10 మంది అమ్మాయిలను అమ్మేశారు.. | Parents gifted teen daughter to Pennsylvania man found living with 11 more girls | Sakshi
Sakshi News home page

10 మంది అమ్మాయిలను అమ్మేశారు..

Published Sun, Jun 19 2016 8:43 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

10 మంది అమ్మాయిలను అమ్మేశారు.. - Sakshi

10 మంది అమ్మాయిలను అమ్మేశారు..

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి 12 మంది మైనర్ బాలికలను వారి తల్లిదండ్రుల నుంచి కొనుక్కుని బానిసలుగా మార్చేశాడు.  లీ కప్లన్(51) తనను ప్రతి రోజు శారీరకంగా వేధిస్తున్నాడంటూ 14 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లీ ని అరెస్టు చేశారు.

లీ ఇంటిపక్కనే ఉండే జెన్ బెట్జ్ అనే ఆవిడ అమ్మాయిలను వేధించడం చూసి చలించిపోయేది. ఈ విషయాన్ని తన భర్తతో పదేపదే చెప్పిన అతను పట్టించుకోలేదు. దీంతో ఆవిడే ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు లీ ఇంటికి చేరుకుని పరిశీలించగా అక్కడ డజను మంది 6 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న అమ్మాయిలున్నారు. వారిలో ఒక అమ్మాయి తనని లీ అక్కడకు 14 ఏళ్ల వయసు లో తీసుకొచ్చాడని ఇప్పుడు తన వయసు 16 ఏళ్ల నాలుగు నెలలని చెప్పింది. లీ ప్రతిరోజు తనను శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసుల ఆమె తల్లిదండ్రులను పిలిపించారు.

వారిని విచారించగా లీ వద్ద ఉన్న మిగతా తొమ్మిది మంది కూడా తమ బిడ్డలనే పోలీసులకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అధికారులు సాక్ష్యాల కోసం ఆరాతీశారు. తమ దగ్గర ఎలాంటి పత్రాలు లేవని చెప్పడంతో సోషల్ సెక్యూరిటీ కార్డును పరిశీలిస్తామని అన్నారు. మిగతా పిల్లల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బాలికలను వేధించినందుకు గాను దాదాపు 1 మిలియన్ డాలర్ల పరిహారాన్ని నిందితుడు చెల్లించాల్సిన అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement