గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.నవమి ప.3.26 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: విశాఖ రా.3.31 వరకు, తదుపరి అనూరాధ,వర్జ్యం: ఉ.7.19 నుండి 9.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.23 నుండి 11.11 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.40 వరకు,అమృతఘడియలు: సా.5.41 నుండి 7.26 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.46
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.....దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదే వీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.
వృషభం...పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. బాకీలు వసూలవుతాయి. ఆలయదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం....కుటుంబం సమస్యలు. సోదరులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలలో అవరోధాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
కర్కాటకం...వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో చికాకులు. ఉద్యోగమార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురవుతాయి.
సింహం...కొత్త పనులు చేపడతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య....శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.
తుల....మీ అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు.
వృశ్చికం...బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు....దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.
మకరం...కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. వాహనయోగం.
కుంభం...ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. విద్యార్థులకు చికాకులు.
మీనం..ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం.
Comments
Please login to add a commentAdd a comment