ ట్విటర్ థ్రెడ్‌లో నాకు తెలిపితే.. నేను ఇప్పుడే టెస్లా స్టాక్‌ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాను’’ అన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్‌గా ఉండాలని సూచించారు మస్క్. యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ అంశంపై యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ.. ‘‘మస్క్ తన సందలో కేవలం 2 శాతం దానం చేస్తే.. 42 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. మనం వారిని ఆదుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు. (చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!) తన వ్యాఖ్యలపై బిస్లీ మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలి’’ అన్నారు. చదవండి: ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం
కాబూల్: ఆ తల్లికి నలుగురు సంతానం. నాలుగో బిడ్డ నెలల పసికందు చిన్న పాప. కొన్ని నెలల క్రితం వరకు వారి జీవితాలు బాగానే ఉండేవి. కానీ దేశం తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన నాటి నుంచి గడ్డు పరిస్థితులు. కడుపునిండా తిని ఎన్ని రోజులవుతుందో. తాము సరే.. కానీ పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పసిదానికి పాలు కూడా కరువయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. ఆ మహిళ తన అమ్మ మనసును చంపుకుంది. మిగతా పిల్లల ఆకలి తీర్చడం కోసం నెలల పసిగుడ్డును అమ్మకానికి పెట్టింది. అది కూడా కేవలం 500 డాలర్లకు. ఇక భవిష్యత్తులో ఆ పాపను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఈ చిన్నారిని కొన్నాడు సదరు వ్యక్తి. అఫ్గన్‌లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో.. ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థం అవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి చిన్నారులను బలి పశువులను చేస్తున్నారు. ఆవివరాలు.. (చదవండి: ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క) అఫ్గనిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి కొంతకాలం వరకు చెత్త ఏరుకుని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత కష్టాలు ప్రారంభం అయ్యాయి. అతడికి నలుగురు సంతానం. భార్యాబిడ్డల ఆకలి తీర్చడం చిన్నారి తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఈ క్రమంలో ఆఖరి సంతానం అయిన నెలల పాపను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. (చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్) మిగతా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఈ పసికందును అమ్మేశాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. పసిదాన్ని భవిష్యత్తులో తన కుమారుడికిచ్చి వివాహం చేయడం కోసం ఈ పాపను కొన్నాడట సదరు వ్యక్తి. ఈ సందర్భంగా చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ‘‘పాపతో సహా ఇంట్లో అందరం ఆకలితో బాధపడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ దారుణానికి ఒడగట్టాను. పాప చాలా చిన్నది.. ఇప్పుడు నేను చేసిన పని గురించి దానికేం తెలియదు. మిగతా పిల్లలు పెద్దవాళ్లు. వారికి పరిస్థితి అర్థం అవుతుంది. బిడ్డను అమ్ముకునేంత కసాయి దాన్ని కాదు. కానీ మిగతా పిల్లల ఆకలి నన్ను ఈ పాపానికి పురిగొల్పింది’’ అంటూ కన్నీరుపెట్టుకుంది. చదవండి: తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా -
ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి ఆ దేశ ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మొన్నటి వరకు తాలిబన్ల ఆగడాలను, అకృత్యాలను, హింసలను అఫ్గన్లు భరిస్తూ వస్తున్నారు. తాజాగా అక్కడ ఆకలి చావులు కూడా మొదలుకావడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పశ్చిమ కాబూల్‌లో హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలికితో చనిపోయారు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ మాజీ చట్టసభ సభ్యుడు మొహమ్మద్ మొహాఖేక్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్గన్ ప్రజలకు తగిన జీవన ప్రమాణాలను సరిపడే విధంగా వారు అందించలేకపోయారని ఆయన విమర్శించారు. ఆప్గనిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలైన హజారా, షియా కమ్యూనిటీలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలువాలని కోరారు. షియా ఇస్లాంను ఆచరించే హజారా ప్రజలు అఫ్గనిస్తాన్ జనాభాలో 9 శాతం ఉన్నారు. హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, వారు గతంలో తాలిబాన్లచే తీవ్రంగా హింసించబడ్డారు. ఆగష్టు మధ్యలో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో జీవన పరిస్థితులు క్షీణించడంపై అనేక అంతర్జాతీయ సమూహాలు అప్రమత్తం చేస్తునే ఉన్నాయి. చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం -
తప్పు చేసి దొరికిపోయాను..ఇంకేం చేయాలి!
ప్రేమ.. పశ్చాత్తాపం.. నిరాశ ప్రతీ జీవిలోనూ ఒకే రకంగా ఉందనడానికి ఇదొక ఉదాహరణ. దొంగిలించిన వస్తువుతో పట్టుబడిపోతే మనుషులు ఎలా సిగ్గుపడిపోతారో.. జంతువులు కూడా అలానే ఉంటాయా అంటే కాదనలేం. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో కుక్క ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని దొంగిలించడమే కాకుండా తినే టైమ్‌లో ఆ ఇంటి యాజమానికి చిక్కడంతో ఏమీ చేయాలో అర్థం కాలేదు. కాసేపు అలానే ఉండిపోవడమే కాకుండా నిరాశగా పశ్చాత్తాపు పడుతున్నట్లు కుక్క ముఖంలో కనిపించింది. పాపం అది ఇంటి కుక్కే.. కానీ ఆకలి అయ్యిందో ఏమో, వంట గదిలో ఉన్న ఫుడ్ బాక్స్‌ను కాళ్లతో లాగీ మరీ తీసుకుంది. నోటితో కరిచి పట్టుకుని ఆ బాక్స్‌ను ఓపెన్ చేసే సమయంలో ‘నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ’ అంటూ ఒక మహిళ అరుపు వినిపించింది. అంతే ఆ బాక్స్‌తో కాసేపు అలానే ఉండిపోయిన కుక్క.. బాక్స్‌ను కిందిపడేసింది. ఇంకా ఆ కుక్కపై సదరు మహిళ అరుస్తూ ఉండటంతో చేసేది లేక అక్కడ్నుంచి పారిపోయింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్క ముఖంలో నిరాశను నేను చూడలేకపోయాను.. ఫుడ్ మొత్తం ఇవ్వండి’ అంటూ ఒకరు ట్వీట్ చేయగా, ‘నువ్వు పట్టుబడిపోయావ్’ అంటూ మరొకను సరదాగా ట్వీట్ చేశాడు. ఈ వైరల్ క్లిప్‌కు ఆరు లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. చదవండి: ప్రేమకు భాషలేదు.. రీట్వీట్ల హోరు! Caught ya 🤣🤣 pic.twitter.com/Z39TVM5yWN — Rebecca (@beckx28) October 14, 2021 I can’t cope with the disappointment in his face when he realises he’s been caught!! 😭 GIVE HIM ALL THE FOOD! pic.twitter.com/cs46MSpju3 — Emma Dolan 💙 (@JustMissEmma) October 14, 2021 That dog clearly deserves a treat for his effort and ingenuity. The person who left those tantalizing edibles within his reach, should always remember the first rule of sharing a home with a dog: Everything of yours is theirs if it’s within their reach. — Emerson Peak (@EmersonPeak) October 15, 2021 Oh god! So reminds me of Rupe ..he was the master at stealing food! 😂😂😭💔 pic.twitter.com/iwTHZ67IeI — Rachael. - Whimsical Art 71 (@Art71Rachael) October 14, 2021 -
విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది
కాబూల్: తాలిబన్ల ఆధీనంలోని అఫ్గాన్‌లో పరిస్థితులు రోజుకు రోజుకూ మరింత దుర్భరంగా మారుతున్నాయి. తాజాగా అకలితో అలమటిస్తూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన వైనం హృదయవిదారకంగా నిలిచింది. ఆహారం లేక ఆకలితో అలమటించి కన్న తల్లితండ్రుల చేతుల్లోనే కన్నుమూసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారిని ఎత్తుకుని తండ్రి బోరును విలపిస్తున్న తీరు పలువురిన్ని కంట తడిపెట్టించింది. కాబూల్ విమానాశ్రయం బయట ఈ విషాదం నెలకొంది. తాలిబన్ల చేత చిక్కిన మాతృదేశం నుంచి ఎలాగైనా బయటపడాలని అఫ్లాన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విమానమెక్కి మరేదేశమైనా వెళ్దామని కాబూల్ ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని నిద్రాహారాలు మాని రేయింబవళ్లు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తినేందుకు తిండి, తాకేందుకు నీరు కరువైన వేళ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. -
ఆకలిపై పోరులో డ్రీమ్ కేర్
వాషింగ్టన్ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్ స్థాయిలోనే ఫండ్ రైజింగ్ ద్వారా అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన
సాక్షి, బెంగళూరు: కరోనావైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ కొనసాగింపు అంచనాలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. లాక్డౌన్ పొడిగిస్తే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగితే అనధికారిక లేదా అసంఘటిత రంగంలోని కార్మికులు చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతారన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్డౌన్ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని ఆయన అన్నారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు. వ్యాపారాలపై కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్ ప్రభావం గురించి మూర్తి మాట్లాడుతూ, చాలా సంస్థలు తమ ఆదాయంలో 15-20 శాతం కోల్పోయారన్నారు. ఇది ఆదాయపు వస్తువు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఇండియా లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవు. మరింత కాలం ఈ పరిస్థితి కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువయ్యే ప్రమాదముందన్నారు. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి పొందుతున్న వారు సుమారు 20 కోట్లమంది ఉన్నారని, లాక్డౌన్ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని మూర్తి హెచ్చరించారు. (లాక్డౌన్ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు) ఇతర అభివృద్ధి దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం మరణాల రేటు 0.25 నుంచి 0.5 శాతం మధ్యలో ఉన్నాం. అయితే అనేక రకాల కారణాలతో దేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మరణాల్లో పావు వంతు శాతం కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయన్నారు. ఈ లెక్కన గత రెండు నెలల్లో వెయ్యి కరోనా మరణాలతో పోలిస్తే కరోనాపై అంత భయాందోళన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి కొత్త మార్గాలను అన్వేషించాలి, కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని మూర్తి వ్యాపార వర్గాలకు సూచించారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు) -
ఔరంగజేబును చంపి పుట్టాడట!
బాపు దర్శకత్వంలో కృష్ణ–జయప్రద జంటగా నటించిన సినిమా ఇది. ‘నా పేరు బికారి నా దారి ఎడారి’ పాట ఉన్న ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... బాగా ఆకలితో ఉన్న ఆ నిరుద్యోగి హోటల్లో కూర్చున్నాడు. అతని వాలకం చూస్తే ఎంతపెడితే అంత తినేలా ఉన్నాడు. కానీ జేబులో డబ్బులు అంతంతమాత్రంగానే ఉన్నాయి...అందుకే ఆచితూచి తినాలి...ఆకలి తీర్చుకోవాలి. సర్వర్ పోయాల వద్దా అన్నట్లు ఇడ్లీలో సాంబారు పోస్తున్నాడు.‘‘ఏమయ్యా...కనీసం తడవనన్నా లేదు. ఇంకొంచెం పొయ్యవయ్యా...ఏంటయ్యా నీ తాతగారి సొమ్ము పోయినంతంగా ముఖం పెడుతున్నావు... ఇంకాస్త పొయ్యి. ముక్కలేయవయ్యా’’ అరుస్తూనే ఉన్నాడు నిరుద్యోగి.‘‘సాంబార్లో ముక్కలెక్కడ వస్తాయి! ఆరోజులు ఎప్పుడో పోయాయి’’ అన్నాడు సర్వర్.ఆ తరువాత ‘‘కాఫీయా టీయా’’ అని అడిగాడు.‘‘కాఫీలో పాలెమన్నా ఉన్నాయా? అవి కూడా నీళ్లా?’’ సందేహంగా అడిగాడు నిరుద్యోగి.‘‘కాఫీలో పాలా! పోసేవాడే నీళ్లు పోస్తుంటే ఇక పాలెక్కడివి!!’’ అని గొప్ప సత్యం చెప్పి కాఫీ తీసుకురావడానికి కిచెన్ రూమ్‌లోకి వెళ్లాడు సర్వర్. కాఫీ తాగి బిల్లు కట్టి వెళుతున్నప్పుడు ఒక పెద్దాయనను చూశాడు. అతడి వాలకంబట్టి చూస్తే అతడే ఈ హోటల్‌కి ఓనర్ అనిపిస్తుంది. అతడు గట్టిగా అరిచాడు...‘‘ఒరే రంగయ్యా...నరసింహం ఏడిరా?’’‘‘అదిగోనండి...’’‘‘ఒరేయ్ నరసింహం....వెంకాయమ్మ ఈ సరుకులేవో కావాలంటుంది. ఇదిగో చూడు...’’నరసింహాన్ని చూడగానే నిరుద్యోగి కళ్లు సంతోషంతో మెరిశాయి.ఈలోపు బయటికి వెళ్లాడు నరసింహం.అతడిని అనుసరిస్తూ వెళ్లాడు నిరుద్యోగి.కొబ్బరిచెట్ల దగ్గర ‘‘ఒరేయ్ సింహం...నరసింహం’’ అని గట్టిగా పిలిచాడు.నరసింహం వెనక్కి తిరిగిచూశాడు.‘‘అరే మ్యాచూ...నువ్వా!’’ అన్నాడు ఆశ్చర్యంగా నరసింహం.‘‘నిన్ను చూడగానే నా ప్రాణం లేచివచ్చినట్లుయిందిరా. హోటలంతా నీ చేతుల మీదే నడుస్తున్నట్లుగా ఉందే’’ అన్నాడు మ్యాచూ.‘‘ఇప్పుడు నేను ఆ హోటల్‌కి మేనేజర్ని’’ కాస్త గర్వంగా అన్నాడు నరసింహం.‘‘అమ్మానాన్నా బాగున్నారా? ఏంపని మీద ఊరికి వచ్చావు?’’ అని అడిగాడు. ‘‘ఉద్యోగం కోసం వచ్చాను. ఆ సంగతే నీతో మాట్లాడుదామని...’’ గొణికాడు మ్యాచూ.‘‘ఇప్పుడు అర్జంటుగా పనిమీద వెళుతున్నాను. సాయంత్రం నెహ్రూపార్క్లో కలుసుకుందాం.అక్కడ మాట్లాడుకుందాం’’ అని అర్జంటుగా వెళ్లాడు నరసింహం.∙∙ పార్క్‌లో...‘‘నెల అయిందా వచ్చి! అది సరే 50 రూపాయలతో నెల రోజులు ఎలా లాక్కొచ్చావు!’’ ఆశ్చర్యంగా స్నేహితుడిని అడిగాడు నరసింహం.‘‘ఏముందీ..భోజనం మానేశాను. టిఫిన్ మాత్రమే తింటున్నాను. జేబులో ఇంకా పది రూపాయలు ఉన్నాయి. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. సిఫారసు లేనిదే ఉద్యోగం దొరికేట్లు లేదు. ఇదీ నా కథ. నిరుద్యోగి కథ’’ ఉన్నదంతా చెప్పాడు మ్యాచూ.‘‘ఇదా సంగతి. నువ్వేదో పే..ద్ద ఉద్యోగం చేస్తున్నావని మమ్మల్ని మించిపోయావని అనుకున్నాను’’ అన్నాడు నరసింహం.‘‘కాలేజీలో ఉండగా చదువుకోని వాళ్లు నాకు మనుషులుగానే కనిపించేవారు కాదు. ఇక డిగ్రీ వచ్చిన రోజు సరేసరి. ఈ డిగ్రీ చేతబట్టుకొని ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నట్లుగా కలకన్నాను. నా చూపులు పైనే ఉండేవి కాని కిందకు దిగేవి కావు. నాఅంత లేడనుకునేవాడిని. ఇప్పుడు నేను ఉద్యోగం కోసం తిరుగుతున్నప్పుడు తెలిసింది నేనెంత అల్పుడినో! ఆఖరికి ఆఫీసు బంట్రోతు కూడా నన్ను పురుగులా చూస్తున్నాడు’’ మనసులోని ఆవేదనంతా స్నేహితుడితో చెప్పుకున్నాడు మ్యాచూ.‘‘నీ కథ వింటుంటే బాధగానే ఉంది. కానీ ఇప్పుడు ఉద్యోగాలేమీ లేవు కదా’’ బాధపడుతూనే చేతులెత్తేశాడు నరసింహం.‘‘లేకేం! ముందు నాకో సర్వర్ ఉద్యోగం పారేయ్. తింటానికి ఉంటానికి ఒక చోటు దొరుకుతుంది’’ అడిగాడు మ్యాచూ.‘‘రేయ్...నీకేమైనా మతిపోయిందా! బీయే పాసై సర్వర్ ఉద్యోగం చేస్తావా?’’ ఆగ్రహించాడు నరసింహం.‘‘మహారాజులా చేస్తాను. అదిమాత్రం ఉద్యోగం కాదా’’ అన్నాడు మ్యాచూ.నరసింహానికి మళ్లీ కోపం వచ్చింది.‘‘చేయడానికి నీకు అభ్యంతరం లేకపోయినా...ఇవ్వడానికి నాకు సిగ్గుగా ఉంది’’ తప్పించుకోవాలని చూశాడు నరసింహం.అంతమాత్రాన మ్యాచూ ఊరుకుంటాడా ఏమిటి?‘‘నీకెందుకురా సిగ్గు! మేడ మీద ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. దొరకలేదు. ఇప్పుడు కింది నుంచి మొదలుపెట్టాను. ఇది మొదటి మెట్టు. ఎవరూ నిచ్చెన ఒక్కసారి ఎక్కలేరు కదా!’’ అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు మ్యాచూ. కొద్దిసేపు వాదోపవాదాల తరువాత ఎట్టకేలకు నరసింహం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.∙∙ మొత్తానికైతే మ్యాచూకు సర్వర్ ఉద్యోగం దొరికింది.‘‘ఏయ్ అబ్బాయ్, ఇదేమిటి? ఇడ్లి తెమ్మంటే దోశ తీసుకొచ్చావు’’ విసుక్కున్నాడు కస్టమరుడు.‘‘ఇడ్లి చల్లారిపోయిందండీ. మసాల దోశ వేడివేడిగా ఉంది....బాగుంది’’ అన్నాడు సర్వర్ మ్యాచూ.నిజానికి ఇడ్లి చల్లగా లేదు. అతనొకటి ఆర్డర్ ఇస్తే ఇతనొకటి విన్నాడు! తప్పును కవర్ చేసుకునేందుకు ‘వేడి వేడి దోశండీ. ప్రొప్రైటర్గారి కోసం స్పెషల్‌గా చేయించామండీ’’ అని కస్టమర్‌ను బుట్టలో వేశాడు మ్యాచూ.హోటల్లో పనిచేసే వాళ్లు ఆ రాత్రి డాబాపై సంగీత కచేరి పెట్టారు. వాళ్లదగ్గరికి వెళ్లారు మ్యాచూ, నరసింహం.‘‘ఆపండ్రా మీ కాకిగోల’’ అరిచాడు నరసింహం.‘‘కాకిగోలా ఇది? కోకిలగానం’’ అని ఆత్మవిశ్వాసం ప్రకటించాడు ఆ సంగీతకారుడు.‘‘మీ పాటకు కింద గాడిదలు చేరుతున్నాయి’’ అని కూడా అన్నాడు నరసింహం.‘‘ఔరంగజేబును చంపి పుట్టావయ్యా. సంగీతం చచ్చిపోయింది అని ఆయనకు ఎవరో చెబితే లోతుగా పూడ్చిపెట్టమని చెప్పాడట’’ వ్యంగ్యంగా అన్నాడు సంగీతకారుడు.అందరూ పెద్దగా నవ్వారు! -
ఆకలి రాజ్యం అంతం ఎప్పుడు
సమస్య గుర్తింపు–నివారణపై దృష్టిపెట్టాలన్న ఐక్యరాజ్యసమితి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించాలి. పోషకాహార లోపాన్ని నివారించాలి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో ఇవి అతి ముఖ్యమైనవి. అయితే వీటిని సాధించే దిశగా జరుగుతున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఐక్యరాజ్య సమితి వెలువరించిన 2018 ప్రపంచ ఆహార భద్రత – పోషణ స్థితిగతుల నివేదిక వివరిస్తోంది. ఆకలి బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారని, వాతావరణ మార్పులు ఆహార భద్రతను దెబ్బ తీస్తున్నాయని, తీవ్ర కరువులు, వరదలు వచ్చిన దేశాల్లో ఆకలితో ఆలమటించేవారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిందని ఈ నివేదిక బహిర్గతం చేసింది. ఆకలిని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు.. ప్రపంచంలో కొన్ని చోట్ల తలెత్తిన సంఘర్షణాత్మక, హింసాయుత వాతావరణం అడ్డంకిగా మారిన విషయాన్ని కూడా నివేదిక పేర్కొంది. శిశువులు, ఐదేళ్ల లోపు పిల్లలు, బడికి వెళ్లే పిల్లలు, కిశోర బాలికలు, స్త్రీలు మొదలైన దుర్బల తరగతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ‘ఆక్స్‌ఫామ్’ఆహార – వాతావరణ విధాన విభాగాధినేత రాబిన్ విలంగ్బీ నివేదికాంశాలపై స్పందిస్తూ.. శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వాలు, రాజకీయవేత్తలు రెట్టింపు కృషి చేయాలని, వాతావరణ సంక్షోభాలు ఎదుర్కొంటున్న పేద దేశాలకు నిధులిచ్చి సాయపడాలని సూచించారు. పోషకాలలేమితో అధిక బరువు 2016 నాటికి ప్రతి ఎనిమిది మంది పెద్దవారిలో ఒకరికి (67.2 కోట్ల మందికి పైగా) స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఆఫ్రికా, ఆసియాల్లో స్థూలకాయులు పెరుగుతున్నారు. భారత్‌లోని ఐదేళ్లలోపు పిల్లల్లో, 18 ఏళ్లు పైబడిన జనాభాలో అధిక బరువున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధిక ధరల కారణంగా పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిండి లేకపోవడం తాలూకూ ఒత్తిళ్లు వంటి అంశాలు కూడా అధిక బరువు, స్థూలకాయానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులు స్త్రీలలో రక్తహీనతకు, బరువు తక్కువ పిల్లలు పుట్టడానికి, బడికి పోయే బాలికలు బరువు పెరిగేందుకు కారణమవుతున్నాయి. పెరిగిన ఎనీమియా బాధితులు గర్భిణుల్లో తగినంత రక్తం లేకపోతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. కానీ ఈ సమస్యను నివారించడంలో ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదని వెల్లడైంది. ప్రతి ముగ్గురు గర్భిణుల్లో ఒకరు రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. 2012 (30.3%)తో పోల్చుకుంటే 2016 నాటికి (32.8శాతం) వీరి సంఖ్య పెరిగింది. ఉత్తర అమెరికాతో పోల్చుకుంటే ఆఫ్రికా, ఆసియాల్లో రక్తహీనత బారిన పడుతున్న స్త్రీలు ఇంచుమించు మూడింతలు ఎక్కువ. వాతావరణ విపత్తులు రెట్టింపు వాతావరణ మార్పులు వ్యవసాయంపై, ఆహార భద్రతపై చూపుతున్న ప్రభావాల్ని నివేదిక వివరించింది. ఆకలిని, పోషకాహారలేమిని తుద ముట్టించే దిశగా సాధిస్తున్న పురోగతిని ఈ మార్పులు సవాల్ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. విపరీతమైన వేడి, వరదలు, తుపానులు, కరువులు సహా వివిధ వాతావరణ విపత్తులు 1990 నుంచి రెట్టింపు అయ్యాయి. 1990–2016 మధ్య సగటున ఏడాదికి 213 విపత్తులు విరుచుకుపడ్డాయి. ఆహార ఉత్పత్తిని దెబ్బ తీశాయి. మొత్తం నష్టంలో 80 శాతానికి కరువులే కారణం. 2005 నుంచి తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న దేశాల్లో పోషకాహార లోపం పెరిగింది. పలు దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో 1996– 2000తో పోలిస్తే.. 2011–2016 మధ్య ప్రకృతి వైపరీత్యాలు పెద్దమొత్తంలో పెరిగాయి. ఇవి దిగుబడులను, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బ తీయడంతోపాటు ధరల పెరుగుదలకు, వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. దీర్ఘకరువులతో ప్రజలు వలస బాట పడుతున్నారు. పర్యావరణమూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ విపత్తులను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు తగిన కార్యక్రమాలను, విధానాలను రూపొందించుకుని అమలు చేయాలని ఈ నివేదిక నొక్కి చెప్పింది. మూడంచెల విధానంతో.. ఐదేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపంతో సరైన ఎదుగుదల ఉండటంలేదు. 2017లో ఇలాంటి వారి సంఖ్య 15.1కోట్లు. 2012లో ఇది 16.5 కోట్లు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో సాధించిన ప్రగతి చాలా స్వల్పమని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఎదుగుదల సరిగాలేని పిల్లల్లో అత్యధికులు ఆఫ్రికా (39%) ఆసియా (55%) పిల్లలే. ఇలాంటి పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు పెరగని వారు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. వీరిలో ఇంచుమించు సగానికి సగం మంది దక్షిణాసియాకు చెందినవారే. 25% మంది సబ్–సహరన్ ఆఫ్రికా పిల్లలు. అనారోగ్యం, మరణం బారినపడే ప్రమాదం వీరికి ఎక్కువని నివేదిక హెచ్చరించింది. ఇదే వయసు పిల్లల్లో 3.8కోట్ల మందికి పైగా అధిక బరువుతో వున్నారు. పోషకాహారం అందుబాటులో లేకపోవడం వల్లే.. బరువు తక్కువ పిల్లలు పుట్టేందుకు, వారిలో ఎదుగుదల సమస్యలకు కారణమవుతోందని.. తదనంతర జీవితంలో వీరు అధిక స్థూలకాయం బారిన పడే ప్రమాదముందని నివేదిక వివరించింది. ‘నివారించడం, సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, చికిత్స అందించడం’అనే మూడంచెల విధానం ద్వారా పోషకాల లోపంతో తలెత్తుతున్న ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలని ఆ నివేదిక సూచించింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్వర్గానికి ఓ దారి
ముగ్గురు వ్యక్తులు పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్తున్నారు. కిందికి చూస్తుంటే వారికి ఎత్తయిన కొండమీద ఒక పాము కప్పను మింగుతున్న దృశ్యం కనిపించింది. వారిలో ఒకడు వెంటనే కప్ప పడుతున్న బాధను చూసి ‘‘సర్పరాజమా! పాపం ఆ కప్పపై నీకు జాలి లేదా? దానిని వదిలి పెట్టు’’ అన్నాడు. ఆ మాటలకు పాముకు కోపం వచ్చింది. ‘‘నా ఆహారం నేను తినడం కూడా తప్పేనా? పైగా దానిని వదిలిపెట్టు అని చెబుతున్నావా? నీవు నరకానికి పో’’ అని శపించింది. అతడు నరకానికి వెళ్లాడు. రెండవ వ్యక్తి అది చూసి విభ్రాంతికి గురయ్యాడు. ఆ తరువాత సర్పాన్ని సమర్థిస్తూ ఇలా అన్నాడు: ‘‘కప్ప నీకు సహజమైన ఆహారం. నీవు దానిని భుజించి నీ ఆకలి తీర్చుకోవడం తప్పేమీ కాదు’’ అన్నాడు. ఆ మాటలకు కప్పకు కోపం వచ్చింది. ‘‘నన్ను భుజించమని సర్పానికి సలహా ఇస్తావా? దయ, జాలీ లేని ఓ బండ మనిషీ! నువ్వు నరకానికి పోతావు’’ అని శపించింది. అతడు కూడా నరకంలో పడ్డాడు. మూడవ వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. దాంతో అతను స్వర్గానికి చేరుకున్నాడు. బహుశా ఈ ఇతివృత్తాన్ని బట్టే మింగమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత ఏర్పడి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి మాట్లాడడం కంటె, మౌనంగా ఉండటమే మేలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. – డి.వి.ఆర్. -
ఢిల్లీలో ఆకలితో చిన్నారుల మరణం
-
ఎండాహారం
ఎండ మధ్యాహ్నాలు సేద తీరమంటాయిచిన్న కునుకు తీయమంటాయినిద్ర నుంచి లేచాక ఆకలిరుచిగా ఏం తినాలిరుచి మాత్రమే కాదు చలువ చేసేలా ఏం తినొచ్చు? ఇవిగో ఈ ఎండాహారాన్ని తీసుకోండి. ఓట్స్ భేల్ కావలసినవి: ఓట్స్ – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; దోసకాయ తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒకటిన్నర టీ స్పూన్లు; వేయించిన పల్లీలు – అర కప్పు; టొమాటో సాస్ – తగినంత తయారి: ∙బాణలిలో నెయ్యి వేడయ్యాక ఓట్స్ వేసి కొద్దిగా వేగాక... ఉల్లి తరుగు, టొమాటో తరుగు, దోస తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యాప్సికమ్ తరుగు, క్యారట్ తరుగు వేసి బాగా కలపాలి ∙కొత్తిమీర, వేయించిన పల్లీలను జత చేసి బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి ∙టొమాటో సాస్‌తో అందించాలి. సగ్గుబియ్యం పొంగలి కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పెసర పప్పు – పావు కప్పు; ఆవాలు – అర టీ స్పూను; మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1; కరివేపాకు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – తగినంత; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీడి పప్పులు – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత తయారి: ∙సగ్గు బియ్యంలో నీళ్లు పోసి బాగా కడిగి ఆ నీళ్లు ఒంపేసి, సగ్గు బియ్యం మునిగే వరకు మంచి నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ∙పెసరపప్పును విడిగా నానబెట్టాలి ∙స్టౌ మీద కుకర్ ఉంచి, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి , జీడి పప్పు, కరివేపాకు, మిరియాల పొడి వేసి వేయించాక, రెండున్నర కప్పుల నీళ్లు పోసి, నానబెట్టిన సగ్గుబియ్యం, పెసర పప్పు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి, బాగా కలిపి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి పల్లీ చట్నీతో వేడి వేడి సగ్గు బియ్యం పొంగలి అందించాలి. క్యారట్ ఉల్లిపాయ కూర కావలసినవి: క్యారట్ తురుము – రెండు కప్పులు; పెరుగు – ఒక కప్పు; సన్నగా తరిగిన ఉల్లిపాయలు – పావు కప్పు; నిమ్మ చెక్క – ఒకటి; ఉప్పు – తగినంత; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఎండు మిర్చి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, ఉల్లితరుగు జత చేసి మరోమారు కలిపి, దోరగా వేగిన తరువాత స్టౌ మీద నుంచి దించి, గిన్నెలోకి తీసుకోవాలి ∙చల్లారిన తరవాత క్యారట్ తురుము, ఉప్పు, నిమ్మరసం, పెరుగు జత వేసి బాగా కలపాలి ∙ఈ కూర చపాతీలోకి, పూరీలోకి చాలా రుచిగా ఉంటుంది. మిక్స్డ్ గ్రెయిన్ దోసె కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – ఒక కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; జొన్న పిండి – ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; సగ్గు బియ్యం – పావు కప్పు; ఉప్పు – తగినంత; పచ్చి మిర్చి పేస్ట్ – తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; జీలకర్ర – ఒక టీ స్పూను తయారి: ∙సగ్గుబియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఏడెనిమిది విజిల్స్ వచ్చాక దింపి, చల్లారనివ్వాలి ∙ఒక బౌల్లో రాగి పిండి, బియ్యప్పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, పోసి కలపాలి ∙చల్లారిన సగ్గు బియ్యం జావను జత చేసి, తగినన్నినీళ్లు పోసి దోసెల పిండిలా కలపాలి ∙సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చి మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ∙బాణలి మీద పెనం వేడయ్యాక పిండిని దోసెలుగా వేసి, రెండువైపులా దోరగా కాలాక ప్లేట్లోకి తీసుకుని, టొమాటో సాస్ / పల్లీ పచ్చడితో అందించాలి. పెసర మొలకలు – రాగిపిండి మాల్ట్ కావలసినవి: పెసర మొలకలు – అర కప్పు; ఉప్పు – తగినంత; రాగి పిండి – అర కప్పు; మజ్జిగ – తగినంత తయారి: ∙రాగి పిండికి తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి దోసెలపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, బాగా మరిగిన తరవాత, మంట బాగా తగ్గించి, కలిపి ఉంచుకున్న రాగి పిండిని పోస్తూ గరిటెతో కలుపుతుండాలి ∙తెల్లని పొంగులా రాగానే పెసర మొలకలు వేసి కలిపి రెండు మూడు నిమిషాల తరవాత దింపేయాలి ∙బాగా చల్లారాక మజ్జిగ కలిపి గ్లాసులలో అందించాలి ∙ఒక గ్లాసు మాల్ట్ తాగితే చాలు కడుపులో చల్లగా ఉంటుంది. పెరుగు సలాడ్ కావలసినవి: పెరుగు – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; తోటకూర తరుగు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూను; బెల్లం – 4 టీ స్పూన్లు; కరివేపాకు తరుగు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; దానిమ్మ గింజలు – పావు కప్పు; తురిమిన అల్లం – అర టీ స్పూను; సొరకాయ తురుము – పావు కప్పు; క్యాబేజీ తరుగు – పావు కప్పు. తయారి: ∙ఒక పాత్రలో తోటకూర తరుగు, క్యారట్ తురుము, సొరకాయ తురుము, క్యాబేజీ తరుగు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో పెరుగు వేసి, ఉడికించుకున్న కూరలను జత చేయాలి ∙పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, అల్లం తురుము, బెల్లం, జీలకర్ర పొడి, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో పెట్టి, చల్లారాక బయటకు తీసి అందించాలి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. కూల్ డ్రింక్ నొంగు పాల తయారీ కావలసినవి: ముంజలు – 6 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి)పాలు – 2 కప్పులుపంచదార – ఒక టేబుల్ స్పూను ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారి: ∙ఒక పాత్రలో పాలు పోసి, స్టవ్ మీద ఉంచి పాలు మరిగి మూడు వంతులు అయ్యేవరకు మరిగించాలి. ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉంచి దింపేసి చల్లారనివ్వాలి. ∙ముంజల ముక్కలు జత చేసి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, గ్లాసులలో పోసి అందించాలి. ∙వేసవి తాపాన్ని చల్లార్చే సహజ పానీయం ఇది. ఇంటి చిట్కాలు సాంబారు మరింత రుచిగా రావాలంటే.. ∙పోపును నేతిలో వేయించాలి ∙చిటికెడు దాల్చినచెక్క పొడి వేయాలి. ∙ముల్లంగి ముక్కలు వేయాలి. ∙ఉల్లికాడలు, చిన్న ఉల్లిపాయలు (సాంబారు ఉల్లిపాయలు) ఉపయోగించాలి. ∙ఉడికించిన పప్పును మెత్తగా మెదపాలి ∙జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం జత చేస్తే, అదనపు రుచి వచ్చి సాంబారు ఘుమఘుమలాడుతుంది. ∙ముక్కలను మరీ గుజ్జులా ఉడకపెట్టకూడదు (వేసవిలో కందిపప్పు బదులు పెసర పప్పు ఉపయోగిస్తే చలవ చేస్తుంది) ఫుడ్ ఫ్యాక్ట్స్ మజ్జిగ ఉపయోగాలు... సోఫార్శోగ్రహణీదోషమైత్రగ్రహోదరారుచౌస్నేహవయాపది పాండుత్వే తక్రం దద్యాద్గరేషు చ(చరక సంహిత 27వ సూత్రం)ఆరోగ్యానికి మజ్జిగ మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. మానవులలో ఉండే త్రిదోషాలనూ మజ్జిగ అదుపులో ఉంచుతుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాత దోషం, పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పిత్త దోషం, శొంఠి, పిప్పళ్లు, మిరియాల పొడితో కలిపి తీసుకుంటే కఫ దోషం తగ్గుతాయి. గేదె పాల నుంచి తయారయిన మజ్జిగ కంటె, ఆవు పాల మజ్జిగ మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు (ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల వారికి మజ్జిగ మంచిది కాదు). ∙పథ్యంగా పనిచేస్తుంది ∙ఆకలిని పెంచుతుంది. ∙రుచి కారకంగా, బుద్ధిని పెంచేందుకు తోడ్పడుతుంది. ∙ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపిన మజ్జిగతో కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది. ∙పైల్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ∙తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన దాహార్తిని తీరుతుంది. ∙శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియమ్‌లను అందిస్తుంది. ∙గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయడపడుతుంది. ∙బిపి, కొలñ స్ట్రాల్లను నివారిస్తుంది. ∙శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ∙శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది ∙ఎముకలను బలంగా చేస్తుంది. ∙ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ∙శరీరంలోని మెటబాలిజమ్ రేటును పెంచి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ∙అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిట్కాలు... ∙మజ్జిగలో ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకోవాలి ∙వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ∙గ్లాసుడు మజ్జిగలో అర టీ స్పూను శొంఠి పొడి వేసి తీసుకుంటే, పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు పాటించడం వలన ఫలితం లభిస్తుంది. – పి. సాయిజ్యోతి అచ్చంపేట నాగర్‌కర్నూల్ జిల్లా -
నాకు ఆకలిగా ఉంది
‘ఆకలిగా ఉంది బాబుల్లారా! నాకాకలిగా ఉంది....’’ ఒక యువకుడు రైలును పట్టుకొని తాకుతూ అడుక్కుంటున్నాడు. ఒకరు కసురుకుంటున్నారు. ఇంకొకరు విననట్లు తల తిప్పుకుంటున్నారు. మరొకరు ఏమీ లేదన్నట్లు ముఖం పెడుతున్నారు. ఆ యువకుడు ‘‘ఆకలి.. ఆకలి....’’ అంటూనే ఉన్నాడు. నేను నా ఫ్రెండ్ కూర్చున్న సీటు దగ్గర కిటికీ పక్కన నిలబడి ఉన్నాను.బయటి నుంచి ‘‘బాబూ ఆకలిగా ఉంది’’ బిచ్చగాడు దీనంగా అడిగాడు. నిజమే బిచ్చం అసహ్యించుకోదగిందే. దానిని నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిందే. చదువుకున్న వాళ్ళు, మేధావులు మాత్రమే ఈ దిశలో ఏదన్నా చెయ్యగలరనీ నేను ఒప్పుకుంటాను. ఒక బిచ్చగాని చేతిలో ఏదైనా వేసినప్పుడు నేను బిచ్చగాడికి గానీ మరొకరికి గానీ సహాయం చెయ్యడం లేదని తెలిసే చేస్తాను. అయినా ఎవరైనా చెయ్యిముందుకు చాచినప్పుడు దాని మీద ఏంతో కొంత పెడతాను. బహుశా బిచ్చగాళ్ళను తిరస్కరించలేకపోవడమో లేక అదొక మంచి తప్పించుకునే మార్గం కావడమో అందుకు కారణం కావచ్చు.నా ఫ్రెండ్ ఇందుకు వ్యతిరేకం, ఇలాంటి అంశాల పట్ల ఆవిడ దృష్టి వాస్తవికంగా ఉంటుంది. ‘‘బాబూజీ! ఆకలి’’ అతని గొంతు ఇంకా వినబడుతూనే ఉంది. నాచేయి అప్రయత్నంగానే జేబులోకి పోయింది.నా ముఖ కవళికల్ని గమనించిన నా ఫ్రెండ్ నవ్వింది. ‘‘ఈ రకంగా భిక్షం వేసి, మీలాంటి వాళ్ళు వాళ్ళను అవమానిస్తారు. వాళ్ళ పట్ల తప్పుడు సానుభూతి చూపొద్దు. వాళ్ళను ఆకలితో చావనీయండి. అప్పుడే వాళ్ళకు హక్కుల కోసం పోరాడే ధైర్యం వస్తుంది....’’ ఆమె ఎప్పుడూ అనే మాటలు నా చెవిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.కాసేపటికి తెలిసింది మా రైలు ఆలస్యంగా రాబోయే రైలు కోసం ఆగి ఉందని, బయలుదేరడానికి ఆలస్యమవుతుందని. మాకు విసుగొచ్చి బైటకు వచ్చాం. రైల్వే విశ్రాంతి గది దగ్గరలోనే స్టేషన్ మాష్టర్ క్వార్టర్స్‌కు పక్కనే ఉంది. మేము కాసేపు ప్లాట్ఫారం మీద అటు ఇటు తిరిగాం. తర్వాత విశ్రాంతి గది ముందున్న పచ్చికలోకి వెళ్ళాం. నా ఫ్రెండ్ తోటమాలివైపు చూచి నవ్వుతూ కొన్ని మొగ్గల్ని కోయడం మొదలుపెట్టింది.‘‘కాయ మొగ్గల్ని కొయ్యకండి బాబూజీ’’ అంటూ మా సమాధానం కోసం ఆగకుండా వెళ్లిపోయాడు తోటమాలి. మేము అలసిపోయి మంచి మొగ్గలుంటాయిలే అనుకొంటూ తిరిగి సీట్లోకి వచ్చాం. మంచి మొగ్గల్ని పిందె మొగ్గల్ని వేరు చేస్తున్నాం.‘‘సూది దారం ఉంటే పూలు కుట్టుకోవచ్చు’’ అంది నా స్నేహితురాలు. నేను విశ్రాంతి గదివైపు చూశాను. అక్కడ నగ్నంగా, అర్ధనగ్నంగా ఉన్నవాళ్ళ గుంపు అగ్గి మంట చుట్టూ తిరుగుతూంది. ఆ బిచ్చగాళ్ళ నుండి సూదీ దారం తీసుకుందాం అనుకున్నాను. అయినా ఇంకొంచెం మర్యాదగల స్థలం కోసం వెతికాను. యాభై అడుగుల దూరంలో ఒక చిల్లర వ్యాపారి కనిపించాడు. కొన్ని నిమిషాలకు ముందు ఆకలి.. ఆకలి.. అని అరిచిన బిచ్చగాడు ఇప్పుడు అక్కడ సిగరెట్టు ముట్టించుకుంటున్నాడు. చిల్లర వ్యాపారికి డబ్బు చెల్లించి, గట్టిగా దమ్ము పీల్చి మత్తెక్కిన కళ్ళతో సంచారుల దగ్గరకి వెళ్ళిపోయాడు. నా ఫ్రెండ్ మొగ్గలు ఏరడంలో నిమగ్నమైంది. మట్టిగొట్టుకుపోయి, చినిగిపోయి పొడవుగా వదులుగా ఉన్న చొక్కా బిచ్చగాడి మోకాళ్ళు దాకా వేలాడుతూ ఉంది. నిక్కరు చిరిగిపోయి ఉంది. తల వెంట్రుకలు దుమ్ము నిండిపోయి ఉన్నాయి. పదహైదు నిమిషాల క్రితం అతని ముక్కుపుటాలు గబ్బుతో నిండి ఉన్నాయి. ఈగలు ముసురుకుని శబ్దం చేస్తున్నాయి. కళ్ళు మురికిగా ఉన్నాయి.‘‘సూది దారం సంపాదించు’’ నా ఫ్రెండ్ మాటిమాటికీ అంటోంది. బిచ్చగాడు తాపీగా తన మనుషుల దగ్గరకి వెళ్ళాడు. అక్కడ కూడా ఇద్దరు కుర్రాళ్ళు – అతని కన్నా అధ్వాన్నంగా ఉన్నారు. వాళ్లాడే ఆట ఆపేసి సిగరెట్ కోసం అతని మీద పడ్డారు. అతను వాళ్ళల్లో ఒకడ్ని తన్నాడు. పరిగెత్తి ఇంకొకడిని పడగొట్టాడు. వాళ్ళు ఇద్దరూ ఎనిమిది పదేళ్ళ లోపు వయసు వాళ్ళే. నగ్నంగా, నల్లగా ఎముకల గూడులాంటి శరీరంతో మట్టి జలగల్లాగా ఉన్నారు. మర్రిచెట్టు కింద ఉన్న తన మనుషుల దగ్గరకు పోగానే అతను రొట్టెను అడుగుతాడనుకున్నాడు. ‘ఆకలి.. ఆకలి..’ అతని అరుపులు నా చెవుళ్ళో ఇంకా మారుమోగుతున్నాయి గనుక.ఒక పండు ముదుసలి, వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. మెడమీద నరాలు తేలియాడుతున్నాయి. కళ్ళు గుంతలు పడ్డాయి. చేతులు వణుకుతున్నాయి. గుంపులో కూర్చుని ఉంది. మహా స్టైల్‌గా సిగరెట్ బూడిద రాల్చుకుంటూ తన దగ్గరకి వచ్చిన బిచ్చగాడిని చూచి నవ్వింది. ‘‘వీడు పెద్ద వాడు అయిపోతున్నాడు. ముసలితనంలో కన్నా వీడు పెరుగుతున్నాడు. సిగరెట్ తాగు, మీనాయన హుక్కా తాగేవాడు. అది నీకు చేతకాదు.’’ వృద్ధ వేశ్య ఆమె వైపు తిరిగి ‘‘వాడు సిగరెట్ తాగుతున్నాడు. దేన్కి సిగరెట్ తాగుతున్నాడు....’’ అంది.నా ఫ్రెండ్ ఇంకా పువ్వులు సర్దుతూ.. ‘‘సూదీ దారం దొరికితే బాగుండు’’ అంటోంది.బిచ్చగాడు ఒక దిబ్బమీద కూర్చుని పొయ్యి ఊదుతున్న పదహైదు పదహారేళ్ళ అమ్మాయిని చూస్తున్నాడు. ఆమె పొయ్యి నుంచి తల పైకి ఎత్తినప్పుడల్లా బిచ్చగాడు సిగరెట్‌ను బలంగా పీల్చి పొగను వదులుతున్నాడు. పొగ గాలిలో రింగులు తిరుగుతున్నాది. పచ్చి కట్టెలను ఊది మండించడంలో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. గాలి అన్నివైపుల నుంచి పొయ్యిలోకి దూరుతున్నది. పొయ్యి మీదనున్న కుండపై మూత తీసింది. కుండను కదిలించింది. గరిటనిండా కూర తీసుకుంది. చల్లారే దాకా ఉండి ఉడికిందో లేదో చూద్దామని నోట్లో వేసుకుని, తిరిగి కుండలో వేసి దాన్ని మళ్ళీ కుదిపింది. బిచ్చగాడు ‘‘ఆకలి..’’ అంటాడని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అతనికి తినడానికి ఎంతో కొంత పెడుతుంది. అయితే అతను సిగరెట్ తాగడంలో బిజీగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఒకసారి తలెత్తి అతడిని చూసింది. కాసేపు అయినాక బిచ్చగాడు అక్కడ దాయాలు ఆడుకుంటున్న వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు. వాళ్ళలో బాగా ఆడుతున్న అబ్బాయి చెయ్యి చాపాడు. ఆ బిచ్చగాడు సిగరెట్ అతని వేళ్ళ మధ్య పెట్టాడు. అతడు దాన్ని అందుకుని గట్టిగా ఒక దమ్ము పీల్చి, సిగరెట్‌ను తిరిగి బిచ్చగాడికి ఇచ్చేశాడు. అతను కాసేపు ఆటను చూచి పోవడానికి పైకి లేచాడు. కానీ, గెలిచే ఆటగాడు అతడ్ని ఆపాడు. బహుశా అతని రాక తనకు అదృష్టం తెచ్చినట్లు ఉంది. ఇతర ఆటగాళ్ళు అతనిని గుర్రుగా చూశారు.‘‘అతడు సిగరెట్ తాగుతున్నాడు.’’ ఒకరన్నారు.‘‘ఎందుకు తాగకూడదు? నీకేమిటి బాధ!’’ నవ్వుతూ అడిగిందామె. ‘‘బాబూజీ ఆకలి... ఆకలి....’’ అని అతను ప్రాధేయపడ్డం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది.అప్పుడు ఒక సీనియర్ ప్రయాణికుడు ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. ‘‘పో నాయనా! నీకు చేతనైన పని చేసుకో. ఈ వయసులో అడుక్కోవడం ఏమిటీ?’’ ఒక లావాటి వైశ్యుని మాటలు కూడా గుర్తుకొచ్చాయి. ‘‘నీకు ఉద్యోగం కావాలంటే రా.. మా ఫ్యాక్టరీలో ఇస్తాను.’’‘‘మనకు సూదీ దారం దొరకదనుకుంటాను.’’ అంది మొగ్గలు సర్దటంలో మునిగిపోయిన స్నేహితురాలు. బిచ్చగాడు సిగరెట్ తాగుతూనే ఉన్నాడింకా. చిల్లాకట్టె ఆడుతున్న గుంపు దగ్గరికి జోరుగా వెళ్లిపోయాడు. వాళ్లలో కలిసిపోయి వాళ్ల ఆటను చెడగొట్టాలని చూశాడు. పిల్లలు నిరసన తెలిపారు. గొణిగారు. తిట్ల జల్లు కురిపించారు. కాని అతను దుర్మార్గం ఆపలేదు. ఆ పిల్లల్ని బాగా చిరాకు పరచి తల వెంట్రుకలు సర్దుకొని, ఒక అమ్మాయితో కలిసిపోయి ఒక మారుమూల కూర్చున్నాడు. ఒక చేతిలో సిగరెట్ పెట్టుకొని, రెండో చెయ్యిని అమ్మాయి భుజమ్మీద వేశాడు. పొగ దమ్ములాగి ఆమె ముఖంపైకి ఊదాడు. ఆమె కళ్లు, చెవులు మూసుకుంటూంది. ఆ ఆట అలా కొంతసేపు జరిగింది. చివరికి అతను సిగరెట్‌ను ఆ అమ్మాయి పెదవుల మధ్య పెట్టాడు. ఆమె నవ్వుతూ తిరస్కరించింది. కాని అతని బలవంతం మీద ఆమోదిస్తు ఒక దమ్ములాగింది. పైకి లేచింది. విపరీతంగా దగ్గు వచ్చింది. అతను ఆమెను కిందికి లాగాడు. ఆమె నోరు పొగను గక్కింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. ముఖం వివర్ణమయింది. అయినా ఆమె లేవడానికి అతను అనుమతించలేదు. కాసేపు వాళ్లు మాట్లాడుకున్నారు. అతను మళ్లీ ఒక దమ్ము లాగమన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. అతను వదిలిపెట్టలేదు. ఆమె సిగరెట్ వేళ్లలోకి తీసుకుంది. సిగరెట్ ఎలా పట్టుకోవాలో అతను పట్టుకొని చూపాడు. ఆమె సిగరెట్ పెదవుల మధ్య పెట్టుకొని దమ్ములాగింది. అతను సిగరెట్ తీసుకున్నాడు. ఆమె మత్తులో ఉంది. నాకు ఆకలి అవుతూంది. రైలు కదిలేట్లులేదు. తర్వాతి స్టేషన్లో తీసుకోవాలనుకున్నాం.. అక్కడైతే శుభ్రంగా ఉంటుందని. రైలెప్పుడు కదులుతుందో ఒక ఉద్యోగిని అడిగాను. అతను నన్ను ఏమాత్రం లెక్కచెయ్యకుండా ‘‘నాకు తెలియదు’’ అన్నాడు. ‘‘సూదీ దారం దొరికిందా?’’ నా ఫ్రెండ్. పూలు కట్టుకొని తలలో పెట్టుకోవాలని ఆశగా ఉంది. ఆమెకు సూదీదారం దొరికితే రైలు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయినా ఫర్వాలేదు. ఆమె ఇంకా మొగ్గలలో మునిగిపోయి ఉంది. నాకేమీ పాలుపోలేదు. నా కళ్లు మరొక్కసారి మర్రిచెట్టుకింద ఉన్న వాళ్లమీదికి వాలాయి. బిచ్చగాడు కోతి ముందు కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. బహుశా ఇది చివరి దమ్ము. ‘‘బాబూజీ! ఆకలి’’ కోతిని చూసి ఆడుకుంటున్నట్లు అన్నాడు. అది ఎగిరి వెల్లకిలాపడి దాని పొట్టను చూపింది. ‘‘నాకు ఆకలిగా ఉంది బాబూజీ!’’ బిచ్చగాడు మరలా అన్నాడు. కోతి తన పొట్టను ముద్దులాడుతూంది. తన చేతులతో తన కడుపు ఖాళీగా ఉందన్నట్లు సూచించింది. బిచ్చగాడు కోతిని తట్టి ఒక కొయ్య ముక్కను దాని పాదంలోకి దోపుతూ ‘‘కరిముదిన్ ఎలా సిగరెట్ తాగుతాడు?’’ అనడిగాడు. కోతి కర్రముక్కను తీసుకుని వేళ్ల మధ్య పెట్టుకొని, సిగరెట్ బూడిదను రాల్చినట్లు ఆడించింది. మళ్లీ నోటిదగ్గర పెట్టుకొని పీల్చింది. తర్వాత నోట్లో నుంచి, చెవులలోంచి పొగవదులుతున్నట్లుగా ముఖం పెట్టింది. ‘‘చూడు కరిముదిన్ ఆఫీసులో బాబు ఎలా తాగుతాడు?’’ కరిముదిన్ కర్రముక్కను పెదవుల మధ్య పెట్టుకొని దానిని వేలాడించింది. మరో ముక్కతో పేపర్‌మీద రాయడం మొదలుపెట్టింది. ‘‘ఆ బిచ్చగాళ్లను సూదీ దారం అడగలేకపోయారా? దానికి డబ్బులివ్వాలి..’’ నా ఫ్రెండ్ ఎట్టకేలకు తన పని ముగించింది. నాకోసం చూస్తూంది. ‘‘బాబూజీ నాకు ఆకలిగా ఉంది’’.ఒక అలిసిపోయిన ముసలి స్వరం దూరం నుంచి వినిపించింది. నేను అటు చూశాను. గుడ్డి ముసలాయన తన ముసలి భార్య భుజం మీద చెయ్యివేసి వస్తున్నాడు. వాళ్లు మా కిటికీ దగ్గరికి వచ్చారు. నేను తల తిప్పుకున్నాను. ఈసారి నా ఫ్రెండ్ ఒక నాణెం తీసుకుని ముసలాయన చేతిలో పెట్టింది. ఆ ముసలాయన కలకాలం మాంగల్యంతో బాగా బతుకమ్మా అంటూ వెళ్లిపోయాడు. కాస్సేపటికి వాళ్ల ప్రార్థన వినబడుతూంది. పంజాబీ మూలం: కర్తార్ సింగ్ దుగ్గల్ అనువాదం : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
గుడ్డలు కుక్కి... చేతులు విరిచి
ఖమ్మం క్రైం: అనారోగ్యంతో తల్లి చనిపోవటంతో పసిబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారు.. తల్లి లాంటి అమ్మమ్మ వారిని సముదాయించాల్సింది పోయి.. మద్యం మత్తులో వారిని చితకబాదింది. ఏడాదిన్నర బిడ్డ తల్లి కోసం ఏడుస్తుండటంతో ఆ చిన్నారి చేతులను విరిచేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ ప్రాంతంలోని కాల్వొడ్డుకు చెందిన షేక్ సోందు కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. భార్య సైదాబీ తన ముగ్గురు ఆడపిల్లలు హుస్సేన్‌బీ(6), ఆసియా(3), జైనా(ఏడాదిన్నర), తల్లి కాశీంబీతో కలసి వెంకటగిరి ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లతో నివాసం ఏర్పాటు చేసుకొని.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో సైదాబీ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లికోసం ఏడుస్తుండటంతో.. మద్యం మత్తులో ఉన్న అమ్మమ్మ కాశీంబీ వారిని తీవ్రంగా కొట్టింది. భయపడిన చిన్నారి ఆసియా ఏడుపు ఆపింది. మరో చిన్నారి జైనా ఏడుపు ఆపకపోవటంతో చితక్కొట్టింది. పక్కనున్న వారి గద్దించడంతో కొట్టడం ఆపేసింది. చుట్టుపక్కల వారు పడుకున్న తర్వాత కాశీంబీ తల్లిపాల కోసం ఏడుస్తున్న జైనా నోట్లో గుడ్డలు కుక్కి.. దారుణంగా చేతులు విరిచేసింది. భయంతో ఆసియా ఓ మూలన నక్కి పడుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సైదాబీ మృతదేహం చూసేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు వేలాడుతున్న చిన్నారి చేతులను చూసి కాశీంబీని గద్దించారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా.. ఆశియా తన చెల్లెలిని రాత్రి నుంచి కొడుతూనే ఉందని చెప్పింది. స్థానికులు స్వచ్ఛంద సంస్థ అన్నం ఫౌండేషన్‌కు ఫోన్ చేయడంతో ఆ సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావుతో పాటుగా వన్‌టౌన్ సీఐ రమేశ్ వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చింతకాని హాస్టల్లో ఉంటోన్న పెద్ద కుమార్తె హుస్సేన్‌బీని తీసుకొచ్చి గంజేషాహిద్ మసీద్ కమిటీ వారు సైదాబీకి అంత్యక్రియలు నిర్వహించారు. జైనా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, హుస్సేన్‌బీ.. ఆసియాలను అన్నం ఫౌండేషన్ చేరదీసింది. వారు ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడి.. ఆ చిన్నారులను బాలసదన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మమ్మ కాశీంబీ పారిపోయింది. -
ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత
కారాకాస్, వెనెజులా : ఆ బ్రిడ్జి దాటితే చాలు.. గుక్కెడు నీళ్లు తాగొచ్చు. ఆ బ్రిడ్జి దాటితే చాలు ఒక్క ముద్ద యంగిలి పడొచ్చు. ఇది సగటు వెనెజులా వాసి ఆలోచన. కొలంబియా దేశానికి వలస పోవడమే లక్ష్యంగా వేలాది మంది వెనెజులియన్లు కదులుతున్నారు. రోజు రోజుకూ తీవ్రమవుతోన్న ఆర్థిక సంక్షోభం, పరుగెడుతున్న ద్రవ్యోల్బణం, ఆకలి, రాజకీయ అస్థిరత వెనెజులా ప్రజల పాలిట శాపంగా మారింది. రాయిటర్స్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో వెనెజులా రాజధాని కరాకస్‌లో 162 దోపిడీలు జరిగాయి. వీటిలో 42 ట్రక్కుల దోపిడీలు ఉన్నాయి. ఈ దోపడిల్లో ఎనిమిది హత్యలు జరిగాయి. అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి. ట్రక్కులపై దాడులు పెరుగుతుండటంతో రవాణా ఖరీదు కూడా బాగా పెరిగింది. ఆకలిని తట్టుకోలేక.. ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రవాణా మార్గం ద్వారా తరలిస్తున్న ఆహార పదార్థాలను దోచుకునే గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న వారిని హత్య చేసి పదార్థాలను దుండగులు దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరగడంతో వాటికి ‘మ్యాడ్ మ్యాక్స్ వైలెన్స్’ అని పేరు పెట్టారు. వెనెజులా-కొలంబియాల మధ్య కీలక మార్గంగా ఉన్న సిమోన్ బొలివర్ ఇంటర్నేషనల్ బ్రిడ్జి గుండా కొలంబియాలోకి ప్రవేశించేందుకు వెనెజులియన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. దేశంలోకి ప్రవేశించడానికి యత్నించేవారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొలంబియాను ఆనుకుని ఉన్న బ్రెజిల్ సైతం సరిహద్దులో భద్రతను పెంచింది. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పింది.