సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తులు గురించి విన్నా..ఆ వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నా ఓ సెన్సెషన్ అవుతోంది. ప్రస్తుతం జస్ట్ ముప్పై దాటగానే ఏవో వ్యాధుల బారినపడుతోంది యువత. నలభై, యాభైలకే వృద్ధుల కంటే దారుణంగా అయిపోతున్నారు. కడుపు నిండా తినలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితులో కొందరు ఏజ్‌లో సెంచరీ దాటి మరి జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్నటిదాక జపాన్‌లోని బామ్మ..ఇవాళ బ్రెజిల్‌లోని మరో బామ్మ సుదీర్ఘకాలం జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ బామ్మ వయసు ఎంతంటే..
బ్రెజిల్‌కు చెందిన నన్ ఇనా కానబారో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం జీవిస్తున్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవిస్తున్న సూపర్‌సెంటెనరియన్‌లను ట్రాక్ చేసే లాంగేవిక్వెస్ట్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వీల్‌చైర్‌లో ఉండే ఆ బామ్మ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ప్రకటించింది.
ప్రస్తుతం ఆమెకు 117 ఏళ్లు. ఆమె సుదీర్ఘజీవిత కాలం బతకడానికి గల కారణం తెలిస్తే విస్తుపోతారు. ఎందకంటే ఆమెకు నలుగురుని నవ్వించేలా జోక్స్ వేయడం అంటే ఇష్టమే. ఇదే తన హెల్త్ సీక్రెట్ అని అంటోంది బామ్మ ఇనా. ఖాళీ సమయాల్లో పూలతో సూక్ష్మ చిత్రాల తయారు చేయండం, ప్రార్థనలు చేయడం అంటే ఆమెకు ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే నన్‌గా మారి భక్తిమార్గంలోకి వెళ్లిపోయింది ఈ బామ్మ. పైగాభగవంతుడిపై ఉండే విశ్వాసం మనల్ని ఆయురారోగ్యాలతో బతికేలా చేస్తుందని నమ్మకంగా చెప్పింది.
నిజానికి ఆమె ఇన్నేళ్లు బతుకుతుందని అస్సలు అనుకోలేదని ఆమె మేనల్లుడు క్లెబర్ కానబారో అన్నారు. ప్రస్తుతం ఈ బామ్మ రిటైర్మెంట్ హోమ్‌లో ఉంటుంది. ప్రతి శనివారం ఆమె మేనల్లుడు తనను చూడటానికి వస్తుంటాడు. ప్రస్తుతం ఆమె బలహీనంగా, మాట్లాడలేని స్థితిలో ఉంది. కానీ మేనల్లుడు క్లెబర్ వాయిస్ వినగానే ఉత్సాహంగా మాట్లాడే యత్నం చేస్తుందట.
ఇదిలా ఉండగా, లాంగేవిక్వెస్ట్ పరిశోధకుల ప్రకారం, ఆమె జూన్ 8, 1908న దక్షిణ బ్రెజిల్‌లోని ఒక పెద్ద కుటుంబంలో జన్మించారు. ఆమె ముత్తాత 19వ శతాబ్దంలో బ్రెజిల్ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న బ్రెజిలియన్ జనరల్. ఇక ఈ బామ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైరయ్యింది. ఆ తర్వాత రియో గ్రాండే డో సుల్‌లో స్థిరపడింది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రశాంతమైన జీవన విధానమే తన సుదీర్ఘకాల జీవన రహస్యమని అంటోంది బామ్మ ఇనా. డిసెంబరులో జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా మరణం తర్వాత ఈ బామ్మ సుదీర్ఘకాలం జీవించిన వృద్ధురాలిగా అగ్రస్థానంలో నిలిచింది.
(చదవండి: గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం)
Comments
Please login to add a commentAdd a comment