![Woman thrashed a fake officer in Jamshedpur - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/8/Jharkhand.jpg.webp?itok=71iukEr4)
జంషెడ్‌పూర్ : నకిలీ అధికారికి ఓ మహిళ చుక్కలు చూపించింది. ఫేక్ ఐడీతో రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చెప్పుతో చితక్కొట్టింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని మ్యాంగోలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారినంటూ చెప్పి, ఫేక్ ఐడీతో మ్యాంగోలో నివసించే ఓ మహిళను రూ.50 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు జంషెడ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అరుణ్ మెహతా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment