రూ. 10 వేలకు ఆడశిశువును అమ్మేశారు
Published Thu, Oct 27 2016 3:26 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
వేములపల్లి : పేదరికంతో మగ్గుతున్న ఆ దంపతులు మరో ఆడపిల్లను పోషించలేక అమ్మకానికి పెట్టారు. పదిహేను రోజుల శిశువును రూ. 10 వేలకు విక్రయించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తాజాగా నాలుగోసారి కూడా ఆడబిడ్డే పుట్టడంతో.. 15 రోజుల పసికందును పాములపాడుకు చెందిన వారికి రూ. 10 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement