గొర్రెల దొంగతనానికి వచ్చి.. గ్రామస్తులకు చిక్కి | Goat Thiefs Arrest in Medak | Sakshi
Sakshi News home page

గొర్రెల దొంగతనానికి వచ్చి.. గ్రామస్తులకు చిక్కి

Published Sat, Dec 7 2019 11:21 AM | Last Updated on Sat, Dec 7 2019 11:21 AM

Goat Thiefs Arrest in Medak - Sakshi

దుండగులను గేటుకు కట్టేసిన కుందనవానిపల్లి గ్రామస్తులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అర్థరాత్రి దొంగతనానికి వచ్చిన ముగ్గురు యువకులను చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. విద్యుత్‌ స్తంభాలపై ఉన్న సీసీ కెమెరాల వైర్లను తొలగించి గొర్రెలను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో గ్రామస్తులు పట్టుకొని ఓ ఇంటి ఎదుట గేటుకు కట్టేశారు. ఆ ముగ్గురు గిరిజన యువకులు హుస్నాబాద్‌ మండలంలోని భల్లునాయక్‌ తండాకు చెందినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. రెండు రోజుల కింద గండిపల్లిలో కూడా గొర్రెలను ఎత్తుకుపోయారని జల్సాల కోసం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పలువురు పేర్కొన్నారు. ఈ విషయంపై సాక్షి ఎస్‌ఐ పాపయ్యనాయక్‌ను సంప్రదించగా ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలపడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement