ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!.
మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్‌గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు.
అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్‌గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్‌గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు.
ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట.
(చదవండి: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!)
Comments
Please login to add a commentAdd a comment