రంగారెడ్డి(మేడ్చల్): ఓ ప్రబుద్ధుడు అద్దెకు ఇచ్చిన లారీని యజమానికి తెలియకుండా అమ్మేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... మేడ్చల్ పరిధిలోని గిర్మాపూర్‌కు చెందిన వంగేటి రాజిరెడ్డి తన లారీని అదే గ్రామానికి చెందిన రఘురాంరెడ్డికి ఆరు నెలల క్రితం అద్దెకు ఇచ్చాడు. ఇటీవల రఘురాంరెడ్డి రాజిరెడ్డికి తెలియకుండా లారీని అమ్మేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ తెలిపారు.