
ఆరోగ్యపరంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 కట్టడికి వీలుగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను రష్యన్ యూనివర్శిటీ సెచెనవ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్పుత్నిక్ న్యూస్ వివరాల ప్రకారం మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సెచెనవ్ యూనివర్శిటీలో క్లినికల్ పరీక్షలకు రష్యన్ ఆరోగ్య శాఖ జూన్ 16న అనుమతించింది. దీంతో 18 మంది వలంటీర్లతో కూడిన తొలి గ్రూప్‌నకు జూన్ 18న వ్యాక్సిన్‌ను అందించగా.. జూన్ 23న మరో 20 మందికి ఇచ్చినట్లు స్పుత్నిక్ పేర్కొంది. దీనిలో భాగంగా తొలి బ్యాచ్‌ను ఈ నెల 15న ఇంటికి పంపించివేయనుండగా.. తదుపరి బ్యాచ్‌ను ఈ నెల 20న డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలియజేసింది. యూనివర్శిటీకి చెందిన ఇంటర్‌వెన్షనల్ కార్డియోవాసాలజీ రీసెర్చ్ సెంటర్‌లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది, ఈ వివరాలను ట్రాన్సేషనల్ మెడిసిన్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ తెలియజేసినట్లు స్పుత్నిక్ పేర్కొంది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ వెల్లడికాలేదు.
ఇతర కంపెనీలూ
ఇప్పటికే పలు ఫార్మా దిగ్గజాలు కోవిడ్-19 కట్టడి కోసం వ్యాక్సిన్లను రూపొందించేందుకు వేగంగా ప్రయోగాలు చేస్తున్న విషయం విదితమే.ప్రపంచవ్యాప్తంగా 21 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. వీటిలో ప్రధానంగా యూఎస్ కంపెనీలు గిలియడ్ సైన్సెస్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శీటీ రీసెర్చ్ విభాగం, బయోటెక్ కంపెనీ మోడర్నా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా బయోఎన్‌టెక్‌తో ఫైజర్ ఇంక్ సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ఈ ఏడాది(2020) డిసెంబర్‌కల్లా యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment