
మత్స్యకారుడి వలకు చిక్కిన చేప అధిక ధరకు అమ్ముడుపోయింది. సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లారు.
సాక్షి, కవిటి(శ్రీకాకుళం జిల్లా): మత్స్యకారుడి వలకు చిక్కిన చేప అధిక ధరకు అమ్ముడుపోయింది. సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లారు. ఈయన వేసిన వలకు సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వ్యాపారులు రూ.55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. అరుదుగా లభించే ఈ చేపలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
చదవండి: నమ్మకస్తుడిగా ఉంటూ ఒంటరిగా ఉన్న యజమాని భార్యపై..