Old Rolls Royce Bike Sold at High Price UK - Sakshi
Sakshi News home page

బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్‌కు రూ.3 కోట్లు!

Published Sun, Jun 25 2023 12:49 PM | Last Updated on Sun, Jun 25 2023 2:32 PM

old rolls royce bike sold at high price uk - Sakshi

హాలీవుడ్‌ సినిమా ‘ఘోస్ట్‌ రైడర్‌’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్‌ బైక్‌  బాగా పాపులర్‌ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్‌ బైక్స్‌పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్‌బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్‌రాయ్స్‌ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్‌ ఎస్‌ఎస్‌100’ మోడల్‌ బైక్‌ కొనుగోలు చేశాడు.

ఈ మోటర్‌ బైక్‌ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్‌బైక్‌. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్‌బైక్‌ను నడిపిన వాకర్స్‌.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్‌కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్‌బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది.

ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్‌బైకు మంచి కండిషన్‌లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్‌ చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement