ఏటూరునాగారం: వరంగల్ జిల్లాలో విషాహారం తిని 20 మేకలు మృతి చెందాయి. ఈఘటన ఏటూరునాగారం మండలం కంతనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు తన వరి పంటను పందులు నాశనం చేస్తున్నాయని పొలం వద్ద విష గుళికలు పెట్టాడు. వాటిని పొరపాటున మేకలు తినడంతో మృతిచెందాయి. నష్టపరిహారం చెల్లించాలని మేకల యజమానులు కేసు పెట్టడానికి సిద్ధమైయ్యారు.