అమ్మితే జైలుకే! | Task force surveillance on subsidy goats | Sakshi
Sakshi News home page

అమ్మితే జైలుకే!

Published Sat, Oct 14 2017 11:52 AM | Last Updated on Sat, Oct 14 2017 11:52 AM

 Task force surveillance on subsidy goats

గొల్లకుర్మలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టకుండా సర్కారు చర్యలు చేపట్టింది. సబ్సిడీపై అందించిన గొర్రెలను అమ్ముకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికా రులు.. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు.

కామారెడ్డి క్రైం:  యాదవుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సర్కారు గొ ర్రెల పంపిణీ పథకాన్ని తీసుకువచ్చింది. 18 ఏళ్లు నిండిన గొల్ల కుర్మలందరి కీ గొర్రెల యూనిట్లను అందించాలని నిర్ణయించింది. ఒక యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. యూనిట్‌ ధరను రూ. 1.25 లక్షలుగా నిర్ణయించిన సర్కారు.. ఇందులో 25 శాతం లబ్ధిదారుడు వాటాదారుగా చెల్లించాలని సూచించింది. మిగతా మొత్తాన్ని సర్కారు సబ్సిడీగా భరిస్తోం ది. ఆసక్తి చూపిన యాదవులలో మొద టి ఏడాది సగం మందికి, రెండో ఏడా ది మిగతా సగం మందికి యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించి, డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు.

జిల్లాలో మొదటి విడతలో 8,640 యూనిట్లు పంపిణీ చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికి 4,647 యూని ట్లను పంపిణీ చేశారు. సబ్సిడీ గొర్రెలపంపిణీ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 58 కోట్ల 08 లక్షల 75 వేలు ఖర్చు చేశారు. యూనిట్‌లోని గొర్రెలు రెండేళ్లలో మూడు ఈతలు వస్తాయని, దీంతో గొర్రెల సంతతి వృద్ధి చెంది యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం ఆశించింది. కానీ పలుచోట్ల పథకం పక్కదారి పట్టింది. కొందరు లబ్ధిదారులు సబ్సి డీ గొర్రెలను అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. సబ్సిడీపై అందించిన గొర్రెలను పొరుగు రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించిన ఘటనలు వెలుగు చూశాయి.

పకడ్బందీ చర్యలు..
గొర్రెల పంపిణీ లక్ష్యం నీరుగారిపోతోందని భావిస్తున్న సర్కారు.. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. సబ్సిడీపై అందించిన గొర్రెలను అమ్ముకుంటే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించింది. ఎవరూ అమ్ముకోకుండా చూసేందుకు జిల్లాలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సబ్సిడీ గొర్రెలను ఇతర రాష్ట్రాలకు తరలించేవారిపై ఈ ప్రత్యేక బృందం దృష్టి సారిస్తుంది. ఈ బృందంలో పోలీస్, రవాణా, పశుసంవర్ధక శాఖలకు చెందిన ముగ్గురు అధికారులున్నారు. జిల్లా నుంచి సబ్సిడీ గొర్రెలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారుల తెలిపారు. అంతేగాకుండా సబ్సిడీ గొర్రెల పథకం లబ్ధిదారులు, గొర్రెల పెంపకంపై నిఘా వేసేందుకు మరో రెండు బృందాలు పనిచేస్తున్నాయి.

సబ్సిడీ గొర్రెలు అమ్మితే..
సబ్సిడీపై అందించిన గొర్రెలను విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు. గొర్రెలను అమ్ముతూ పట్టుబడితే వాహనాన్ని, గొర్రెలను వెంటనే సీజ్‌ చే స్తారు. విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తారు. అంతేకా కుండా ఇచ్చిన సబ్సిడీని రికవరీ చేస్తారు. నిబంధనల ప్రకారం సబ్సిడీ గొర్రెలు తీసుకున్న వ్యక్తి రెండేళ్ల వరకు వాటిని పోషించాలి. ఆ తర్వాతే గొర్రెల సంతానంలోనుంచి పొట్టేలు పిల్లలను మాత్రమే అమ్ముకోవచ్చు. గొ ర్రెలను అమ్మే సందర్భంలో తప్పనిసరిగా సంబంధిత శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు
గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం సర్కారు గొర్రెలను సబ్సిడీపై పంపిణీ చేసింది. రెండేళ్ల వరకు వాటిని అమ్మడానికి వీలులేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ గొర్రెలను అమ్మడానికి యత్నిస్తే చర్యలు తప్పవు. సబ్సిడీ గొర్రెల అమ్మకాలను నిరోధించేందుకు జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశాం. సబ్సిడీ గొర్రెలు విక్రయిస్తే గొర్రెలను, వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.   – డాక్టర్‌ రమేశ్‌కుమార్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి, కామారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement