
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్‌లో ట్రీట్మెంట్ కొరత ప్రధాన సమస్యగా మారింది. మందులు, వ్యాక్సిన్ల కొరత కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల మీద ప్రభుత్వాల దృష్టి మళ్లుతోంది. ఇప్పటికే భారత మార్కెట్లోకి యాంటీబాడీ కాక్ టెయిల్ ట్రీట్మెంట్కు పర్మిషన్ దొరికింది. ఈ క్రమంలో జైడస్ కాడిల్లా క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతులు దక్కించుకుంది. మైల్డ్ సింప్టమ్స్(ఓ మోస్తరు) లక్షణాలున్నకోవిడ్ పేషెంట్లలో జైడస్ వారి యాంటీబాడీ కాక్టెయిల్ని మనుషులపై ప్రయోగించి చూసేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
గుజరాత్‌కు చెందిన జైడస్ కాడిల్లా వారి జెడ్ఆర్సీ-3308, ట్రయల్స్ దశలో జంతువుల లంగ్ డ్యామేజ్‌ను తగ్గించింది. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో ఉండే కాక్టెయిల్, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకాల తరహాలో ఇన్ఫెక్షన్తో పోరాడుతుందని జైడస్ కాడిల్లా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్లో పురోగతి అవసరమని జైడస్ కాడిల్లా ఎండీ శార్విల్ పటేల్ తెలిపారు. మనుషుల ఎర్లీ టు లేట్ స్టేజ్ ట్రయల్స్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలిపారు.
ఇంతకు ముందు అమెరికాలోనూ అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ట్రీట్మెంట్స్కి అనుమతి చ్చింది. రెగెనెరోన్, రోచె యాంటీ బాడీ కాక్టెయిల్ ఇదివరకే భారత్‌లో అనుమతులు దక్కించుకోగా, ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దానిని సరఫరా చేస్తోంది.
ఇది చదవండి: కాక్టెయిల్ హైరిస్క్ తప్పిస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment