మేకకి జలుబు చేస్తుందా?! | goat health tips | Sakshi
Sakshi News home page

మేకకి జలుబు చేస్తుందా?!

Published Sun, Jul 13 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

మేకకి జలుబు చేస్తుందా?!

మేకకి జలుబు చేస్తుందా?!

జంతు ప్రపంచం
* మేకపిల్లలకి గారమెక్కువ. తల్లి కాసేపు కనిపించకపోయినా కంగారు పడిపోతుంటాయి!
* మేకలు పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. పుట్టినప్పట్నుంచీ తమ కూతను వాటికి అలవాటు చేస్తాయి. ఎక్కడ ఉన్నా తల్లి కూతపెట్టగానే పిల్లలు వచ్చేస్తాయి.
* మేక పిల్లల్ని కిడ్స్ అంటారు.
* వీటికి ఐక్యత చాలా ఎక్కువ. చుట్టూ ఉండే వాటితో స్నేహంగా మెలగుతాయి. దేనికి కష్టం వచ్చినా అన్నీ చుట్టూ చేరతాయి!
* చెట్లెక్కి దూకడమంటే సరదా.
* వీటికి కింది వరుసలో కొన్ని పళ్లు,  దంతాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే దవడలు చాలా బలంగా ఉండటం వల్ల ఆహారం నమలడంలో ఇబ్బంది ఉండదు!
* కొన్ని రకాల మేకలు అసలు నిద్రే పోవని పరిశోధనల్లో తేలింది!
* మనుషుల్లాగే మేకలకు కూడా జలుబు చేస్తుంది.
* మేకలు తమ శరీర బరువు కంటే ముప్ఫై శాతం ఎక్కువ బరువును మోసేంత బలంగా ఉంటాయి!
* వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ముఖ్యం గా ఆహారం విషయంలో. ఏదైనా కొత్త పదార్థం కనిపిస్తే నోటిలో పెట్టుకుని చప్పరిస్తాయి. తినొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాతే ఆరగిస్తాయి!
* మేకల్లో కొన్ని జాతుల వాటికి అకస్మాత్తుగా నాడీవ్యవస్థ దెబ్బ తింటుంది. కండరాలు, నరాలు పని చేయడం మానేస్తాయి. దాంతో ఇవి సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ మామూలవుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement