
వాషింగ్టన్: ఈ యేడాది చివరికల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని, ఇప్పటికే 2.5 లక్షల మంది క్లినికల్ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ నిపుణులు డాక్టర్ ఆంథోని ఫాసీ చెప్పారు. అమెరికాలో కోవిడ్–19 పరీక్షా ఫలితాలను రెండు మూడు రోజుల్లో అందించలేకపోతున్నామని, కనుక అమెరికా పౌరులంతా మాస్కులు ధరించడమూ, సమూహాల్లోకి వెళ్లకుండా ఉండడమూ, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని అమెరికా అధికారులు ఫాసీతో చెప్పారు. వ్యాక్సిన్ రావడం, కలకాదనీ, అది నిజం కాబోతోందని ఫాసీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment