వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు వారి సంపదలో చాలా తక్కువ మొత్తాన్ని దానం చేస్తే భూమ్మీద ఆకలి సమస్య ఉండదన్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ ఫౌండర్, బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ క్రమంలో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీకి ఓ సవాలు విసిరారు ఎలన్ మస్క్. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ మంచి ప్రణాళికతో వస్తే తాను 6 బిలియన్ డాలర్లు(4,49,13,30,00,000 రూపాయలు) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు.
కొన్ని రోజుల క్రితం యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ సంస్థ డైరెక్టర్ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. ‘‘మస్క్ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చు’’ అన్నారు. సీఎన్‌ఎన్‌లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్‌ని ఎలన్ మస్క్ సంస్థ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలి డేవిడ్ ట్వీట్ చేశారు.
(చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!)
ఎలి డేవిడ్ ట్వీట్‌పై మస్క్ స్పందిస్తూ.. ‘‘6 బిలియన్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఇక్కడ ట్విటర్ థ్రెడ్‌లో నాకు తెలిపితే.. నేను ఇప్పుడే టెస్లా స్టాక్‌ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాను’’ అన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్‌గా ఉండాలని సూచించారు మస్క్.
యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ అంశంపై యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ.. ‘‘మస్క్ తన సందలో కేవలం 2 శాతం దానం చేస్తే.. 42 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. మనం వారిని ఆదుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు.
(చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!)
తన వ్యాఖ్యలపై బిస్లీ మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలి’’ అన్నారు.
చదవండి: ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment