వాషింగ్టన్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకై కీలక ముందడుగు పడింది. ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనే క్రమంలో అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. సీటెల్‌లోని కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(కేపీడబ్ల్యూహెచ్‌ఆర్‌ఐ) పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్‌ను ఓ వ్యక్తిపై ప్రయోగించారు. భారత్, నార్వే సహాయ సహకారాలతో తొలి దశ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... ‘‘క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా తొలిసారిగా ఓ వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చారని తెలియజేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. అత్యంత తక్కువ సమయంలో ఇలా వ్యాక్సిన్ రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారి. దీని దరిదాపుల్లోకి మరెవరూ రాలేరు. వ్యాక్సిన్‌తో పాటు ఇతర యాంటీరైవల్ థెరపీలు, చికిత్సలు అభివృద్ధి చేస్తున్నాం’’అని సోమవారం పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.(సీటెల్‌లో ‘కోవిడ్-19’ క్లినికల్ ట్రయల్స్!)
కాగా కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులను ఎంచుకుని.. వారిపై ప్రయోగించనున్నట్లు కేపీడబ్ల్యూహెచ్‌ఆర్‌ఐ పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 45 మందిని మూడు గ్రూపులుగా విభజించి.. సీటెల్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే అందరికీ ఒకే డోసు ఇవ్వకుండా వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని వెల్లడించారు. ఇక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్చియస్ డిసీజెస్(ఎన్‌ఐఏఐడీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) సహాయంతో రూపొందించిన ఈ వ్యాక్సిన్‌కు ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ-1273గా నామకరణం చేశారు. మసాచుసెట్స్‌లోని మెడెర్నాటీఎక్స్ బయోటెక్నాలజీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన మొదటి దశ ట్రయల్స్‌కు ది కొలియేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్(సీఈపీఐ) ఎంతగానో సహకరించిందని వెల్లడించారు.(కరోనా: వివాదం రేపిన ట్రంప్ ట్వీట్)
చదవండి: కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!
Comments
Please login to add a commentAdd a comment