
రాంచీ: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఝార్ఖండ్- పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు పోలీసుల పైకి బుల్లెట్ల వర్షం కురిపించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను కూడా ఎత్తుకు పోయారు. అంతకు ముందు ఇదే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment