మే.. మే కాదు.. యుఆర్‌ అండర్‌ అరెస్ట్‌ | You're Under Arrest | Sakshi
Sakshi News home page

మే.. మే కాదు.. యుఆర్‌ అండర్‌ అరెస్ట్‌

Published Wed, Jun 28 2017 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

మే.. మే కాదు.. యుఆర్‌ అండర్‌ అరెస్ట్‌ - Sakshi

మే.. మే కాదు.. యుఆర్‌ అండర్‌ అరెస్ట్‌

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) పోలీసుల నిర్వాకం
 
‘పత్తి చేనును మేసిన మేకలను పోలీసులు అరెస్టు చేశారు..‘మేకలు అరెస్టు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు చదివింది నిజమే.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో జరిగింది. ఆత్మకూరుకు చెందిన రంగ స్వామి పత్తి చేనులో మంగళవారం మూడు మేకలు మేశాయి. దీంతో ఆ రైతు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మూడు మేకలను పట్టుకొని, అదుపులోకి తీసుకున్నారు.వాటిని తీసుకొచ్చి దాదాపు నాలుగు గంటలపాటు స్టేషన్‌లో కట్టేశారు.

ఆ తర్వాత మేకల యజమాని రావడంతో మాట్లాడి వదిలి పెట్టారు. ఎన్నో ముఖ్యమైన కేసుల్ని అసలే పట్టించుకోని పోలీసులు.. చేను మేసినట్లు ఈ మేకలపై ఫిర్యాదు రాగానే పట్టుకొని స్టేషన్‌లో కట్టివేయడంపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు.
– ఆత్మకూరు–ఎం (ఆలేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement