cotton field
-
యువకుడిని మింగిన బావి
- పోలకల్లో విషాదం పోలకల్(సి.బెళగల్) : మండల పరిధిలోని పోలకల్ గ్రామంలో గురువారం.. బావిలో పడి మధు(19) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బోయ వీధిలో నివాసముంటున్న బోయ గుడసె సోమప్ప, అనంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మధు.. కూలీ పనులకు వెళ్తూ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండేవాడు. గురువారం గ్రామ సమీపంలోని ఉలిగి నాగన్నకు చెందిన పత్తిపొలంలో గుంటిక పాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 సమయంలో దాహం వేయడంతో సమీపంలోని ఉలిగి గిడ్డయ్య బావిలోకి దిగాడు. అయితే కాలుజారి అందులో పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని బావి దగ్గర నీళ్లు తాగేందుకు వచ్చిన పశువుల కాపర్లు గుర్తించారు. సమీపంలోని రైతులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని వెలికి తీశారు. సి.బెళగల్ ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందటంతో తల్లి అనంతమ్మ, కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. -
మే.. మే కాదు.. యుఆర్ అండర్ అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) పోలీసుల నిర్వాకం ‘పత్తి చేనును మేసిన మేకలను పోలీసులు అరెస్టు చేశారు..‘మేకలు అరెస్టు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు చదివింది నిజమే.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో జరిగింది. ఆత్మకూరుకు చెందిన రంగ స్వామి పత్తి చేనులో మంగళవారం మూడు మేకలు మేశాయి. దీంతో ఆ రైతు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మూడు మేకలను పట్టుకొని, అదుపులోకి తీసుకున్నారు.వాటిని తీసుకొచ్చి దాదాపు నాలుగు గంటలపాటు స్టేషన్లో కట్టేశారు. ఆ తర్వాత మేకల యజమాని రావడంతో మాట్లాడి వదిలి పెట్టారు. ఎన్నో ముఖ్యమైన కేసుల్ని అసలే పట్టించుకోని పోలీసులు.. చేను మేసినట్లు ఈ మేకలపై ఫిర్యాదు రాగానే పట్టుకొని స్టేషన్లో కట్టివేయడంపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. – ఆత్మకూరు–ఎం (ఆలేరు) -
పత్తి చేల్లో దొంగలు పడ్డారు
కర్నూలు(అగ్రికల్చర్): పత్తి చేల్లో దొంగలు పడుతున్నారు. కరువు, పెద్ద నోట్ల మార్పిడితో ప్రజలు ఇళ్లల్లో డబ్బులు పెట్టడం లేదని తెలుసుకున్నారే ఏమో కానీ కొద్ది రోజులుగా దొంగలు పంట ఉత్పత్తులను అపహరిస్తున్నారు. గతంలో కల్లాల్లో పంట నూర్పిడి సమయంలో దొంగలు పడేవారు. ప్రస్తుతం ఏకంగా పొలాలకు వెళ్లి దిగుబడులను దోచుకెళ్తున్నారు. ఇటీవల కోడుమూరు మండలంలోని పులకుర్తి, కల్లపరి గ్రామాల్లో పత్తి దొంగతనాలు జరిగాయి. తాజాగా కర్నూలు మండలం జి.సింగవరం గ్రామాల్లో ఒకే రోజు పలువురి రైతుల పొలాల్లోని పత్తిని అపహరించారు. దాదాపు 20 క్వింటాళ్ల పత్తి చోరికి గురైనట్లు రైతులు చెబుతున్నారు. జి.సింగవరం గ్రామానికి చెందిన రైతులు మురళీమోహన్, రామకృష్ణ, మహేష్, బేరి మధు, వెంకటేశ్వర్లు, బేరి మద్దిలేటి చేలల్లో దాదాపు రూ.లక్ష విలువ చేసే పత్తిని ఎత్తుకెళ్లారు. కరువు కాలంలో చేతికొచ్చే అరకొర పంటను దొంగలను అపహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కౌలు చేనులో ఉరేసుకున్న పత్తి రైతు
కర్నూలు : పంట రుణం భారం అయింది. రుణం తీర్చే మార్గం లేక కౌలుకు తీసుకున్న చేనులోనే ఓ పత్తి రైతు ప్రాణం తీసుకున్నాడు. కర్నూలు జిల్లా గడివేములలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రామాంజనేయరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... గడివేముల మండల కేంద్రానికి చెందిన దూదేకుల ఇస్మాయిల్ (55) తన రెండున్నర ఎకరాలతోపాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. పంట సరిగా చేతికి రాక రూ.4 లక్షల వరకు అప్పు మిగిలింది. ఈ ఏడాది పత్తి పైరు సరిగా లేకపోవటంతో తీవ్ర మనోవేదన చెందాడు. కౌలుకు తీసుకున్న చేనులోనే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రైతు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.