Wooden Citroen 2CV: వాహన ప్రపంచం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. ఇందులో భాగంగా అనేక ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ అది ఏ కారు? ఎంత ధరకు అమ్ముడైందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దాదాపు రెండు కోట్లు..
చెక్కతో తయారైన కారు పేరు 'సిట్రోయెన్ 2సీవీ' (Citroen 2CV). చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని 'మిచెల్ రాబిల్లార్డ్' అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు. చాసిస్ కోసం పియర్, యాపిల్ చెట్టును.. బోనెట్ అండ్ బూట్ కోసం చెర్రీ చెట్టుని ఉపయోగించినట్లు తెలిపాడు.
ఈ వుడెన్ కారుని తయారు చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. ఈ కారుని రూపొందించడం 2011లో ప్రారంభించాడు. దాదాపు 5వేల గంటకు కృషి చేసి మొత్తానికి అనుకున్నట్లుగా కారుని తయారు చేసాడు. చెక్కతో తయారు చేసిన ఈ కారుని గత ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో 'జీన్ పాల్ ఫావాండ్' అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈయన పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియంలో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?)
ఈ కారుని తయారు చేసిన మిచెల్ రాబిల్లార్డ్ మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులున్నరాని, ఈ కారు తన కూతురు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా త్వరలోనే సిట్రోయెన్ కంపెనీకి చెందిన మరో కారు 'సిట్రోయెన్ డిఎస్'ను కూడా చెక్కతో రూపొందించాలనుకున్నట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment