విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది | Afghanistan one more heart wrenching incidents kid Passed away with hungry | Sakshi
Sakshi News home page

Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది

Published Sat, Aug 21 2021 6:56 PM | Last Updated on Sat, Aug 21 2021 8:31 PM

Afghanistan one more heart wrenching incidents kid Passed away with hungry - Sakshi

కాబూల్‌: తాలిబన్ల ఆధీనంలోని అఫ్గాన్‌లో పరిస్థితులు రోజుకు రోజుకూ మరింత దుర్భరంగా మారుతున్నాయి. తాజాగా అకలితో అలమటిస్తూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన  వైనం హృదయవిదారకంగా నిలిచింది. ఆహారం లేక ఆకలితో అలమటించి కన్న తల్లితండ్రుల చేతుల్లోనే కన్నుమూసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారిని ఎత్తుకుని తండ్రి  బోరును విలపిస్తున్న తీరు పలువురిన్ని  కంట తడిపెట్టించింది.  

కాబూల్‌ విమానాశ్రయం బయట ఈ విషాదం నెలకొంది. తాలిబన్ల చేత చిక్కిన మాతృదేశం నుంచి ఎలాగైనా బయటపడాలని అఫ్లాన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విమానమెక్కి మరేదేశమైనా వెళ్దామని కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని నిద్రాహారాలు మాని రేయింబవళ్లు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తినేందుకు తిండి, తాకేందుకు నీరు కరువైన వేళ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement