గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.తదియ తె.4.18 (తెల్లవారితే శుక్రవారం), తదుపరి చవితి, నక్షత్రం: ఆశ్లేష ప.12.05 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.12.47 నుండి 2.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.09 వరకు, తదుపరి ప.2.49 నుండి 3.37 వరకు, అమృతఘడియలు: ఉ.10.22 నుండి 12.01 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.39, సూర్యాస్తమయం: 5.41.
మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉంటాయి.
వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మిథునం: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో తొందరపాటు. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
సింహం: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. దైవచింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.
కన్య: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారవృధ్ధి. ఉద్యోగాలలో అనుకూలత.
తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
వృశ్చికం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.
మకరం: పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కుంభం: శ్రమ ఫలిస్తుంది. నూతనంగా చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సతాహం.
మీనం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
Comments
Please login to add a commentAdd a comment