108లో అత్యాధునిక వైద్య సేవలు
Published Thu, Aug 25 2016 12:28 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
హన్మకొండ అర్బన్ : జిల్లాలో 108 వాహనాల్లో అత్యాధునిక వైద్య సేవలు అదించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రసుత్తం తొలిదశగా మూడు వాహనాల్లో ఆ సేవలు అందుబాటులోకి తెచ్చామని జీవీకేఎంఆర్‌ఐ ఆపరేషన్స్ రాష్ట్ర చీఫ్ బ్రహ్మానందం తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం మద్దూరు, జనగామ, నర్సంపేట వాహనాల్లో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్(ఏఎల్‌ఎస్) అందుబాటులో ఉన్నాయని తెలి పారు. ఈ సేవలందించే సిబ్బంది దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, రాష్ట్రంలో మరిన్ని అంబులెన్స్‌ల్లో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీఈకే ద్వారా పీజీ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తం గా 150 మందిని ఎంపిక చేసి వారికి పీజీలో ప్రవేశం కల్పిస్తామని, నాలుగు సెమిస్టర్ల కోర్సు ఉంటుందని అన్నారు. మొదటి సెమిస్టర్‌కు జీవీకే సంస్థ ఫీజు చెల్లిస్తుందని, తర్వాత కోర్సులకు జీవీకే ద్వారా బ్యాంకు రుణం పొందవచ్చని తెలిపారు. ప్రారంభంలో రూ.17 వేల వేతనం ఇస్తారని తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత విద్యారుణం వాయిదాలు చెల్లించవచ్చని తెలిపారు.
అక్టోబర్ 22న పరీక్ష..
బీఎస్సీలో లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో పాసైనవారు అక్టోబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 22న జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పరీక్ష ఉంటుందని తెలిపారు. అర్హత సాధించిన వారికి నవంబర్ 1 నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 9177140659 నంబర్ లేదా ఠీఠీఠీ.్ఛఝటజీ.జీn వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్ భూమా నాగేందర్, బి.సామ్రాట్ ఉన్నారు.
Advertisement
Advertisement