తప్పు చేసి దొరికిపోయాను..ఇంకేం చేయాలి! | Dog Gets Caught While Stealing Food Its Disappointed Look Breaks Hearts | Sakshi
Sakshi News home page

తప్పు చేసి దొరికిపోయాను..ఇంకేం చేయాలి!

Published Sat, Oct 16 2021 7:48 AM | Last Updated on Sat, Oct 16 2021 4:00 PM

Dog Gets Caught While Stealing Food Its Disappointed Look Breaks Hearts - Sakshi

ప్రేమ.. పశ్చాత్తాపం.. నిరాశ ప్రతీ జీవిలోనూ ఒకే రకంగా ఉందనడానికి ఇదొక ఉదాహరణ. దొంగిలించిన వస్తువుతో పట్టుబడిపోతే మనుషులు ఎలా సిగ్గుపడిపోతారో.. జంతువులు కూడా అలానే ఉంటాయా అంటే కాదనలేం. తాజాగా వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో కుక్క ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని దొంగిలించడమే కాకుండా తినే టైమ్‌లో ఆ ఇంటి యాజమానికి చిక్కడంతో ఏమీ  చేయాలో అర్థం కాలేదు. కాసేపు అలానే ఉండిపోవడమే కాకుండా నిరాశగా పశ్చాత్తాపు పడుతున్నట్లు కుక్క ముఖంలో కనిపించింది. 

పాపం అది ఇంటి కుక్కే.. కానీ ఆకలి అయ్యిందో ఏమో, వంట గదిలో ఉన్న ఫుడ్‌ బాక్స్‌ను కాళ్లతో లాగీ మరీ తీసుకుంది. నోటితో కరిచి పట్టుకుని ఆ బాక్స్‌ను ఓపెన్‌ చేసే సమయంలో ‘నువ్వు ఏం చేస్తున్నావ్‌ అంటూ’ అంటూ ఒక మహిళ అరుపు వినిపించింది. అంతే ఆ బాక్స్‌తో కాసేపు అలానే ఉండిపోయిన కుక్క.. బాక్స్‌ను కిందిపడేసింది. ఇంకా ఆ కుక్కపై సదరు మహిళ అరుస్తూ ఉండటంతో చేసేది లేక అక్కడ్నుంచి పారిపోయింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఆ కుక్క ముఖంలో నిరాశను నేను చూడలేకపోయాను.. ఫుడ్‌ మొత్తం ఇవ్వండి’ అంటూ ఒకరు ట్వీట్‌ చేయగా, ‘నువ్వు పట్టుబడిపోయావ్‌’ అంటూ మరొకను సరదాగా ట్వీట్‌ చేశాడు. ఈ వైరల్‌ క్లిప్‌కు ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. చదవండి: ప్రేమకు భాషలేదు.. రీట్వీట్ల హోరు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement