Bakr Eid
-
ముస్లిం సోదరులకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
-
‘బక్రీద్’ మినహాయింపులపై కేరళకు సుప్రీం నోటీసులు
-
రేపు కశ్మీర్లో ఆంక్షల సడలింపు..!
శ్రీనగర్/న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కేంద్రం నిర్ణయాల అనంతరం భద్రతా బలగాల నీడలో ఉన్న కశ్మీర్లో పెద్దగా అలజడులు చెలరేగలేదు. చిన్నాచితక ఘటనలు మినహా ఆందోళనలు అంతగా చోటుచేసుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముస్లిం ప్రజల ప్రార్థనల సందర్భంగా కేంద్రం భద్రతా ఆంక్షలను సడలించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సోమవారం బక్రీద్ ఉండటంతో ఆ రోజు కూడా నిషేధాజ్ఞలను సడలించి.. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 12న ముస్లిం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా లోయలో 144 సెక్షన్ ఎత్తివేతతోపాటు ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించే అవకాశముంది. లోయలోని పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భద్రతా బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బందోబస్తును పర్యవేక్షించడంతోపాటు కశ్మీర్ విషయంలో కేంద్రం తాజా నిర్ణయాలపై స్థానికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి భోజనం చేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దును స్థానికులు స్వాగతిస్తున్నారని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. -
బక్రీద్ కా బకరా ఆన్లైన్లో..
'ఈద్ కేలియే బకరే లేకే జావో.. యే దేఖో.. జబ్బర్ధస్త్ ఐటమ్.. ఔర్ వో.. ఏక్ దమ్ ఝకాస్..' అంటూ ఆన్లైన్లో అరుపులు హోరెత్తుతున్నాయి. మీరింకా విన్లేదా.. అయితే ఒక్కొసారి ఓఎల్ఎక్స్ లేదా క్విక్కర్ర్ ర్ర్ర్ర్ ద్వారాలు తెరిచి బకరా కావాలనే బటన్ నొక్కండి. ఒకటే 'మే.. మే..' అరుపులు! ఏటా ముస్లింలు ఘనంగా నిర్వహించుకునే బక్రీద్ వేడుకలో మేకలు, ఇతర జంతువులదే ప్రాధాన్యం. జాతి, రంగు, కండపుష్టినిబట్టి ఒక్కోసారి జంతువును భారీ ధరలకూ కొనుగోలు చేస్తారు. చాన్నాళ్లుగా సంతల్లో మాత్రమే సాగిన పశువుల అమ్మకాలు ఒకటిరెండేళ్ల నుంచి ఆన్ లైన్లోనూ ఊపందుకున్నాయి. ఈ నెల 25న బక్రీద్ పండుగ ఉండటంతో అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. నగరాల జాబితాలోకి ప్రవేశించగానే స్థానిక రైతులు లేదా వ్యాపారులు తమ దగ్గరున్న మేకల ఫొటోలతో పాటు పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని బేరానికి దిగొచ్చు. ఇంకొద్దిమందైతే.. 'ముందు మా దగ్గరికొచ్చి మేకల్ని చూడండి.. ఆ తర్వాతే కొనండి' లాంటి ఆఫర్ ను కూడా ప్రకటిస్తున్నారు.