
సాక్షి, విశాఖ: నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్, సీరం ఇండియా సంయుక్తంగా పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కూడా పరీక్షలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సోమవారం తొలి వాలంటీర్‌కు వ్యాక్సిన్ అందించారు. మొదటి రోజు ముగ్గురు వాలంటీర్ల కు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరో 15 రోజుల వ్యవధిలో 100 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహించనున్నట్టు డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment