బక్రీద్ కా బకరా ఆన్లైన్లో..
'ఈద్ కేలియే బకరే లేకే జావో.. యే దేఖో.. జబ్బర్ధస్త్ ఐటమ్.. ఔర్ వో.. ఏక్ దమ్ ఝకాస్..' అంటూ ఆన్లైన్లో అరుపులు హోరెత్తుతున్నాయి. మీరింకా విన్లేదా.. అయితే ఒక్కొసారి ఓఎల్ఎక్స్ లేదా క్విక్కర్ర్ ర్ర్ర్ర్ ద్వారాలు తెరిచి బకరా కావాలనే బటన్ నొక్కండి. ఒకటే 'మే.. మే..' అరుపులు!
ఏటా ముస్లింలు ఘనంగా నిర్వహించుకునే బక్రీద్ వేడుకలో మేకలు, ఇతర జంతువులదే ప్రాధాన్యం. జాతి, రంగు, కండపుష్టినిబట్టి ఒక్కోసారి జంతువును భారీ ధరలకూ కొనుగోలు చేస్తారు. చాన్నాళ్లుగా సంతల్లో మాత్రమే సాగిన పశువుల అమ్మకాలు ఒకటిరెండేళ్ల నుంచి ఆన్ లైన్లోనూ ఊపందుకున్నాయి. ఈ నెల 25న బక్రీద్ పండుగ ఉండటంతో అమ్మకాలు మరింత జోరందుకున్నాయి.
నగరాల జాబితాలోకి ప్రవేశించగానే స్థానిక రైతులు లేదా వ్యాపారులు తమ దగ్గరున్న మేకల ఫొటోలతో పాటు పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని బేరానికి దిగొచ్చు. ఇంకొద్దిమందైతే.. 'ముందు మా దగ్గరికొచ్చి మేకల్ని చూడండి.. ఆ తర్వాతే కొనండి' లాంటి ఆఫర్ ను కూడా ప్రకటిస్తున్నారు.