goats
-
మేకలకు కటకటాలు!
చట్టం ముందు మనుషులైనా, మేకలైనా సమానమే అనుకున్నారు అమెరికన్ పోలీసులు. పాదచారులను వెంబడించే ఆకతాయిల మాదిరి వాషింగ్టన్ నగర వీధుల్లో ఓ రెండు మేకలు హల్చల్ చేశాయి. స్థానికుల ఇళ్ల ముంగిళ్లలో పెంచుకున్న తోటల్లోకి చొరబడి చెట్ల ఆకులు, గడ్డి తినటం, పాదచారులను వెంబడించటమే కాకుండా, అడ్డు వచ్చిన వారిని కుమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాయి. ఈ మేకల ధాటికి బెంబేలెత్తిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా పోలీసులు ఆ రెండు మేకలనూ అదుపులోకి తీసుకుని, కటకటాల్లోకి నెట్టారు. అధికారులు వాటిని కింగ్ కౌంటీ యానిమల్ షెల్టర్‌కు తీసుకెళ్లి, వాటి యజమానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి యజమాని ఎవరో తెలియలేదు కాని, ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేకల అరెస్టు వార్తపై ఎంతోమంది ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే, మరెంతోమంది జంతుప్రేమికులు మాత్రం ‘ఎవరైనా మూగ జీవులను జైల్లో పెడతారా?’ అంటూ మండిపడుతున్నారు. చెరలో ఉన్న ఆ రెండు మేకలనూ విడిపించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేకలకు ఏం జరుగుతుందో చూడాలి మరి! ఆ రెండు మేకలకు చేసిన తప్పుకు జైలు శిక్ష పడుతుందో? లేక పోలీసులు సానుకూలంగా స్పందించి మేకలను విడుదల చేస్తారో? -
జీవాలు తగ్గినయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం జీవాలు తగ్గినట్టు సామాజిక, ఆర్థిక సర్వే–2024 గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,81,605 గొర్రెలు, 49,06,465 మేకలు కలిపి మొత్తం 2,39,88,070 జీవాలుండేవి. కానీ ఐదేళ్ల తర్వాత గణన చేపడితే ఆ సంఖ్య 1.62 కోట్లకు తగ్గిపోయిందని (32.40%) సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 1,75,115 కుటుంబాల వద్ద ప్రస్తుతం 1,24,14,299 గొర్రెలు, 38,02,609 మేకలు కలిపి 1,62,16,908 జీవాలున్నాయని తెలిపింది.వరంగల్‌లో 5 లక్షలు గాయబ్జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్ జిల్లాలో అత్యధిక శాతం జీవాలు తగ్గాయని ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గొర్రెలు, మేకలు కలిపి 2019లో 1.89 లక్షలు ఉంటే 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 74 వేలకు తగ్గిపోయింది. వరంగల్‌లో అత్యధికంగా ఐదేళ్లలో ఐదు లక్షల వరకు జీవాలు మాయమయ్యాయి. 2019లో వరంగల్ జిల్లాలో 8.3 లక్షలున్న జీవాలు 2024కు వచ్చేసరికి 3.33 లక్షలకు తగ్గిపోయాయి.అదే విధంగా సంగారెడ్డిలో 3.50 లక్షలు, మెదక్‌లో 3.9 లక్షలు, నిజామాబాద్‌లో 4.2 లక్షలు, సిద్దిపేటలో 4.5 లక్షలు.. ఇలా పెద్ద సంఖ్యలో జీవాలు తగ్గిపోయా యని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేవైనా ఇంత పెద్ద సంఖ్యలో జీవాల తగ్గుదల మంచిది కాదని, ఆయా జిల్లాల్లో త్వరలోనే మాంసం సంక్షోభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో వనపర్తి, గద్వాల, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో కొంతమేర జీవాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.గొర్రెలు కావాలి మహాప్రభోవాస్తవానికి 2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు రూ.5వేల కోట్లకు పైగా వెచ్చించి 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసింది. దీంతో అటు జీవాల సంఖ్యలోనూ, మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణలో భారీ వృద్ధి కనిపించింది. ఆ గొర్రెలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ గొర్రెల పథకంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది గొర్రెల కాపరులు ఎదురుచూస్తున్నారు. 85 వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీశారు. వారికి సంబంధించిన రూ.430 కోట్లు ఇంకా కలెక్టర్ల ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మరో 2.20 లక్షలకు పైగా లబ్ధిదారులు డీడీలు తీయాల్సి ఉంది. -
బక్రీద్ వేడుక: మేకలు, గొర్రెలతో మార్కెట్లలో నెలకొన్న సందడి
-
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్‌గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్‌గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్‌గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!) -
మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!
మనుషులకు విధించినట్లు జంతువులకు కూడా జైలు శిక్షలు విధిస్తారని విన్నారా?. ఔను! ఇది నిజం. ఇక్కడొక దేశం మేకలకు అలానే శిక్ష విధించి వార్తల్లో నిలిచింది. ఏం తప్పు చేశాయని అంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాకవ్వుతారు. ఇదేం విడ్డూరం రా బాబు..! అనుకోకండి. ఇలాంటివి అక్కడ మాములేనట. పాపం ఆ మేకలు ఒకటి రెండు రోజులు కాదు ..ఏకంగా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాయి. వివరాల్లోకెళ్తే..ఈ వింత ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్‌కి చెందిన తొమ్మిది మేకులడిసెంబర్ 6, 2022న స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు. అలా అప్పటి నుంచి బారిసాల్‌లో బార్ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉండిపోయాయి. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు పలు విధాల యత్నించి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవలే ఎన్నికైన బరిషల్ సిటీ కార్పొరేషన్ మేయర్‌ని సంప్రదించి తన గోడును చెప్పుకున్నాడు. దీంతో ఆయన చొరవ కారణంగా బంగ్లాదేశ్ అడ్మనిస్ట్రేటివ్ అదికారులు రాజీబ్‌కు తొమ్మిది మేకలను విడుదల చేసి తిరిగి అప్పగించారు. దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. ఇలా జంతువులకు శిక్ష విధించిన ఘటన మొదటిది కాదు. రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి ప్రావిన్స్‌లో సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పడేశారు. Nine goats freed after one year in jail for eating grass in Barishal graveyard!#Bangladesh #barishal https://t.co/8vLLSSOgRf — UNB - United News of Bangladesh (@unbnewsroom) November 24, 2023 (చదవండి: ఆ లాటరీ టికెట్ వెయిటర్ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!) (మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానెల్‌పై క్లిక్ చేయండి) -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అహ్మద్‌నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
సంకర జాతి మేకల బిజినెస్.. లాభాలు ఆర్జిస్తున్న ఎన్నారై రైతు
ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్‌లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికా బోయర్ రకం ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్‌కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది. 8 నెలల్లోనే 40 కిలోలు.. తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్‌లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్‌గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్‌ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్‌ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి. – కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది. – విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ, అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. -
నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్..
ముంబై: మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ధూమ్ సినిమాను తలపించేలా ఓ దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ కారు వచ్చింది. ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్‌గా ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట ఈ చోరీ ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిందని ప్రచారం జరిగింది. దీంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్పురి-ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कानपुर उन्नाव हाइवे पे ट्रक से बकरे चोरी करने वाला गिरोह जो लग्जरी कार से चोरी कर रहा.... वीडियो गौर से देखिए........@Uppolice pic.twitter.com/ytC6m6owgI — Mohit Sharma (@Mohit_Casual_) April 30, 2023 ఈ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు. అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడని జోకులు పేల్చారు. చదవండి: బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్ -
'చీజ్' బడీహై మస్త్ మస్త్!
అతనో మారుమూల పల్లె వాసి..బతుకుతెరువు కోసం పొట్ట చేతబట్టుకునిముంబైకి వలస వెళ్లాడు. కూలీగా మొదలుపెట్టి కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. సుమారు 35 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఆయన.. సొంత గ్రామానికి క్రమం తప్పకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాడు. తనకు పుట్టిన కుమారుడు అక్కడే పెరిగి పెద్దయినామానుకోలేదు. తండ్రి పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో సొంతూరులో ఏదైనా వ్యాపారం పెట్టాలని సంకల్పించాడు. వినూత్న ఆలోచనతో అమెరికా, దక్షిణ ఆఫ్రికా మేకల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో చీజ్ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇది..మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సాలార్‌నగర్ గ్రామానికి చెందిన జగదీశ్ ఖలాల్ సక్సెస్ స్టోరీ. 30 నుంచి 300కు పైగా.. మేకలు పెంచాలన్న ఆలోచన రాగానే సాలార్నగర్లో తనకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖలాల్ మొదట మామిడి, టేకు వంటి వివిధ రకాల మొక్కలు నాటాడు. ఆ తర్వాత మేకల ఉత్పత్తికి ప్రత్యేక షెడ్డు వేశాడు. అత్యధిక మాంసంతో పాటు పాలు ఇచ్చే అమెరికాకు చెందిన సానెన్, దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాడు. 30 మేకలు, ఒక పొట్టేలుతో షెడ్డు ప్రారంభించాడు. మూడేళ్లలోనే జీవాల సంఖ్య 300కు పైగా పెరిగింది. పాలు అధికంగా ఇచ్చే సానెన్ రకానికి చెందిన మేక ఒక ఈతలో రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్ల మేక మూడు నెలల్లోనే 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఒక్కో మేక మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా మాంసాన్ని ఇచ్చే బోయర్ రకానికి చెందిన మేక కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా పెరుగుతుంది. ఇది 14 నెలల్లో రెండు ఈతల్లో రెండు చొప్పున నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కో మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ప్రత్యేక షెడ్.. దాణా.. మేకల కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేశారు. మేకలకు ఏ విధమైన హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేలపై పెంచకుండా మూడు, నాలుగడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు. రోగాలు సోకకుండా అత్యంత శుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తోంది. దాణా కోసం మొక్కజొన్న పచ్చి మేతను టన్నుల లెక్కన బిహార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం అన్ని రకాల పోషçకాలతో కూడిన దాణాను ఆహారంగా ఇస్తున్నారు. శుభ్రమైన నీటిని అందిస్తున్నారు. మధ్యాహ్నం సొంతంగా తయారుచేసిన జొన్న, మొక్కజొన్న కుడితి లాంటిది ఇస్తున్నారు. ఇలా రోజుకు మూడు పూటలు.. ఒక్కో మేకకు మొత్తంగా నాలుగు నుంచి ఆరు కిలోల దాణాను అందిస్తున్నారు. ఒక్క ఆవు పోషకంతో ఇలాంటి 10 మేకలను పెంచుకోవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సానెన్ మేక పాలతో నాణ్యమైన చీజ్.. ఈ మేకల పాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి పాలను చీజ్ తయారు చేసేందుకు, ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ప్రధానంగా సానెన్ రకానికి చెందిన మేకల పాలతో అత్యంత నాణ్యమైన చీజ్ తయారుచేసే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో ఈ జాతి పెంపకంపై దృష్టి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో మేక రెండు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. ఈ పాలను హైదరాబాద్‌కు తరలిస్తే లీటర్‌కు రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాలు పెద్ద మొత్తంలో లేకపోవడంతో స్థానిక పాలకేంద్రాల్లో లీటర్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు షెడ్డు కాపలాదారు ఆంజనేయులు చెప్పాడు. బోయర్ విత్తన మేకపోతు రూ.3 లక్షలు బోయర్ జాతి మేక సుమారు 70 కిలోల నుంచి క్వింటా వరకు మాంసాన్ని ఇస్తుంది. అదే మేకపోతు అయితే 1.5 క్వింటా వరకు మాంసం ఇస్తుందని అంచనా. బోయర్ విత్తన మేకపోతు ధర రూ.3 లక్షల వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా.. మొత్తం వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే.. అక్కడే చీజ్ మేకింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ షెడ్డును కంపెనీయే తీసుకుని చీజ్ మేకింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని జగదీశ్ ఖలాల్ తెలిపాడు. ఈ లెక్కన మేకల సంఖ్య కనీసం వెయ్యికి పెరగాల్సి ఉంటుందని, దీంతో వచ్చే మూడేళ్లలో వెయ్యి మేకల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. వెయ్యి మేకలకు సరిపడా అన్ని రకాల ఏర్పాట్లతో షెడ్ నిర్మాణం చేస్తున్నామని, ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని పేర్కొన్నాడు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే!
ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా, ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. నిరంతర ఆదాయం వచ్చేలా సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టి.. నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరించి చూపుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు దంపతులు వాసికర్ల శేషుకుమార్, లక్ష్మీప్రియ. ఎమ్మే చదువుకొని రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు దంపతులకు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ సేద్య పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు వాసికర్ల శేషుకుమార్(53), లక్ష్మీప్రియ దంపతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్(53) ఎమ్మే చదువుకొని గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన 25 ఎకరాల్లో డ్రమ్‌సీడర్, వెద పద్ధతుల్లో వరి పండిస్తున్నారు. నాగార్జునసాగర్ కాల్వ పక్కనే పొలం ఉండటంతో సాగు నీటికి దిగులు లేదు. వరి సాగు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో వరికి బదులుగా.. కాయకష్టం చేసే రైతు కుటుంబాలకు రోజూ ఆదాయాన్నిచ్చే సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనా వైపు ఏడాదిన్నర క్రితం దృష్టి సారించారు. నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టారు. ఈ క్షేత్రం ప్రదర్శన క్షేత్రంగా, రైతులకు శిక్షణా కేంద్రంగా మారింది. శేషు అనుసరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య నమూనా రైతులను ఆకర్షిస్తోంది. కూరగాయలు, పశుగ్రాస పంటలతో పాటు దీర్ఘకాలిక పండ్ల చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. దీనితో పాటు.. మేకలు గొర్రెలు, నాటుకోళ్లు, పుట్టగొడుగులు, ముత్యాల పెంపకాన్ని చేపట్టి ఒకటికి నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఈ నమూనాలో ప్రత్యేకత. 5 వేల ఆల్చిప్పల్లో ముత్యాల సాగు ఎకరంన్నరలో మొదట గొర్రెలు, మేకలు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్ షెడ్‌ను రూ. 5 లక్షల ఖర్చుతో నిర్మించారు. షెడ్ పైఅంతస్థులో మేకలు, గొర్రెలు పెరుగుతూ ఉంటే.. షెడ్ కింద కొంత భాగంలో నాటు కోళ్ళ పెంపకకానికి శ్రీకారం చుట్టారు. షెడ్ కింద మిగతా భాగంలో ఒక డార్క్ రూమ్‌ను నిర్మించి పాల పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. 3 సిమెంటు ట్యాంకులు నిర్మించి స్థానికంగా సేకరించిన 5 వేల ఆల్చిప్పల్లో 3 నెలల క్రితం ముత్యాల సాగు ప్రారంభించారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర.. ఇంకా.. ఈ సమీకృత వ్యవసాయం క్షేత్రం చుట్టూ ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. చుట్టూతా కొబ్బరి, డ్రాగన్‌ఫ్రూట్ తదితర దీర్ఘకాలిక పండ్ల మొక్కలు నాటారు. ప్లాస్టిక్ షీట్‌తో మల్చింగ్ చేసి.. బోడ కాకర, బీర, సొర, కాకర సాగు చేపట్టారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర, బీర, సొర, నేతి బీర, కాకర, పొట్ల, చిక్కుడు, మునగ, బంతి, గులాబీ తదితర రకాల పంటల సాగు చేపట్టారు. పశువుల కోసం నేపియర్, దశరధ గడ్డి, మొక్కజొన్న గడ్డిని పెంచుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా చోటు వృథా కాకుండా అధిక సాంద్రతలో అనేక పంటలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించటం లేదు. ఒకటికి నాలుగు దారుల్లో ఆదాయం పొందే సాగు పద్ధతిపై చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు స్ఫూర్తినిస్తున్న శేషుకుమార్ దంపతులు ధన్యులు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా చిన్న రైతులు నిత్యం ఆదాయం పొందాలి వరి పంట సాగులో పెట్టుబడులు బాగా పెరిగాయి. కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో నిత్యం ఆదాయం పొందే విధంగా ఈ సమీకృత వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. తక్కువ భూమిలో విభిన్న రకాల పంటల సాగు చేపట్టాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. – వాసికర్ల లక్ష్మీప్రియ, సమీకృత సేంద్రియ మహిళా రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా సులువుగా సేంద్రియ పుట్టగొడుగుల పెంపకం సమీకృత వ్యయసాయ క్షేత్రంలో షెడ్డులో సేంద్రియ పద్ధతుల్లో పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. వరిగడ్డి ముక్కలను, మట్టిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, పుట్టగొడుగుల పెంపకానికి పాలిథిన్ బ్యాగ్‌లను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధమైన 27 డిగ్రీల వాతావరణంలో గాలి, వెల్తురు తగలని చీకటి గదిలో జరుగుతుంది. బ్యాగ్‌లలో నింపిన గడ్డిపై మైసీలియం అనే శిలీంధ్రం అభివృద్ధి చెందిన తర్వాత బ్యాగ్‌లను మామూలు గదిలోకి మార్చుతారు. వారం తర్వాత నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. వరిగడ్డి ముక్కలను స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ సహాయంతో ఆవిరి ద్వారా శుద్ధి చేసే ప్రత్యేక పద్ధతిని శేషు అనుసరిస్తున్నారు. దీని వల్ల గడ్డి వెంటనే తడి ఆరిపోతుందన్నారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం సులభతరమైందని శేషు చెప్పారు. ముత్యాల సాగును ఒక్క రోజులో నేర్చుకోవచ్చు ఎకరంన్నరలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న శేషుకుమార్ దంపతులు ప్రత్యేక షెడ్లో మూడు సిమెంటు ట్యాంకులను నిర్మించి ముత్యాల సాగు చేపట్టారు. దేవతా రూపాల్లో డిజైనర్ ముత్యాలైతే 14 నెలల్లో, ఎం.ఓ.పి. న్యూక్లియస్‌ల ద్వారా గుండ్రటి ముత్యాలైతే 18 నెలల్లో దిగుబడి వస్తుందన్నారు. ఒక ఆల్చిప్పకు రెండు ముత్యాలు వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. సగటున ధర రూ. 150–200 ఉంటుంది. ఒక రోజు శిక్షణతో మహిళలు కూడా ముత్యాల సాగును నేర్చుకోవచ్చు. చిన్న రైతులకు దారి చూపాలని.. భూమి తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతు దంపతులు ఏదో ఒకే పంట సాగుపై ఆధారపడితే తగినంత ఆదాయం రాదు. సమీకృత సేంద్రియ సాగు చేపడితే రోజువారీగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని, ఎకరంన్నర పొలంలో ఈ క్షేత్రాన్ని రూపొందించాం. ఎకరంన్నర భూమిలో భార్య, భర్త స్వయంకృషి చేస్తే అన్ని ఖర్చులూ పోను రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం వస్తోంది. ఈ సందేశం రైతులందరికీ తెలియజెప్పాలనేదే మా తపన. రోజుకు రూ.1,500 ఆదాయం వస్తున్నది. రెండు వేలకు పెంచాలనేది లక్ష్యం. ప్రతి రైతూ ముందుకు రావాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. – వాసికర్ల శేషుకుమార్ (91824 06310), సమీకృత సేంద్రియ రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా చదవండి: నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే! 70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా -
అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు...అందర్నీ బకరాలు చేశాయిగా!
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉండే వైరల్ వీడియో. అందరికీ మేకలు ఎలా ఉంటాయో తెలుసు. ఐతే ఈ వీడియోలో కొన్ని మేకలు చాల మాత్రం భలే చేశాయి. అవన్న ఒక చోట గడ్డి మేస్తు ఉన్నాయి. ఇంతలో అటుగా ఒక పార్సిల్ ట్రక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటుండి మేకలన్ని కింద పడిపోతాయి. వాస్తవానికి ఆ ట్రక్కు వాటి పక్క నుంచి వెళ్తుందే తప్ప వాటిని ఢీ కొట్టలేదు. ఈ మేకలు మాత్రం ఆ ట్రక్కు రావడమే తరువాయి ఒకేసారి అన్ని మేకలు చనిపోయినట్టుగా కింద పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ మేకలు చూసి ఫిదా అవుతూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వే సన్నివేశం అంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. Fainting Goats Meet UPS Truck 😆🐐🚚#viralhog #faintinggoats #pets #humor pic.twitter.com/cxqLWZZKjx — ViralHog (@ViralHog) October 19, 2022 (చదవండి: బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ) -
పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!
సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. గొర్రెల మందలే లోకంగా.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. బీపీ, షుగర్లు దరిచేరవట! గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ) చిరుతపులి వెంట పడ్డాం.. పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. – చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా కాపరుల జీవితమంతా కష్టాలే.. గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. – జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. – కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. – మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి -
మేకల కాపరిగా కామాగిరి సర్పంచ్
ఇచ్చోడ: అభివృద్ధి పనులకు నిధులు సరిపోలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు.. దీంతో సొంత డబ్బు వెచ్చించి.. అప్పులు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక.. కుటుంబాన్ని పోషించేందుకు మేకలు కాస్తున్నాడు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్ తొడసం భీంరావు దుస్థితి ఇది. కూలి పనులు చేసుకునే ఆదివాసీ దివ్యాంగుడు భీంరావు కామాగిరి జనరల్ స్థానం నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీకి వస్తున్న అరకొర నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటం, కుటుంబ పోషణ భారంగా మారడంతో విధిలేని పరిస్థితిలో రోజుకు రూ.200 కూలి కోసం మేకల కాపరిగా మారారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా మారానని భీంరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా
సాక్షి, భూదాన్ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు. కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా? చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ -
హాట్సాఫ్ హరిత.. ‘మూగ’ ప్రేమ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ‘బుజ్జీ.. ఏం డల్‌గా ఉన్నావ్.. ఎగిరెగిరి గంతులు వేసే దానివి కదా.. ఏం.. మీ అమ్మ పాలు తాపించలేదా..’ అంటూ మేకపిల్లను ఎత్తుకుని తల్లి మేక వద్ద వదిలింది చిన్నారి హరిత. అంతేకాదు.. దానికి అది పాలు తాపించేదాకా వదలలేదు.. మరో మేకపిల్ల వద్దకు వెళ్లి ‘నువ్వేమి అలిగినట్లు కూర్చున్నావమ్మా.. నీకేమైందిరా.. దా.. నేను ఎత్తుకుంటా’ అంటూ ఒళ్లో కూచోబెట్టుకుని దాని తల నిమిరుతుంటే సమీపంలోనే ఉండే మరో మూడు మేకపిల్లలు కూడా వచ్చి చేరాయి.. ఇది సీన్ కాదు.. కట్టు కథ అసలే కాదు.. నగరంలోని గీతాంజలి వెంచర్‌కు పునాది పడక ముందు నుంచి వెంచర్ యజమాని గోపాల్‌ను వాచ్‌మేన్‌గా నియమించాడు. అక్కడే ఉండి నిర్మాణ పనులపై నిఘా పెట్టేందుకు వీలుగా యజమాని గోపాల్ దంపతులకు ఓ షెడ్డు నిర్మించి ఇచ్చారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం ఓ పద్నాలుగేళ్ల బాలుడు, ఓ పన్నెండేళ్ల బాలిక మాత్రమే వారి వద్ద ఉంటున్నారు. గోపాల్ వాచ్‌మేన్ ఉద్యోగంతో పాటు మేకల పెంపకం కూడా చేస్తున్నాడు. బాలుడు మేకల్ని మేపుకుని వస్తే.. భార్య, బాలిక ఇంట్లో మేత వేస్తుంటారు. ఈ రకంగా బాలిక హరితకు మేకలతో, మేకపిల్లలతో బాగా దోస్తీ అయింది. వాటిని వదిలిపెట్టి ఉండలేదు. హరిత ఎన్టీఆర్ నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. వీధిలో ఇటీవలే ఓ ఆడకుక్క ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కుక్క పిల్లలు పొద్దున్నుంచి ఏమీ తినలేదని బాధ పడుతుంటుంది. హరిత స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తన సొంత డబ్బుతో ఓ పాలపాకెట్ కొనుక్కుని వచ్చి, పాలను ఓ పెద్ద బాలెలో పోసి కుక్కపిల్లలకు తాపిస్తుంటుంది. ఏ కుక్కపిల్ల మిస్ కాకుండా అన్నింటిని మొదట బాలెవద్దకు తీసుకొస్తుంది.. ఆమె పాలపాకెట్ తేగానే ఆ దృశ్యం చూసేందుకు చుట్టుపక్కల చిన్నారులు కూడా అక్కడికి చేరుకుంటారు. మూగ జీవుల ఆకలి ఆక్రందనలు ఏమిటో తెలుసుకుని వాటికి ఆహారం అందించే దయా గుణం కలిగిన ఆ చిన్నారిని చూసిన ప్రతిఒక్కరు హాట్సాఫ్ చెబుతున్నారు. -
పులిని చంపేసి మేకలను కాపాడిన కాపరి
డెహ్రాడూన్: తనకు జీవనోపాధి కల్పిస్తున్న వాటిని కాపాడుకునేందుకు ఓ యువకుడు ఏకంగా పులితో పోరాడాడు. దాడి చేసేందుకు వస్తున్న వ్యాఘ్రాన్ని ఏమాత్రం బెరుకు లేకుండా పోరాడి చివరకు అంతమొందించాడు. అతడి సాహసం.. తెగువను గ్రామస్తులు మెచ్చుకున్నారు. అయితే పులిని హతమార్చడంతో కేసుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పితోర్గడ్ జిల్లా నైని గ్రామానికి చెందిన మేకల కాపరి నరేశ్ సింగ్. మేకలను మేపుతూ జీవిస్తున్నాడు. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి రోజు మాదిరిగా బుధవారం మేకలను మేత కోసం అడవి బాట పట్టాడు. మేత మేస్తున్న మేకల మందలో అలజడి మొదలైంది. ప్రాణభయంతో మేకలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏమైందా అని వెళ్లి చూడగా చిరుత పులి ప్రత్యక్షమైంది. తన మేకలను కాపాడుకునేందుకు నరేశ్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. బెదిరించాడు.. వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్న నరేశ్పైకి పులి దూసుకొచ్చింది. తన మీదకు దాడి చేసేందుకు వచ్చిన పులిపై కొడవలితో ఒక్క వేటు వేశాడు. అతడి దెబ్బకు పులి నేలకొరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరాన్ని పరిశీలించారు. అయితే పులిని హతమార్చడం వాస్తవంగా నేరం. కాకపోతే ఆత్మరక్షణ కోసం చంపడంతో నరేశ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే నరేశ్ తెగువను గ్రామస్తులు అభినందించారు. తమకు పొంచి ఉన్న పులి ముప్పును తప్పించాడని ప్రశంసించారు. చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు.. జీతం అడిగితే పోలీస్ కేసు! -
కశ్మీర్ మేక.. ధర కేక!
కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో శనివారం జరిగిన గొర్రెల సంతలో కశ్మీర్ మేకపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో వారంలో బక్రీద్ పండుగ రానుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో మేలు జాతి మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు కొనేందుకు పోటీపడ్డారు. అయితే కశ్మీర్ మేకపోతులు ఒక్కోటి రూ.50 వేలపైన పలకడం విశేషం. -
కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృతి
నరసన్నపేట: కుక్కల దాడిలో 40 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన సత్యవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా పాశిన నాగేష్కు చెందిన 30 గొర్రె, 10 మేక పిల్లలు మృతి చెందాయి. నాగేష్ తన ఇంటి ఆవరణలో పెద్ద గూడులో వీటిని ఉంచి ఇతర పనులపై కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే కుక్కల మంద దాడి చేయడంతో జీవాలు చనిపోయాయి. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
కారు డోర్ తెరిస్తే మ్మే..మ్మే..!
పోలీసులు ఒక కారును ఆపి డోర్ తెరిచారు అంతే..! మ్మే..మ్మే..అని రక్షించండో అన్నట్లు అరుస్తున్న మేకలను చూసి విస్తుపోయారు. కాళ్లు కట్టేసి, కొన్నిటికి మూతికి అడ్డంగా గుడ్డ కట్టేసి ఉన్న వాటిని బంధ విముక్తం చేశారు. ఇదేదో మేకల కిడ్నాప్లా ఉన్నట్లుందే అనుకుంటున్నారా?!..అయితే ఎస్ఐ రాజశేఖర్ సోమవారం చెప్పిన ఆ మ్మే..మ్మే..మేటరేమిటంటే.. ఆదివారం చిత్తూరు–అరగొండ రోడ్డులోని హైవే బ్రిడ్జి దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఒక స్విఫ్ట్ జైర్ కారులో 12 మేకలు పైవిధంగా ఉండటం చూసి అనుమానించారు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వీళ్లు తిరుపతి శెట్టిపల్లెకు చెందిన టి.గిరి(34), పుల్లిచెర్ల మండలం ముతుకువారిపల్లెకు చెందిన భూపతి అలియాస్ కట్టప్ప(35), బంగారుపాళెం మండలం డీకే వూరుకు చెందిన కె.జ్యోతినాథ్(26), ఇందిరమ్మకాలనీకి చెందిన కె.భరత్(23) అని, వీరంతా మేకల దొంగలని, దొంగలించిన మూగజీవాలను విక్రయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. ఈ నెల 16న మండలంలోని మడవనేరిలో శివాజి, అజయ్‌కు చెందిన ఐదు మేకలు, ఈచనేరిలో కృష్ణయ్య చెందిన ఒక పొట్టేలు, ఒక గొర్రెను చోరీ చేసింది వీళ్లేనని వెల్లడైంది. వీళ్ల నుంచి రాబట్టిన సమాచారంతో నిందితుల ఇళ్ల నుంచి మరో 4 మేకలు, 4 పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్లు తవ – తవణంపల్లె చదవండి: వింత: కోడి ఆకారంలో మేక.. నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి -
అగ్ని ప్రమాదం: కాలిబూడిదైన 90 మేకలు
భువనేశ్వర్ : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గం పరిధిలో గల లావుగుడ గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 ఇళ్లు, రెండు మేకల శాలలు దగ్ధమైన సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదంలో 90 మేకలు సజీవ దహనం కాగా లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. గ్రామంలో అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న హింజిలికాట్, అస్కా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తక్షణమే ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు అర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎండ తీవ్రతతో పాటు గాలులు వీయడంతో అప్పటికే ఇళ్లు, మేకల శాలులు మంటల్లో పూర్తిగా బూడిదయ్యాయి. బూడిౖదైన మేకల శాల ప్రభుత్వం ఆదుకోవాలి ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధి శరత్ కుమార్ మహపాత్రో, బంజనగర్ సబ్‌కలెక్టర్ రాజేంద్ర మిజ్ఞ, బీడీఓ సురంజిత్ సాహు, అదనపు తహసీల్దార్ శరత్ కుమార్ మల్లిక్ చేరుకుని బాధితులకు తక్షణ సహాయంగా ప్లాస్టిక్ కవర్లు, ఆహారం, బియ్యం, కట్టుకునేందుకు వస్త్రాలు అందించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు బిజు పక్కా గృహ పథకం కింద ఇళ్లు ఇవ్వాలని, ప్రమాదంలో సజీవ దహనమైన మేకలకు నష్ట పరిహారం, సహాయం అందించి ఆదుకోవాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధిత గ్రామస్తులు -
సినిమా కోసం హీరోల మేకల దొంగతనం
చెన్నై : దొంగలందు ఈ దొంగలు వేరయా.. నిజమే ఇది చదివితే మీకే అర్థమవుతుంది. తండ్రి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాతో హీరోలుగా మారాల్సిన ఆ ఇద్దరు అన్నదమ్ములు దొంగల అవతారమెత్తి జైలు పాలయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, న్యూ వాషర్మెన్ పేటకు చెందిన విజయ్ శంకర్ అనే వ్యక్తి సొంతంగా ‘ నీ దాన్ రాజా’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అతడి కుమారులు వి.నిరంజన్ కుమార్(30), లెనిన్ కుమార్(32)లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సినిమా పూర్తి చేయాలని భావించారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం దొంగతనాలకు సిద్ధపడ్డారు. జన సంచారం తక్కువ ఉండే గ్రామాలైన చెంగల్పేట్, మాదవరం, మింజూర్, పొన్నెరి గ్రామాల్లో మేతకు వెళ్లిన మేకల గుంపులను లక్ష్యంగా చేసుకునేవారు. ( అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు) పట్టుబడకుండా ఉండేందుకు అందులో నుంచి ఒకటి, రెండు మేకలను దొంగలించేవారు. ఈ క్రమంలో అక్టోబర్ 9న మాదవరం పలనిలో మేక దొంగతనం జరిగింది. మందలో 6 మేకలు ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవి వీడియోల ఆధారంగా సోదరులిద్దరూ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. వారిద్దరూ ఒక కారులో వచ్చినట్టు కనిపించగా, కారు నెంబరు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులే వేషాలు మార్చి, సాధారణ జనాల్లో కలిసిపోయి గమనించసాగారు. శనివారం రోజున ఆ సోదరులు నిద్రిస్తున్న మేకను దొంగలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు ఐసోలేషన్‌కి!
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ గొర్రెల కాపరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతని వద్ద ఉన్న సుమారు 50 గొర్రెలు, మేకలను ఐసోలేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గొల్లరహట్టి తాలూకాలోని గోడెకెరె గ్రామంలో చోటుచేసుకుంది. కాపరికి చెందిన మేకలు, గొర్రెలు శ్వాసకోశ సమస్య కలిగి ఉన్నాయని గమనించిన గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పశుసంవర్ధక శాఖలోని ఓ అధికారి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు) అదే విధంగా గోడెకెరె గ్రామ ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న కరోనా భయాందోళనలపై సమగ్రంగా విచారణ జరపాలని కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి, తుముకూరు జిల్లా కమిషనర్ కె. రాకేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజల విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు. గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవాలని పశుసంవర్ధక విభాగాన్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించి.. మేకలు ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అని పిలువబడే పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్(పీపీఆర్)తో బాధపడుతున్నాయని తెలిపారు. ఇక జంతువుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఇక మేకలు, గొర్రెలు కరోనాకు గురి కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ ఇతర జంతువులకు కూడా వ్యాప్తిస్తుందని గొర్రెలు, మేకలను నిర్భంధించినట్లు అధికారులు తెలిపారు.(తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్) -
దొంగతనం చేసిన మరుసటి రోజే..
వాషింగ్టన్: అమెరికాలోని ఓ డైరీ ఫామ్‌లో దొంగలు పడ్డారు. అయితే రోజు తిరిగేసరికి ఆ దొంగలు ఎత్తుకెళ్లిన మేకపిల్లలను పాకలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. దొంగల మనసు మారడానికి కారణమేంటా అని ఆలోచిస్తున్నారా.! ఎలాగో చదివేయండి.. జూన్ 22న అమెరికాలోని డైరీఫామ్ నుంచి చిన్నచిన్న మేకపిల్లలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వాటిని పెంచుచుతోన్న డైరీ ఫామ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. "గత రాత్రి కొందరు ఆరు మేక పిల్లలను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి నేను, నా కొడుకు పిచ్చివాళ్లమైపోయాం. వాటిని మా పిల్లల్లా చూస్తాం. దయచేసి వాటిని తిరిగిచ్చేయండి. వాటికి రెండు నెలల వయసు కూడా లేదు. (మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!) అసలే అవి ఆకలిగా ఉన్నాయి, ఇప్పుడింకా ఎంత భయపడుతున్నాయో! మేము వాటిని మిస్సవుతున్నాం. నా పిల్లలు తన స్నేహితులను(పెంపుడు మేకలు) కోరుకుంటున్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా తిరిగి ఇచ్చేస్తే మేము ఎక్కడా ఫిర్యాదు చేయమని రాసుకొచ్చింది. అయితే ఇది ఆ దొంగల కంట పడినట్టుంది. ఇది చదివి వారి హృదయం ద్రవించినట్లుంది. వెంటనే మరుసటి రోజు వాటిని ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేశారు. ఈ విషయాన్ని డైరీ ఫామ్ నిర్వాహకులు "మేకపిల్లలు తిరిగి ఇంటికి వచ్చేశాయ్" అంటూ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్లలు వాటిని హత్తుకుని ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!) -
మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!
ముంబై : తమ సొంత ఊరికి వెళ్లేందుకు మేకలు అమ్ముకున్న వలస కార్మికునితోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ఉచితంగా సొంతింటికి చేర్చేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ అంగీకరించింది. వివరాలు.. లాక్డౌన్ కారణంగా అనేక మంది వలస జీవులు వేరే రాష్ట్రాలలో ఇరుక్కుపోయారు. ఇటీవల లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం దేశీయ విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో చిక్కుకున్న కొంతమంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) అయితే వీరికి మార్చి నెల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో విమాన టికెట్ల కోసం నానా తంటాలు పడి రూ.30,600లు సేకరించారు. వీరిలో ఒకరికి డబ్బులు కుదరకపోవడంతో తాను పెంచుకుంటున్న మూడు మేకలను అమ్ముకుని విమానం టికెట్టు కొనుగోలు చేశాడు. కాగా కొన్ని కారణాల వల్ల ఆ విమానం రద్దు అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 28 వరకు విమానయాన సేవలపై ఆంక్షలు విధించడంతో ఈ విమానాన్ని రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ పోస్టులో తెలిపారు. తాజాగా మేకలు అమ్ముకున్న వ్యక్తిని పశ్చిమ బెంగాల్ పంపించేందుకు ఇండిగో అంగీకరించింది. కోల్‌కతాకు తిరిగి ప్రయాణించలేని ముగ్గురు ప్రయాణీకులకు తాము వసతి కల్పించామని ఇండిగో ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జూన్ 1నుంచి వలస కార్మికుల కోసం టికెట్ల బుకింగ్ తెరిచినట్లు ఇండిగో తెలిపింది. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో)