ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు.. కొత్త పనులు చేపడతారు.. | Today Telugu Horoscope On January 17th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు.. ఆత్మీయుల నుంచి శుభవార్తలు..

Published Fri, Jan 17 2025 4:48 AM | Last Updated on Fri, Jan 17 2025 12:20 PM

Daily Horoscope On 17 January 2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.చవితి తె.5.30 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి పంచమి, నక్షత్రం: మఖ ప.1.26 వరకు తదుపరి పుబ్బ,వర్జ్యం: రా.10.03 నుండి 11.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.52 నుండి 9.40 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.23 వరకు, అమృతఘడియలు: ఉ.10.51 నుండి 11.54 వరకు.

సూర్యోదయం :   6.38
సూర్యాస్తమయం :  5.42
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు.

వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: ఆర్థిక లాభాలు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు.

సింహం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

తుల: కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.

వృశ్చికం: ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  అనుకూల పరిస్థితి.

ధనుస్సు: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మకరం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. బంధువుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement