కరోనా పేషెంట్‌ ఇంట్లో మటన్‌ వండుకుని.. | Thieves Eat Mutton, Stealing Cash, Jewellery In Coronavirus Patient House | Sakshi
Sakshi News home page

కరోనా పేషెంట్‌ ఇంట్లో మటన్‌ వండుకుని.. ఆపై చోరీ

Published Tue, Jul 21 2020 11:14 AM | Last Updated on Tue, Jul 21 2020 2:35 PM

Thieves Eat Mutton, Stealing Cash, Jewellery In Coronavirus Patient House - Sakshi

జంషెడ్‌పూర్‌: క‌న్నం పెట్టిన ఇంట్లో దొంగ‌లు అన్నం వండుకుని తిన్న అరుదైన ఘ‌ట‌న జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి జూలై 8న‌ క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో అత‌ను టాటా మెయిన్‌ ఆస్ప‌త్రి(టీఎమ్‌హెచ్‌)లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే అద‌నుగా భావించిన దొంగ‌లు అత‌ని ఇంటికి క‌న్నం వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పైగా ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించడం వారికి మ‌రింత క‌లిసొచ్చింది. (మటన్‌ కొంటే హెల్మెట్‌ ఉచితం!)

ఇంకేముందీ.. చ‌డీచ‌ప్పుడు కాకుండా దొంగ‌లు గురువారం రాత్రి ఆ ఇంట్లో దూరారు. ముందుగా క‌డుపు నింపుకుందామ‌ని కిచెన్‌లోకి ప్ర‌వేశించి అన్నం, మ‌ట‌న్ కూర వండుకుని తృప్తిగా ఆర‌గించారు. అనంత‌రం ద‌ర్జాగా 50 వేల రూపాయ‌ల‌ను, మ‌రో 50 వేలు విలువ చేసే న‌గ‌ల‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. (సెల్‌ చార్జర్‌ కోసం దారుణ హత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement