నల్లగొండ జిల్లా పోలీసులు దొంగలుగా మారారు. మేతకోసం వచ్చిన మేకలను ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. వీరి నిర్వాకంతో కంగుతిన్న మేకల యజమాని వేరే గత్యంతరం లేక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిజంగానే పోలీసులు మేకలు అమ్మకున్నారని తెలిసింది. ఈ విషయం బయటకు తెలిసి జనాలు ఫక్కుమని నవ్వుతున్నారు.