American Boxer Jake Paul Promises To Donate 10 Million: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి 24 ఏళ్ల యువకుడు సవాల్ విసిరాడు. ఆకలి సమస్యని తీర్చేందుకు ఎలన్ 6 బిలియన్లను (4,49,13,30,00,000 రూపాయలు) అందిస్తే తాను 10మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని తెలిపాడు. అయితే ఇందుకు తాను పెట్టిన ఒక షరతును ఎలన్ ఒప్పుకోవాలని తెలిపాడు.
ఇటీవల యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్‌లీ మాట్లాడుతూ..వరల్డ్ వైడ్‌గా 155 మిలియన్ల మందికి సరైన ఆహార లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు సంపన్నులైన అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌లు 6 బిలియన్ల డాలర్లను డొనేట్ చేయాలని కోరారు. అయితే డేవిడ్ బిస్లీ వ్యాఖ్యలపై ఎలన్ స్పందించారు. 6 బిలియన్ల డాలర్లతో ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార సమస్యను ఎలా పరిష్కరించవచ్చో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఆ ప్రణాళికను ప్రజలందరి ఎదుట బహిర్గతం చేస్తే తాను తన టెస్లా షేర్లు అమ్మి ఆ మొత్తాన్ని దానం చేస్తామని స్పష్టం చేశారు. ఆ అంశం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చాంశనీయమైంది.
ఎలన్ చేసిన ప్రకటనపై 24ఏళ్ల అమెరికన్ బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ స్పందించారు. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీకి తాను 10 మిలియన్లను (74,50,05,000.00 రూపాయలు) విరాళంగా అందిస్తానని చెప్పాడు. అయితే తాను డొనేషన్ ఇవ్వాలంటే ఈ రెండు కండీషన్లకు కట్టుబడి ఉండాలని తెలిపాడు. అందులో ఒకటి మస్క్ 6 బిలియన్ డాలర్లను ఇవ్వడం, రెండోది తాను చేసిన ట్వీట్‌కు 690కే రీట్వీట్ వస్తే విరాళం ఇస్తామని చెప్పాడు. కాగా,పాల్ చేసిన ట్వీట్‌కి ఇప్పటివరకు 10,000 రీట్వీట్లు వచ్చాయి.
చదవండి: ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను
Comments
Please login to add a commentAdd a comment