kgh
-
అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం
విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. -
బాలింతకు నరకయాతన..
అనంతగిరి (అరకులోయ రూరల్): పచ్చి బాలింతరాలు.. పైగా, సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగి వారం రోజులే అయింది.. క్షేమంగా ఆమెను ఇంటి వద్దకు చేర్చాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ఆమెను నిర్లక్ష్యంగా, నిర్దయగా గ్రామానికి 3 కి.మీ. దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామర్ల జ్యోతి(32)ని ప్రసవం కోసం విశాఖలోని కేజీహెచ్‌లో వారం కిందట చేర్చారు. కాన్పు ఇబ్బంది కావడంతో శస్త్రచికిత్స చేశారు. పండంటి ఆడ శిశువు పుట్టింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వాజంగిలోని బాలింత ఇంటి వరకు రావాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ గ్రామానికి 3 కి.మీ. దూరంలోనే వారిని దింపేసి సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న తాను మరో దారిలేక కష్టంగా కాలినడకన ఇంటికి చేరాల్సి వచ్చిందని బాలింత జ్యోతి, ఆమె బంధువు రవికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శస్త్ర చికిత్స కుట్లు ఇంకా పచ్చిగానే ఉండటంతో గ్రామానికి చేరేందుకు నరకయాతన చూడాల్సి వచ్చిందని బాధితు రాలు వాపోయింది. వాహన సిబ్బంది కనీస మానవత్వం చూపలేదని, తామింక రాలేమని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె ఆరోపించింది. -
బాధితుల ఆక్రోశం.. ఫొటోలు దిగేందుకు వచ్చారా?
‘ఫొటోలు తీయించుకునేందుకు వచ్చేస్తున్నారు..! డబ్బులు మాకేం వద్దు..! మావాళ్లను బతికించి తీసుకురావయ్యా..! కనీసం మంచినీళ్లు.. వాటర్ ప్యాకెట్లైనా మీ ప్రభుత్వం ఇచ్చిందా? ఒక్కొక్కడూ వచ్చి ఫొటోలు నొక్కించేసుకుంటున్నారంతే! ఆ డాక్టర్ వచ్చారు..! చూసుకోవయ్యా మీ బాడీని అన్నారు. చూసుకున్నాం.. ఎవరూ కనీసం పట్టించుకోలేదు. ఆ కంపెనీవోడ్ని మా ముందుకు తెస్తే సచ్చిపోయినోడు బతికినట్టే..!’ – విశాఖ కేజీహెచ్‌లో సీఎం చంద్రబాబుని నిలదీసిన ఎస్.రాయవరం మండలానికి చెందిన మృతుడి మేనమామ తంబయ్యసాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ అలసత్వంపై బాధిత కుటుంబాలు నేరుగా నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన అనంతరం కేజీహెచ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఒకచోట నిలబెట్టి వారితో సీఎం మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. తమ బాధలు చెబుతున్న కుటుంబ సభ్యుల్ని సీఎం ఓదార్చి అంతా నేను చూసుకుంటానంటూ వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే బాధితులు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ప్రమాదం జరిగి 20 గంటలు గడుస్తున్నా.. బాధిత కుటుంబాల్ని కనీసం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక చంద్రబాబు తిరిగి వారి దగ్గరికి వచ్చి మాట్లాడారు.మావాళ్లు చేసింది తప్పే...మాకు కనీసం సమాచారం ఎవరూ ఇవ్వలేదు.. ఎవర్ని అడగాలో తెలియక రాత్రి నుంచి అటు ఇటు తిరుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదు. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ చూసి ప్రమాదం జరిగిందని తెలుసుకొని పరుగున వచ్చాం. అయితే అధికారులెవరూ మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ బాధిత కుటుంబాలు సీఎం వద్ద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మా ప్రభుత్వాధికారులు సమాచారం ఇవ్వకపోవడం.. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తప్పేనంటూ ఒప్పుకున్నారు.బొత్స ప్రశ్నించడంతో..వాస్తవానికి చంద్రబాబు టూర్ షెడ్యూల్లో కేజీహెచ్ లేదు. మృతదేహాల్ని బుధవారం రాత్రి కేజీహెచ్‌కు తరలించినా కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ స్థానిక ఎంపీ గానీ పరామర్శించలేదు. గురువారం ఉదయం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కేజీహెచ్‌కు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారిని పరామర్శించేందుకు సీఎం ఎందుకు రావడం లేదని నిలదీశారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పు చేసుకుని కేజీహెచ్‌కు వచ్చారు. -
బిడ్డ కోసం తండ్రి పాట్లు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): పసిబిడ్డ కోసం తండ్రి నానా కష్టాలు పడ్డాడు. ప్రసవం అయిన తర్వాత చికిత్స కోసం పిల్లల వార్డుకు తీసుకొని వెళ్లడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకొని వార్డుకు తీసుకొని వెళ్లాడు. పసిబిడ్డను ఆయా తీసుకొని వెళ్లగా తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన అల్లు శిరీష, విష్ణుమూర్తి దంపతులు. శిరీష ఈ నెల 9న కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరారు. మంగళవారం ఉదయం 8.30 శిరీష పసికందుకు జన్మనిచ్చి0ది. పసికందు అనారోగ్యానికి గురవడంతో పిల్లల వార్డులో ఉన్న ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. పసికందును గైనిక్ వార్డుకు తరలించడానికి కేజీహెచ్ సిబ్బంది ఎవరు ముందుకు రాలేదు. దీంతో తండ్రి విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆయాతో మాట్లాడి తాను సిలిండర్ మోస్తానని ముందుకు వచ్చాడు. దీంతో ఆయా పసిపాపను, తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లారు. గైనిక్ వార్డు నుంచి పిల్లల వార్డు వరకు నడిచి తీసుకొని వెళ్తున్న ఈ దృశ్యాన్ని కొంత మంది వీడియో తీశారు. దీనిని వైరల్ చేయడంతో ఈ విషయం బయట పడింది. గైనిక్ వార్డు వద్ద బ్యాటరీ కారు ఈ ఘటన వైరల్ కావడంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. గైనిక్, పిల్లల వార్డు సిబ్బందిని పిలిచి విచారించారు. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్నదానిపై చర్చించారు. ఈ సమస్య లేకుండా గైనిక్, పిల్లల వార్డు వద్ద ఒక బ్యాటరీ కారు సిద్ధం చేస్తున్నట్లు శివానంద్ తెలిపారు. -
సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ ఒకే చోట..
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర వైద్య కళాశాలలోని కేజీహెచ్‌లో సూపర్ స్పె షాలిటీ సేవలన్నీ ఒకే చోట లభించ డం శుభ పరిణామమని కేంద్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ప్రశంసించారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్చువల్‌గా హాజరయ్యారు. ఉత్సవాల్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, కలెక్టర్ డా.మల్లికార్జున, డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జీ, మధ్యప్రదేశ్ ఆయుష్మాన్ భారత్ ముఖ్య కార్యదర్శి రమేశ్‌కుమార్, సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. పీజీ, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మంత్రి రజిని మెడల్స్, అవార్డులు అందజేశారు. ఎమ్మెల్సీ డా.రవీంద్రబాబు, ఏఎంసీ ప్రిన్సిపల్ డా.బుచ్చిరాజు, ఎంపీ డా.సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎంసీ @ 100 ఏళ్లు
మహారాణిపేట: వందేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగు వారి కోసం విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటైంది. 1923 జూలై 19న మెడికల్ కళాశాల అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగ్‌పటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు.1926లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాలగా మారింది. ఆ సమయంలో వైస్ చాన్సలర్‌గా ఉన్న సీఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజీగానే ప్రసిద్ధి చెందింది. దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలల్లో ఏఎంసీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఏఎంసీ కావడం విశేషం. ప్రస్తుత మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. ఇంకా ఎంతో మంది దేశ,విదేశాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. రూ.50 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలు వేసుకుని 1.6 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక నూతన భవనాన్ని ని ర్మిస్తున్నారు. వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధనా ఆస్పత్రులు వచ్చాయి. తొలి కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)గా మారింది. 132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్ నేడు 1,100 పడకల స్ధాయికి ఎదిగింది. ఇంకా అనుబంధంగా అనేక ఆస్పత్రులు ఉన్నాయి. 27 నుంచి శతాబ్ది ఉత్సవాలు ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. 27న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, 28న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎం.ఎల్.మాండవీయ,రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొంటారు. 29న తెలుగు సాహితీ వైభవం కార్యక్రమంలో భాగంగా రాత్రి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థినే ఆంధ్రా మెడికల్ కాలేజీలో 1978లో ఎంబీబీఎస్ చదివాను. ఇప్పుడు ఇదే కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. చదువుకున్న కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత వైద్యులను సమన్వయం చేసుకుంటూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బుచ్చి రాజు, ప్రిన్సిపాల్, ఏఎంసీ చాలా ఆనందంగా ఉంది నేను ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. ఇక్కడ వైద్య విద్య పూర్తిచేసిన అనేక మంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వైద్య విద్యను ఎంతో ఇష్టంగా చదివాను. ఇప్పటికీ వైద్యునిగా పనిచేయడం తన తల్లిందండ్రుల చేసిన పుణ్యఫలంగా భావిస్తాను. –డాక్టర్ ఎన్.ఉమా సుందరి, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ తెలుగు రాష్ట్రాల్లో ఏఎంసీ నంబర్ వన్ నేను చదువుకున్న రోజుల్లో కాలేజీ, ఆస్పత్రి చాలా చిన్నవిగా ఉండేవి, అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వైద్య కాలేజీ నంబర్ వన్‌గా ఉంది. అయిదు సంవత్సరాల పాటు ఏఎంసీ ప్రిన్సిపాల్‌గా పనిచేశా. – డాక్టర్ పి.వి.సుధాకర్, పూర్వ విద్యార్థి, మాజీ ప్రిన్సిపాల్ -
వాలీబాల్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు పరుగులు.. మరో చెట్టుపై పిడుగు
రావికమతం (అనకాపల్లి జిల్లా): చెట్టుపై ఆదివారం సాయంత్రం పిడుగు పడడంతో 11 మంది గిరిజన యువకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు, 8 మందిని 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావికమతం మండలం తాటిపర్తి గిరిజన గ్రామంలో ఆ గ్రామానికి చెందిన సీదిరి శ్రీను, కుండ్ర బాలరాజు, షోమీల శ్రీను, పాడి చినబ్బాయి, బాలకృష్ణ, లోత కళ్యాణం, సుర్ల గణేష్ తదితర యువకులు ఆదివారం వాలీబాల్ ఆడుతుండగా వర్షం రావడంతో అంతా ఒక చెట్టు కిందకు పరుగులు తీశారు. ఆ సమయంలో వారికి సమీపంలోని మరో చెట్టుపై పిడుగుపడడంతో ఆ అదురుకు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న మరికొంత మంది వెంటనే 108కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది వచ్చి, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని గ్రామ సర్పంచ్ వంజరి గంగరాజు తెలిపారు. -
డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్ బ్రదర్స్... మీ నోట్ ఫైల్ అయిపోయింది. మేడమ్ (రీజనల్ డైరెక్టర్) సంతకం కోసం పెండింగ్‌లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్)ల ఫైల్ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్‌ఆర్‌లు కాల్‌ఫర్ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్ కాల్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ప్రమోషన్)కూ కాల్‌ఫర్ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్ ఇక్కడ...’ ఇదీ విశాఖలోని కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఓ హెల్త్ విజిటర్ (హెచ్వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లకు పంపిన వాయిస్ మెయిల్. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్ ధమాకా ఆఫర్‌తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)/హెల్త్ విజిటర్ (హెచ్వీ)లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో)లుగా ప్రమోషన్ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఓ ఉద్యోగిని చక్రం... జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్‌కు ప్రమోషన్... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్‌లో హెచ్వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్‌ను ఏకంగా వాట్సాప్‌లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాబితాలు వాట్సాప్‌లో చక్కర్లు... జోన్–1లోని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు ఎంపీహెచ్ఎస్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ఎంపీహెచ్‌ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ కోసం చూస్తున్నవారి వాట్సాప్‌కు అవి చేరాయి. ఫార్మాల్టీలతో పబ్బం... ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు ఫైనల్ చేయలేదు అందరి దగ్గరా ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లు మాత్రమే కాల్‌ఫర్ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్ ఇస్తా. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
విశాఖ పాప కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెల్లడి
-
అరుదైన శస్త్రచికిత్స... చచ్చుబడిపోయిన కాళ్లు యథాస్థితికి
సాక్షి, విశాఖపట్నం: ఏ కారణం లేకుండా చిన్న వయసులోనే 11 ఏళ్ల పాపకు చచ్చుబడిపోయి వంకరైన కాళ్లను ‘టెండన్ ట్రాన్సఫర్’ ఆపరేషన్ ప్రక్రియ ద్వారా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు కేజీహెచ్ వైద్యులు. ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేటకు చెందిన 11 ఏళ్ల బంగారు యశోదకు చిన్న వయస్సులోనే కుడి కాలు నరాలు చచ్చుబడిపోయి వంకరగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 5న కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన డాక్టర్ విజయకుమార్‌తో కలిసి డిసెంబర్ 6న సర్జరీ చేశారు. ఇలాంటి ‘టెండన్ ట్రాన్స్ఫర్’ సర్జరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 30 నుంచి 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరిపీ చికిత్స అందించాలి. అందులో భాగంగానే ఫిజియోథెరిపీ చికిత్స పూర్తయిన తర్వాత గురువారం నాటికి పూర్తి స్థాయిలో రికవరీ అయినట్లు డాక్టర్ పి.వి.సుధాకర్ వెల్లడించారు. ఇలాంటి చికిత్సలు అరుదుగా విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
కేజీహెచ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
సాక్షి, విశాఖ: నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. ఆక్స్ఫర్డ్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్, సీరం ఇండియా సంయుక్తంగా పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కూడా పరీక్షలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సోమవారం తొలి వాలంటీర్‌కు వ్యాక్సిన్ అందించారు. మొదటి రోజు ముగ్గురు వాలంటీర్ల కు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరో 15 రోజుల వ్యవధిలో 100 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహించనున్నట్టు డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు. -
మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘తెల్లవారు జామున గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపింది. గ్యాస్ ప్రభావం ఐదు గ్రామాలపై ఉంది. ఘటనపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కమిటీ సూచిస్తుంది. మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా... మనసున్న మనిషిగా బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థికసాయం అందచేస్తాం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటాం. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం. ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాం. గ్యాస్ కారణంగా ప్రభావిత గ్రామాలు వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ– ఎస్టీకాలనీ, నందమూరినగర్, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలంతా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గ్రామాల్లోని దాదాపు 15వేలమంది ఉంటారని చెప్తున్నారు. వీరందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు ఇస్తున్నా. మెడికల్ క్యాంపులు పెట్టమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నాం. గ్రామాలకు వెళ్లలేని వ్యక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసి మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. కమిటీ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల పాటు చీఫ్ సెక్రటరీ, ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడే సహాయ కార్యక్రమాలకు పర్యవేక్షణ చేస్తారు. ఈ గ్రామాలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకోమని చెప్తున్నాను. (ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష) అలారం ఎందుకు మోగలేదు? ఎల్జీ లాంటి గుర్తింపు ఉన్న సంస్థలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం బాధాకరం. గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదో తెలియరాలేదు. తెల్లవారు జామున ఘటన జరిగినప్పుడు ప్రమాద హెచ్చరిక ఎందుకు రాలేదు. హెచ్చరికలు లేకపోవడం అన్నది దృష్టి పెట్టాల్సిన అంశం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారు. వారిని అభినందిస్తున్నా. ఉదయం నాలుగు గంటల నుంచే కలెక్టర్, సీపీ సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంబులెన్సులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, వాటి ద్వారా దాదాపు 348 మందిని అన్ని ఆస్పత్రుల్లో చేర్పించారు. పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవారు కూడా ... ఇప్పుడు వెంటిలేటర్ కూడా అవసరం లేని స్థాయికి చేరుకున్నారు’ అని తెలిపారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకై తొమ్మిదిమంది మృతి చెందగా, సుమారు 200మంది అస్వస్థతకు గురయ్యారు.(గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు) -
కేజీహెచ్‌లో ఉచితంగా కీళ్ల మార్పిడి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కేజీహెచ్‌లో ఉచితంగా కీళ్లమార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహిస్తున్నామని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. మంగళవారం ఆర్థోపెడిక్ వార్డులోని సమావేశ మందిరంలో కీళ్ల మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, రాష్ట్ర ప్రభుత్వ ఇల్నెస్ ఫండ్‌ను వినియోగించి ఈ ఏడాదిలో 151 కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించామన్నారు. కీళ్ల మార్పిడి చేయించుకున్న రోగులు కేజీహెచ్‌లో ఉచితంగా ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలని కోరారు. వైద్య విద్యా సంచాలకుడు గత ఏడాది రూ.70 లక్షల నిధిని కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు కేటాయించారని చెప్పారు. ఆర్థోపెడిక్ విభాగం హెడ్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఉచిత కీళ్ల మార్పిడి చికిత్సకు రూ.2 కోట్ల నిధులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రులు రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయన్నారు. అవగాహన సదస్సులో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఇందిరాదేవి, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్లు డాక్టర్ శివానంద, డాక్టర్ లోక్‌నాథ్, ఏఆర్ఎంవో డాక్టర్ సిహెచ్.సాధన, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు పాల్గొన్నారు. -
కేజీహెచ్‌లో కిడ్నాప్ కలకలం
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ బిడ్డ కిడ్నాప్ అయ్యిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేజీహెచ్‌లో కలకలం రేగింది. అయితే కుటుంబ సమస్యల వల్ల తల్లే బిడ్డను తీసుకుని వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సమీప కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన ప్రియాంక తన నాలుగు నెలల బిడ్డను కేజీహెచ్ పిల్లల వార్డులో ఈ నెల 23న వైద్య సేవల నిమిత్తం చేర్చింది. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను పిల్లల వార్డులోని ఆరోగ్యశ్రీ సిబ్బంది నుంచి తీసుకుని వెళ్లిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె భర్తకు సంబంధించిన వారు ఆస్పత్రికి వచ్చి బిడ్డ కిడ్నాప్ అయ్యిందని ఆందోళనకు దిగారు. అయితే బిడ్డకు కేటాయించిన పడక మీద మొత్తం సామగ్రితోపాటు పాల డబ్బా కూడా వదిలి వెళ్లిపోవడంతో వార్డులో కలకలం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో బిడ్డను తీసుకుని ప్రియాంక వెళ్లిపోయి ఉంటుందని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై కేజీహెచ్‌లోని పోలీస్ అవుట్ పోస్ట్‌లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఫోన్ నెంబరు పనిచేయకపోవడంతో ఎటువంటి సమాచారమూ ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు భర్త, అతని కుటుంబ సభ్యులపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రియాంక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
మేస్త్రీ దాడిలో కార్మికురాలి మృతి
అచ్యుతాపురం (యలమంచిలి): జంగులూరులో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేస్తున్న పూజారి రోజా (20) కేజీహెచ్‌లో వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. అరకుకి చెందిన రోజా రెండేళ్లక్రితం కూలిపని కోసం ఇక్కడికి వచ్చింది. నిర్మాణ పనులు చేస్తూనే అక్కడ మేస్త్రీగా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మం మండలానికి చెందిన సురేష్‌తో పరిచయం పెంచుకుంది. మే 29న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఘర్షణ పడ్డారు. ఆమె మొదటి అంతస్తునుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ రోజాను హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. ఆమె వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తండ్రి లచ్చన్న ఇచ్చిన íఫిర్యాదు మేరకు సురేష్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆమెను అత్యాచారయత్నం చేయడంలో ఇరువురి మధ్యతోపులాట జరిగిందని మేడపై నుంచి తోసేయడంతో గాయపడి చనిపోయినట్టు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సీఐ విజయనాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తారని ఆయన చెప్పారు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. -
పొట్టకూటికెళ్లి పై లోకాలకు
జామి: పొట్టకూటి కోసం పట్నానికి కూలి పనికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గొడికొమ్ము గ్రామానికి చెందిన శీర చిన్నారావు (33) నిత్యం కూలి పనుల కోసం విశాఖపట్నం వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం కూడా పని కోసం విశాఖపట్నంలోని గోపాలపట్నం వెళ్లాడు. విధుల్లో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా.. విద్యుదాఘాతంతో స్తంభం మీదే కన్నుమూశాడు. వెంటనే సహచరులు స్పందించి మృతదేహాన్ని కిందకు దించి సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం సంఘటనా ప్రాంతానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన గొడికొమ్ముకు తరలించారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పైడితల్లి, కుమారుడు ఉన్నారు. -
వైద్యాలయంలో నీ దర్శనభాగ్యం దుర్లభమేనా
ఏడుకొండలపైనున్న ఆ శ్రీనివాసుడి దర్శనమైనా లభిస్తుందిగానీ.. మన పక్కనే ఉన్న ఉత్తరాంధ్ర వైద్యాలయం కేజీహెచ్‌లోని ఈ శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాత్రం భక్తరోగులకు దుర్లభమే..ఇది ఏ ఒక్కరోజో కాదు.. ఎప్పుడు ఆ విభాగానికి వెళ్లినా ఆయనగారి జాడ కనిపించదు.. అలాగనీ ఆయన ఆస్పత్రి రారా.. ఉద్యోగం చేయరా అంటే.. రికార్డుల్లో చేస్తున్నట్లే ఉంటుంది.ఠంచనుగా విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ నమోదు చేసేసుకుంటారు. అంతే అక్కడి నుంచి ఆ ఛాయల్లోనే కనిపించరు.ఆయనే డాక్టర్ శ్రీనివాసరావు.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి.ఆయనగారు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలీదు. చాంబర్‌లోని ఆయన సీటు ఎప్పుడు చూసినా ఖాళీగానే కనిపిస్తుంది.ఆ విభాగంలో పని చేసే సిబ్బంది బహుశా అప్పుడప్పుడు మాత్రమే ఆయన్ను చూస్తుంటారేమో.. ఇక రోగుల సంగతి సరేసరి..వారాలకు వారాలు అక్కడికి రావడం.. ఎదురు చూడటం తప్ప.. ఆయన దర్శనం మాత్రం దక్కదు. జూనియర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆ విభాగాన్ని నడిపిస్తున్నారన్న వాదన ఉంది. యథారాజా.. తథా ప్రజ అన్నట్లు దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నరకం చూపిస్తోంది.గంటల తరబడి పడిగాపులు కాసే నిరుపేద రోగులపై కనీస దయ లేకుండా సమయ పాలనకు తిలోదకాలిస్తూ.. వచ్చినప్పుడే వైద్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేజీహెచ్ విభాగాల పనితీరుపై వరుస కథనాలు ఇస్తున్న సాక్షి.. బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో క్షేత్ర పరిశీలన జరిపినప్పుడు రోగుల కష్టాలు.. ఆ విభాగం పెద్దల నిర్వాకం కళ్లకు కట్టాయి. విశాఖ సిటీ: కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం రోగులకు నరకం చూపిస్తోంది. గంటల తరబడి పడిగాపులు కాసే నిరుపేద రోగుల పట్ల కనికరం లేకుండాపోతోంది. సమయ పాలనకు తిలోదకాలిస్తూ.. వచ్చినప్పుడే వైద్యం అన్నట్లుగా వైద్యుల తీరు ఉంటోంది. హెచ్‌వోడీ బాటలోనే దిగువ స్థాయి సిబ్బందీ కూడా నడుస్తుండడంతో రోగుల పాట్లు చెప్పనలవి కావు. నాలుగు రోజులుగా కేజీహెచ్ విభాగాల పనితీరుపై వరుస కథనాలు సాక్షి అందిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో రోగుల పరిస్థితి, వైద్యుల వ్యవహార శైలిపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు. హెచ్‌వోడీ ఎక్కడ? ‘వీళ్లెప్పుడూ ఇంతేనయ్యా.. 9 అంటారు.. 11 అంటారు.. 12.30 వరకూ కనిపించరు. మళ్లీ శనివారం రమ్మంటారు’ అంటూ పలువురు గ్యాస్ట్రో ఎంట్రాలజీ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ ఉన్న ప్రతి బుధవారం వైద్యులు ఏనాడు 11 గంటలకు రాలేదని, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం 12.30 గంటలు దాటినా రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదీ.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ విభాగం పరిస్థితికి అద్ధం పడుతోంది. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఇక్కడ వైద్యుల తీరు ప్రాణసంకటంగా మారుతోంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్(హెచ్‌వోడీ) డాక్టర్ శ్రీనివాసరావు సంగతైతే సరేసరి.. ఎప్పుడు ఆస్పత్రికి వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో..? అసలు వస్తున్నారో లేదో కూడా తెలీని పరిస్థితి. సాధారణంగా.. వైద్యులు ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చే సమయంలోను, సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్లే సమయంలోను బయోమెట్రిక్ వేయాలి. అయితే డాక్టర్ శ్రీనివాసరావు ఇటు ఓపీలో కాని అటు వార్డులో కాని ఎక్కడా కనిపించరు. విచారిస్తే డాక్టర్ ఇప్పటి వరకూ ఇక్కడే ఉన్నారని, సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లారని వార్డులోని సిబ్బంది సర్ది చెబుతుంటారు. అక్కడికి వెళ్లి చూస్తే కనిపించరు. తిరిగి ఓపీ దగ్గరికి వచ్చి ఏ సమయానికి తిరిగి వస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సదరు సిబ్బంది నీళ్లు నములుతుంటారు. కేజీహెచ్ వద్దు.. కార్పొరేట్ ముద్దు ఠంచనుగా బయోమెట్రిక్ పంచ్ కొట్టే హెచ్‌వోడీ శ్రీనివాసరావు.. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే.. కార్పొరేట్ ఆస్పత్రులకు కన్సల్టెంట్‌గా వెళ్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కేజీహెచ్ పరిసరాల్లో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్‌గా పని చేయడంపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌లో జీతం తీసుకుంటూ.. కనీసం గంట సేపైనా విధులు నిర్వర్తించకపోవడంపై పలువురు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోండి! హెచ్‌వోడీ పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ ఆడిందే ఆటగా సాగుతోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలతో వస్తున్న రోగులను అక్కయ్యపాలెంలో ఉన్న హెచ్‌వోడీ శ్రీనివాసరావు ఆస్పత్రికి వెళ్తే.. మంచి వైద్యం అందుతుందని ఓపీ సిబ్బంది చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక దూర ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వైద్యం కోసం వస్తుంటే.. తీరా ఇక్కడికి వచ్చాక.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోమంటున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు పీజీలకు.. కేజీహెచ్ నుంచి నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్న డా.శ్రీనివాసరావు.. తాను చెయ్యాల్సిన పనుల్ని సైతం పీజీ విద్యార్థులకు అప్పగించేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ముఖ్యమైన పరీక్షలకు తప్పనిసరిగా హెచ్‌వోడీ ఉండాల్సిన అవసరం ఉన్నా.. వాటికి సైతం హాజరు కాకుండా.. ఆ పరీక్షలు కూడా పీజీలే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ గ్యాస్ట్రో ఓపీ తీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ సోమవారం, బుధవారం, శనివారం ఉంటుంది. ఇతర విభాగలతో కలిసి ఓపీ ఉన్న సోమవారం, శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బుధవారం రోజున మాత్రం ఒక్క గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ మాత్రమే ఉంటుంది. గతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓపీ ఉండేది. వైద్యుల సౌలభ్యం కోసం ఈ సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు. -
అంతా వారిష్టం
విశాఖ సిటీ: పేదలకు వైద్యమందించడమంటే కేజీహెచ్‌లోని కొంత మంది సిబ్బందికి మా చెడ్డ చిరాకు. కొన్ని విభాగాలకు చెందిన సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వులున్నా పట్టుమని పది గంటలు కూడా కనిపించడం లేదు. అడిగేవారు లేరనీ.. అడిగిన వారిని కాదనీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. రేడియాలజీ విభాగం ఈ విషయంలో ముందుంది. సిబ్బంది లేక.. సేవలు కానరాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సరైన సమయంలో పరీక్షలు జరగకపోవడంతో విలవిల్లాడుతున్నారు. ఉత్తర్వుల్లో స్పష్టం చేసినా... పారా మెడికల్ సిబ్బందిగా గుర్తించిన రేడియాలజీ సిబ్బంది ఏడాదిలో 35 రోజులు సాధారణ సెలవులు తీసుకుని మిగిలిన అన్ని రోజులూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబరు 784లో స్పష్టం చేసింది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి వీరంతా అడ్మినిస్ట్రేటివ్, మినిస్టీరియల్ ఉద్యోగుల తరహాలో ప్రభుత్వ సెలవు దినాలను ఎంజాయ్ చేస్తూ ఏకంగా విభాగానికి తాళాలు వేసేస్తున్నారు. ఇదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన పలుకుబడి వినియోగించి వైద్యాధికారులతో నోటిమాటగా చెప్పి సెలవులు ప్రకటించడం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేడియాలజీ సిబ్బందికి వారాంతపు సెలవుతోపాటు రేడియేషన్ ముప్పు కారణంగా ఆర్సీఎల్ పేరిట ఏడాదికి 30 రోజుల పాటు ప్రత్యేక సెలవులను ప్రభుత్వం అందిస్తోంది. వీరికి ఇచ్చిన సెలవులన్నీ సద్వినియోగపరచుకోవడంతోపాటు విధులు నిర్వర్తించాల్సిన రోజులైన ప్రభుత్వ సెలవుదినాలు, ఆదివారాలలోనూ విధులకు హాజరు కాకపోవడం అన్యాయమని పలువురు వైద్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు ఆస్పత్రిలో ఇన్పేషెంట్లుగా చేరి వైద్య సేవలు పొందుతున్నవారు సుమారుగా 1600 మంది వరకూ ఉంటారు. ఈ రేడియాలజీ విభాగానికి చేరువలో ఉన్న భావనగర్, రాజేంద్రప్రసాద్, ఎముకల విభాగం, శస్త్రచికిత్స విభాగాలతో పాటు పిల్లల వార్డులలోని ఇన్‌పేషెంట్లకు అత్యవసరంగా ఎక్స్‌రే, స్కానింగ్ చేయాలంటే ఈ రేడియాలజీ విభాగానికి తీసుకొస్తారు. పండుగ సెలవులు, ఆదివారాలు ఈ విభాగాన్ని పూర్తిగా మూసివేయడంతో ఆయా రోగులను ఆస్పత్రి సిబ్బంది, రోగుల సహాయకులు వార్డులకు దూరంగా ఉన్న అత్యవసర విభాగానికి తీసుకెళ్లాల్సి రావడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు సెలవు రోజుల్లో అత్యవసరంగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తే వారిని అత్యవసర వైద్య విభాగానికి పంపుతున్నామని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే సేవల వివరాలివీ ఆస్పత్రి రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో సుమారు 13 ఎక్స్‌రే మిషన్లు పనిచేస్తున్నాయి. ఈ విభాగంలో సుమారుగా 10 మంది సిబ్బందితో పాటు డిప్లమో రేడియాలజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు శిక్షణ పేరిట రోగులకు సేవలు అందిస్తుంటారు. అత్యవసరం కోసం ప్రైవేటుకు పరుగులు దేశంలో ఎక్కడైనా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్‌రే, స్కానింగ్‌లు చేసే సిబ్బంది ప్రభుత్వ సెలవు రోజులు, పండగ రోజులతో సహా అందుబాటులో ఉంటూ రోగులకు వైద్య సేవలు అందించాలి. తమకు ఇచ్చిన క్యాజువల్ లీవ్‌ను అవసరమైన రోజు వినియోగించుకుని మిగిలిన అన్ని రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఎవరూ అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో వస్తున్న రోగులు ఎక్స్‌రే, స్కానింగ్‌లు అత్యవసరంగా తీయించాల్సి వస్తే ఆస్పత్రి వెలుపల ఉన్న ప్రైవేటు కేంద్రాలను అశ్రయించాల్సి వస్తోంది. ఇలా రేడియాలజీ విభాగం ఉద్యోగులు సెలవులు తీసుకునే విధానం రాష్ట్రంలోని బోధనాస్పత్రులున్న కాకినాడ, విజయవాడ, కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడా లేదని, కేవలం కేజీహెచ్‌లోని రేడియాలజీ విభాగ సిబ్బంది మాత్రమే సెలవులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజులో నాలుగు గంటలే సేవలు కేజీహెచ్‌లో వైద్యులతో పాటు పారా మెడికల్ విభాగానికి చెందిన నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్‌రే, స్కానింగ్‌లలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్‌ల వారీగా ఏడాది పొడవునా రోజుకు ఇరవై నాలుగు గంటలూ సేవలు అందించాలని ప్రభుత్వ జీవోలు చెబుతున్నాయి. అయితే పెద్దాస్పత్రిలో పారా మెడికల్ సిబ్బందిగా ఉంటున్న రేడియాలజీ సిబ్బంది ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా సెలవులు తీసుకుంటున్నారని ఇతర సిబ్బందితో పాటు రోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్లుకు 24 గంటలూ అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ రోజులో కేవలం 3 నుంచి 4 గంటలు... మహా అయితే 6 గంటలు మాత్రమే రేడియాలజీ విభాగం సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఆ తర్వాత రోగులు వచ్చినా పరీక్షలు చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఇక సెలవు దినాల్లో అయితే సరేసరి.. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో ఏకంగా విభాగానికి తాళాలు వేసేస్తున్నారు. సెలవులు మాకెందుకు వర్తించవు? పండగ సెలవులతోపాటు ఇతరత్రా సెలవులు మాకు వర్తించవా అంటూ కేజీహెచ్‌లోని మిగిలిన విభాగాల పారా మెడికల్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అస్పత్రిలో రక్తపరీక్షలు, ఫార్మశీ, నర్సింగ్ విభాగాలకు చెందిన పారా మెడకల్ సిబ్బంది మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. ఆదివారంతో సహా పండుగ సెలవుల రోజున రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలను మూసివేస్తున్న తరహాలోనే తమకు సెలవులు ప్రకటించాలని వీరంతా కోరుతున్నారు. ఇలా సెలవులు తీసుకోవడం తప్పుకాకుంటే దీనిని అన్ని విభాగాలకు వర్తింపజేసి అందరికీ సెలవులు ఇచ్చి సదరు డిపార్ట్మెంట్లకు తాళాలు వేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. -
ఏడుకు చేరిన ‘రసాయన’ మృతుల సంఖ్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శివారు స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో సారాగా భావించి రసాయనాన్ని సేవించి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో ఆదివారం ముగ్గురు మృతిచెందగా.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో 12 మందిలో సోమవారం మరో నలుగురు మృతి చెందారు. వీరిలో ఎ. చిన్నారావు (50), బి. అంకమ్మ (45), ఎ.రమణమ్మ (57), ఎ.రమణమ్మ (59) ఉన్నారు. కాగా, రసాయన మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ప్రస్తుతం కేజీహెచ్‌లో 9 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో నెఫ్రాలజీ వార్డుకు ఇద్దరిని, ఎమర్జెన్సీ మెడికల్ విభాగానికి ఇద్దరిని తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వీరు సేవించిన రసాయనం శరీరంలో అన్ని భాగాలకు విస్తరించడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో వీరందరికీ ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. అవసరమైన వారికి వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఆసనాల ఎర్రోడు (45) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ బాధితులకు 24 గంటలూ ప్రత్యేక వైద్యం అందించడానికి డాక్టర్ జి.ప్రసాద్, డాక్టర్ ఎ.సత్యనారాయణ, డాక్టర్ జి.బుచ్చిరాజు, డాక్టర్ కె.ఇందిరాదేవితో కూడిన వైద్య నిపుణుల కమిటీని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున నియమించారు. ఐఐసీటీకి రసాయనం.. ఎక్సైజ్ అధికారులు తమ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బాధితులు సేవించిన రసాయనం మిథనాల్ (మిథైల్ ఆల్కహాల్)గా తేల్చారు. ఇది ప్రాణాంతకమైనదేనని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. మరోవైపు మిథనాల్ వంటి రసాయనం సేవించిన వారిలో కొందరికి భవిష్యత్తులో శాశ్వత అంధత్వం కూడా రావచ్చని వైద్యులు చెప్పారు. కాగా, మరింతగా లోతైన పరీక్షల కోసం, దీనిలో ఇంకేమి రసాయనాలు కలిశాయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి పంపించారు. ఒకట్రెండు రోజుల్లో దీని నివేదిక రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా తమ దర్యాప్తులో భాగంగా ఈ రసాయనాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పి.హరికుమార్ ‘సాక్షి’తో చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌నాయుడు పరామర్శించారు. కనికరం లేని కలెక్టర్.. రసాయనం తాగి మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలంటూ బాధిత కుటుంబీకులు సోమవారం ఉదయం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్‌ను కలిసేందుకు వెళ్లారు. అరగంటకు పైగా వారిని బయటే కూర్చోబెట్టారు. కలెక్టర్ 11 గంటలకు వారి వద్దకు వచ్చి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. కనీసం తమ గోడు వినకుండా, పరిహారంపై స్పందించకపోవడం దారుణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ రసాయనాన్ని కొన్నారా?
-
గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెందిన అడ్మిన్..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నలుగురికి మంచి చేయాలని పరితపించిన ఓ ట్రావెల్ నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో సభ్యులకు ఆపద వస్తే ఆదుకునే నిర్వాహకుడు.. గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన మహాపాత్రుని మధు స్థానికంగా ఓ క్యాబ్(ట్రావెల్)ను నడుపుతున్నాడు. ట్రావెల్ యజమానులు, కార్ల డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి వారికి ఏదోలా సేవ చేయాలన్న దృక్పథంతో కార్ ప్రొగ్రెసివ్ ట్రేడ్ యూనియన్(సీపీటీయూ) పేరిట వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఎక్కడైనా కారు ప్రమాదానికి గురైనా.. ఆ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు నష్టం కల్గినా.. వెంటనే ఆ ఏరియా కారు డ్రైవర్లు, ట్రావెల్స్‌కు ఫోన్ చేసి సాయం చేసేలా అప్రమత్తం చేసేవాడు. అతను చేస్తున్న సేవలకు అనతి కాలంలోనే స్పందన వచ్చింది. మూడు గ్రూపుల్లో 250 మంది చొప్పున సభ్యులుగా చేరారు. ప్రస్తుతం మూడు వాట్సప్ గ్రూపులుగా ఈ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిం చింది. ఎంతో మందికి ఉపయుక్తంగా మారింది. అయితే గ్రూపు బాగా నడుస్తోందన్న సమయంలో ఓ ఐదుగురు సభ్యులు చిచ్చు పెట్టారు. చేస్తున్న సేవలకు ప్రతి గ్రూపు సభ్యుడి నుంచి డబ్బులు వసూలు చేయాలని మధుపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో వారు మధును తిట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి మాటలు తట్టుకోలేక చినముషిడివాడలోని తన ఇంటి నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ తన చావుకు కారణాలు వివరిస్తూ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. దీంతో గ్రూప్ సభ్యులు అతనిని వెతకడం ప్రారంభించారు. పెందుర్తి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న మధును కొందరు గుర్తించారు. 108 వాహనం ద్వారా కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం కేజీహెచ్ భావనగర్ వార్డులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. -
రోగుల ప్రాణాలతో చెలగాటం!
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటు, ప్రభుత్వాస్పత్రులు.. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విశాఖ నగరంలో 85 శాతం ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు లేకుండానే నడుస్తున్నాయి. అగ్నిమాపకశాఖ జారీ చేసిన నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఉంటేనే ఆస్పత్రులు నడవాలి. కానీ నగరంలో అలాంటి ఎన్వోసీలతో పనిలేకుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు వాటిని నిరభ్యంతరంగా నడుపుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ ఆస్పత్రులు ఎన్వోసీలు లేకుండా నడుస్తున్నా అగ్నిమాపకశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సంబంధిత ఆస్పత్రులకు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. విశాఖ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు 58, ప్రైవేటు ఆస్పత్రులు 213 వెరసి 271 ఉన్నాయి. వీటిలో కేవలం 44 (ప్రైవేటువి 38) ఆస్పత్రులు (15 శాతం) మాత్రమే ఎన్వోసీలను కలిగి ఉన్నాయి. మిగిలిన 227 ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ నిర్ణీత ప్రమాణాలతో పనిలేకుండా నడుస్తున్నాయి. పలు ప్రైవేటు ఆస్పత్రులు నామమాత్రపు అగ్నిమాపక పరికరాలతో నడుపుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎన్వోసీల కోసం దరఖాస్తు చేసినట్టు చెబుతున్నాయి. ఇంకా చాలా ఆస్పత్రులు ఇప్పటికీ దరఖాస్తే చేయడం మానేశాయి. కానీ నిబంధనల మేరకు అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఎన్వోసీలు పొందలేకపోతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే ఇలా ఎన్వోసీలు పొందని ప్రభుత్వాస్పత్రుల్లో కేజీహెచ్‌తో పాటు విక్టోరియా (ఘోషా) ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఇవీ నిబంధనలు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆస్పత్రుల్లో అగ్నిమాపక నిరోధక పరికరాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? అన్నదానిపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. వీటిని పర్యవేక్షించాలని కొన్నాళ్ల క్రితం అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆస్పత్రి ప్రతి ఫ్లోర్లోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో స్ప్రింక్లర్లు, ౖఫైర్ డిటెక్షన్ సిస్టం వంటివి ఏర్పాటు చేయాలి. వీటితో పాటు అత్యవసర మెట్ల మార్గం, ర్యాంపులు, ప్రత్యేక ఫైర్ పంపులు ఉండాలి. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో నిమిషానికి 1,620 లీటర్ల వేగంతో నీటిని పంప్ చేయగలిగే 50 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలి. కానీ చాలా ఆస్పత్రుల్లో ఇలాంటివేమీ లేవు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు సంబంధిత ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు కూడా రెండుసార్లు లేఖలు రాసినా అటు నుంచి స్పందన లేదని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత ప్రమాణాలు లేకుండా నడుస్తున్న ఈ ఆస్పత్రుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ఫైర్ ఎన్వోసీ పొందని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని.. ఆస్పత్రి పేరు ప్రాంతం ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ హనుమంతవాక లాజరస్ హాస్పిటల్ వాల్తేరు మెయిన్‌రోడ్డు సూర్య హాస్పిటల్ మహరాణిపేట శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ వేపగుంట వాసన్ ఐ కేర్ హాస్పిటల్ రామ్‌నగర్ ఏఎంజీ రూత్ డిచ్మన్ హాస్పిటల్ నక్కవానిపాలెం సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ మహరాణిపేట కనకదుర్గ నర్సింగ్‌హోం జిల్లాపరిషత్ గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రుషికొండ అనిల్ నీరుకొండ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సంగివలస లైఫ్‌కేర్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ కంచరపాలెం ఏసియన్ సూపర్ స్పెషాలిటీ ఈఎన్టీ ఆస్పత్రి పెదవాల్తేరు వైష్ణవి హాస్పిటల్ కలెక్టరేట్–బీచ్‌రోడ్డు లోటస్ హాస్పిటల్ గోపాలపట్నం మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ డైమండ్‌పార్క్ ఆర్కే హాస్పిటల్ గాజువాక రెండోసారి నోటీసులిస్తాం.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని, ఎన్వోసీలు సమర్పించని ఆస్పత్రులకు ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేశారు. 30 నుంచి 50 రోజుల్లో వారి నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికీ చాలా ఆస్పత్రుల నుంచి స్పందన లేదు. వీటికి త్వరలోనే రెండోసారి నోటీసులిస్తాం. అప్పటికీ స్పందించకపోతే ప్రాసిక్యూషన్ కోసం ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌కు సిఫార్సు చేస్తాం. –ఇ. స్వామి, రీజనల్ ఫైర్ సేఫ్టీ అధికారి, జీవీఎంసీ. -
కేజీహెచ్‌లోనే పసిడి స్మగ్లర్లు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): విమానాశ్రయంలో పట్టుబడిన స్మగ్లర్ల నుంచి ఇంకా పూర్తిస్థాయిలో బంగారం బయటపడలేదు. ముగ్గురు స్మగ్లర్లను శనివారం అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వారి నుంచి అప్పుడే కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారి కడుపులో ఇంకా కొంత బంగారం ఉందన్నఅనుమానంతో వారిని కేజీహెచ్‌కు తరలించి.. కడపులోంచి కక్కించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. సీటీ స్కాన్, ఎక్స్‌రేల్లో ఇద్దరి కడుపులో ఒక్కొక్కటి, మూడో స్మగ్లర్ కడుపులో ఎనిమిది బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మలద్వారా ద్వారా వాటిని బయటకు రప్పించేందుకు మందులు ఇచ్చారు. దాంతో మొదటి ఇద్దరి కడుపులో ఉన్న ఒక్కో బిస్కెట్, ఎనిమది బిస్కెట్లు మింగిన మూడో దుండగుడి నుంచి నాలుగు బిస్కెట్లను బయటకు రప్పించగలిగారు. మిగిలిన నాలుగు బిస్కెట్లను బయటకు రప్పించేందుకు మళ్లీ అతగాడికి మందులిచ్చారు. -
C/o కేజీహెచ్!
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (మ్యాక్‌లు) రోగులకు నామమాత్రపు సేవలే అందిస్తున్నాయి. గతంలో అర్బన్ డిస్పెన్సరీలుగా ఉండే వీటిని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మ్యాక్లుగా మార్పు చేశారు. విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, భీమిలిలోనూ వెరసి 24 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవి ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఈ ఆస్పత్రుల్లో డెంగ్యూ, మలేరియా, రక్తపోటు, మధుమేహం, కామెర్లు, హిమగ్లోబిన్, సీరం క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, హెచ్ఐవీ తదితర 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ కేంద్రాల సేవలను చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఈ కేంద్రాలు ప్రాథమిక వైద్యానికే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి మూడు నెలలుగా విశాఖ జిల్లా, నగరంలోనూ డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. ఒక్క కేజీహెచ్‌లోనే ఈ సీజనులో 8,400 మంది డెంగ్యూ అనుమానిత రోగులకు రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 2,800 మందికి డెంగ్యూగా నిర్ధరణ చేశారు. గడచిన మూడు నెలలుగా ఈ 24 ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 500 మంది మాత్రమే డెంగ్యూ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 25 మందికి డెంగ్యూగా నిర్ధరణ అయింది. అంటే కేజీహెచ్‌కు వెళ్లే డెంగ్యూ రోగులతో పోల్చుకుంటే 6 శాతం మందికి మించడం లేదు. అంతేకాదు.. ఈ ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యమే అందుతోంది. గతంలో డిస్పెన్సరీల్లో అవసరమైన రోగులకు సెలైన్లు ఎక్కించే వారు. మ్యాక్‌ల్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఒక్కో మ్యాక్‌లో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఒక ఫార్మసిస్టు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఆయా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలపై జనంలో అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. అక్కడ ఏఏ వైద్య సదుపాయాలున్నాయో కూడా చాలా మందికి తెలియడం లేదు. ఈ కేంద్రాల్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుండడంతో వచ్చే రోగులకు అరకొర సిబ్బంది పూర్తిస్థాయిలో వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో అక్కడ తగినంత వైద్యం అందదన్న భావనతో పలువురు కేజీహెచ్‌కు వెళ్లిపోతున్నారు. దీంతో కేజీహెచ్‌పై రోగుల తాకిడి అధికమవుతోంది. అక్కడ వైద్యులకూ భారంగా పరిణమిస్తోంది. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు జవసత్వాలు కల్పిస్తే మరింత మంది పేదలకు ఉచిత వైద్యం అందించే వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అంతా ఈశ్వరమాయ
సాక్షి, విశాఖపట్నం/విశాఖ క్రైం: కేజీహెచ్ పర్చేస్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌గా దశాబ్దమున్నరగా చక్రం తిప్పుతున్న కొటారు ఈశ్వరరావు లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని కేజీహెచ్‌లోని అన్నింటా పట్టు సంపాదించడంతో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆ సీటు నుంచి ఎవరూ కదపలేకపోయారు. దీంతో ఈ 15 ఏళ్ల సమయం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. ఇప్పుడు ఆయన అక్రమంగా బోలెడంత సంపాదించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం ఈశ్వరరావు పనిచేసే కేజీహెచ్ కార్యాలయంలోనూ, ఆయన నివాసం ఉంటున్న ఎంవీపీ కాలనీలో ఇంటితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆయనకు చెందిన ఇళ్లు, స్వస్థలం యలమంచిలి, నక్కపల్లి, నర్సీపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలలోని సొంత ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానం ఈశ్వరరావు 1986లో జూనియర్ అసిస్టెంట్‌గా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కోస్టలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేశాక విశాఖ బదిలీపై వచ్చారు. 15 ఏళ్ల నుంచి కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీవో సంఘం నేతగా గుర్తింపు పొందిన ఆయనపై తరచూ ఆరోపణలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. వివిధ ప్రాంతాల్లో ఆస్తులను కూడబెట్టుకున్నా పెద్దగా దృష్టి సారించలేదు. ఎప్పుడైనా కేజీహెచ్‌కు అవసరమైన మందుల కొరత ఏర్పడినప్పుడు నిధులతో పనిలేకుండా అప్పటికప్పుడు తన పలుకుబడితో రప్పించేవారని చెబుతారు. మరోవైపు కేజీహెచ్ అధికారులకు కూడా మందులు, సర్జికల్స్ కొనుగోళ్లలో కమీషన్లు ముట్టచెబుతారన్న ప్రచారం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నా ఈశ్వరరావును మరో చోటకు కదపకుండా ఉన్నతాధికారులు అక్కడే కొనసాగిస్తున్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆ సీటు నుంచి వెళ్లిపోతానని చెప్పడమే తప్ప అది కార్యరూపం దాల్చలేదు. ఇలా ఈశ్వరరావు తన ప్రస్థానాన్ని కేజీహెచ్‌కే పరిమితం చేస్తూ ఎన్జీవో నేతగా వర్థిల్లుతున్నారు. ఎట్టకేలకు ఏసీబీకి చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. డీజీ ఆదేశాలతో సోదాలు ఏసీబీ డీజీ ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్రతో కలిసి ఈశ్వరరావు ఆస్తులపై సోదాలు నిర్వహించినట్టు విశాఖ ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. కేజీహెచ్‌లో మెడికల్ స్టోర్, çసర్జికల్స్æ స్టోర్, మందుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు నిర్థారణ అయిందన్నారు. వీటి కొనుగోలు లావాదేవీలపై పరిశీలిస్తున్నామన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసి, ఈశ్వరరావును ఆరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా బయోమెట్రిక్ విధానం పరిశీలించగా 25 శాతం డాక్టర్లు విధులకు గైర్హాజరైనట్లు తెలిసిందన్నారు. మినిస్టీరియల్ స్టాఫ్ కూడా 20 శాతం హాజరుకావడం లేదన్నారు. సోదాల్లో సీఐలు గణేష్, రమేష్, అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల్లో కలకలం ఆదాయానికి మించిన ఆçస్తుల కేసులో ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కడంతో ఉద్యోగుల్లోకలకలం రేగుతోంది. త్వరలో ఎన్జీవోసంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ దాడుల వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న ప్రచారం ఆ వర్గాల నుంచివినిపిస్తోంది. ఇదీ ఈశ్వరరావు ఆస్తుల చిట్టా ఈశ్వరరావుకు తన సొంతూరు యలమంచిలిలో మూడు మందుల షాపులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మందుల కొనుగోలులో ఆరితేరిన ఆయన ఈ మందుల షాపులను బినామీల పేరిట నడుపుతున్నారని సమాచారం. మరోవైపు కేజీహెచ్‌కు 80 శాతం మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వస్తుంటాయి. మిగిలిన 20 శాతం స్థానికంగా కొనుగోలు చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇలా గుంటూరులో జైకృష్ణా ఏజెన్సీస్‌కు పలుమార్లు టెండర్లు ఖరారు చేసి కొనుగోళ్లు జరుపుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే నర్సీపట్నంలో 2 ఎకరాల భూమి, 1,416.5 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 375 గజాల ఇళ్ల స్థలం, నక్కపల్లిలో 1.62 ఎకరాల వ్యవసాయ భూమి, ద్రాక్షారామం వెంకటాయపాలెం 1.40 ఎకరాల పంటభూమి, యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లిలో 0.25 సెంట్ల భూమి, అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి దరి రాధ ఎన్‌క్లేవ్‌లో ఒక ప్లాట్, ఎంవీపీలో రెండు అంతస్తుల భవనం, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6లక్షలు, బీమా పాలసీలు రూ.7లక్షలు, సీతమ్మధారలో కెనరా బ్యాంక్‌లో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.10 లక్షల పొదుపు ఖాతాలున్నట్టు నిర్థారించారు. భూములకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ కాలనీలోని ఇంట్లో రూ.90 వేల నగదు, 160 గ్రామల బంగారం, కిలోన్నర వెండిని ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకరును బుధవారం తెరవనున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అ«ధికారులు అంచనా వేస్తున్నారు. యలమంచిలిలోని తల్లి ఇంట్లో సోదాలు యలమంచిలి: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక ఇంటిలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కేజీహెచ్‌లో మెడికల్ పర్చేజ్ ఇన్చార్జిగా పనిచేస్తున్న కె.ఈశ్వరరావు ఆదా యానికి మించిన ఆస్తులు సంపాదించారని గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయన స్వగ్రామమైన యలమంచిలిలో తనిఖీలు నిర్వహించారు. యలమంచిలిలో ఈశ్వరరావు తల్లి సన్యాసమ్మ ఉంటున్న ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆస్తుల వివరాలపై ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సోదాల్లో ఏసీబీ అధికారి మహేష్‌తోపాటు మరో నలుగురు సిబ్బంది పాలొన్నారు. -
కేజీహెచ్‌లో రోడ్లు జలమయం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కేజీహెచ్ అంతర్గత మార్గాలన్నీ జలమయమై రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎముకల విభాగం, ప్రసూతి విభాగం, ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లే మార్గాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా రక్తపరీక్షలు నిర్వహించే 26వ నంబరు ఆవరణంతా జలమయమైంది. నిల్వ ఉన్న నీళ్లలోనే రోగులు, వారి బంధువులు రక్తపరీక్షల నిర్ధారణ పత్రాల (బ్లడ్ రిపోర్ట్స్) కోసం నిల్చున్నారు. రోగులు కూర్చునే షెడ్డు కారిపోతుండడంతో తడుస్తూనే వేచి ఉన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కేజీహెచ్‌లోని అంతర్గత మార్గాలు పూర్తిగా శిథిలమైపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది. అదే విధంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన పనులను జీవీఎంసీ చేపట్టింది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా పని పూర్తి కానందున రోడ్లమీద నిలిచిన నీరు బయటకు వెళ్తేందుకు అవకాశం కనిపించడం లేదు. దీంతో వర్షాకాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది తప్పడం లేదు. -
విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ కలకలం
-
ప్రత్యేక హోదా కోసం రక్తదాన శిబిరం
సాక్షి, విశాఖ : ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీతో పాటు విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర హక్కుల కోసం రాజకీయ పార్టీలన్నీ తమ జెండాలను పక్కన పెట్టి పోరాడినప్పుడే కేంద్రం దిగివస్తుందన్నారు. బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. -
వెనక్కి తగ్గం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తారని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ జీవోలు చెవిలో పువ్వులు అంటూ నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాలను 15 శాతం పెంచామని, బకాయిపడ్డ ఉపకార వేతనాలను వెంటనే చెల్లిస్తామని చెబుతూ ప్రభుత్వం దొంగ జీవోను విడుదల చేసిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జూనియర్ వైద్యులను వంచిస్తుందన్నారు. నెల రోజుల నుంచి ఉపకార వేతనాలను పెంచాలని వినతి పత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 2009లో పెంచిన ఉపకార వేతనాన్నే ఇప్పటీకీ చెల్లిస్తున్నారని, 2018లో పెంచాల్సి ఉన్నా ఇప్పటివరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 2016–17లో బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర కేసులను చూసేందుకు టీమ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. పీజీ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుని మరుసటి ఏడాది రిజిస్ట్రేషన్ చేస్తుందని, నమోదు అయిన తరువాత సీనియర్ రెసిడెంట్స్‌గా గుర్తింపు పొందేందుకు మరో ఏడాది పనిచేయాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విద్యా సంచాలక శాఖ సీనియర్ రెసిడెంట్స్ పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రెసిడెంట్స్‌కు పీజీ పూర్తి చేసిన రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యానికి భంగం కలిగి ప్రాణనష్టం జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, జూనియర్ వైద్యులది కాదని అన్నారు. అనంతరం కేజీహెచ్, జగదాంబ కూడలి, సరస్వతీపార్క్, డాబాగార్డెన్స్, జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
కేజీహెచ్‌లో ఒక్క నెలలో 483 మంది మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రధాన రహదారిలో పెరుగు జంక్షన్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఉన్న తోపుడు బండిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. మృతులను అనకాపల్లి ములపాడుకు చెందిన శివతేజ(17), సాయి(18)గా పోలీసులు గుర్తించారు. -
పార్వతీపురంలో డెంగీ...?
కేజీహెచ్‌లో కోమాలో ఉన్న బాధిత యువకుడు... పార్వతీపురం : జిల్లాను అతలాకుతలం చేస్తున్న డెంగీ ప్రస్తుతం పార్వతీపురాన్ని తాకింది. మండలంలోని జగన్నాథపురం ఒకటో వార్డు కష్ణా కాలనీకి చెందిన 19 ఏళ్ల చుక్క సాయికి డెంగీ సోకినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట జ్వరంతో బాధపడిన సాయిని అతని తండ్రి రామారావు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు యువకుడ్ని పరిశీలించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఆ యువకుడ్ని విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే కోమాలోకి చేరుకున్నట్లు సమాచారం. అక్కడ నుంచి సాయిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సాయిని పరీక్షించి డెంగీ లక్షణాలున్నట్లు చెప్పారని తెలిసింది. అధ్వానంగా పారిశుద్ధ్యం జగన్నాథపురంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్లే డెంగీ లాంటి జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడే చెత్తా,చెదారాలు పేరుకుపోవడం, కాలువలు మురుగుతో నిండిపోయి ఉన్నాయని చెబుతున్నారు. ఫలితం లేదు– ముత్యాల ఉష, వార్డు కౌన్సిలర్ వార్డులో పారిశుద్ధ్యం క్షీణించిందని, వెంటనే పనులు చేపట్టాలని గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. విజంభిస్తున్న దోమలు– ఇజ్జాడ శ్యామల, దూబగడ్డవీధి పగలు, రాత్రి అనే తేడా లేకుండా దోమలు విజంభిస్తున్నాయి. దీంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే కాలనీలో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. పట్టించుకోలేదు...రాగోలు లక్ష్మణ, జన్మభూమి కమిటీ సభ్యులు వార్డు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు అస్సలు సమస్యలు వినడం లేదు. దీంతో జగన్నాథపురంలో ఇబ్బందుల తలెత్తుతున్నాయి. -
అరకు ఘాట్‌రోడ్డులో చెట్టును ఢీకొట్టిన కారు..
- ఐదుగురికి గాయాలు అరకులోయ(విశాఖ) వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని రవిచంద్రనగర్కు చెందిన ఓ కుటుంబ సభ్యులు అరకు లోయ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషోర్(14)ను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ మృతి
-
శశికుమార్ మృతిపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆకస్మిక మృతికి ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాడేరులో గురువారం ఉదయం ఏఎస్పీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఏఎస్పీ మరణ వార్త విన్న వెంటనే ఉపముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని విశాఖ బయలుదేరారు. కేజీహెచ్‌లో ఉంచిన శశికుమార్మృతదేహాన్ని సందర్శించనున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
రైల్వే జోన్‌పై పోరాటం కొనసాగుతుంది
విశాఖపట్నం: విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంగళవారం ఆయన్ను కేజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ఐదు రోజుల పాటు నిరవధిక దీక్ష చేసిన విషయం తెలిసిందే. -
గర్భశోకం
కేజీహెచ్‌లో ఇద్దరు శిశువుల మృతి నర్సు నిర్లక్ష్యం.. వైద్య సేవల లోపమేనంటూ బంధువుల ఆందోళన విచారణకు మంత్రి ఆదేశం విశాఖ మెడికల్ : కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఇద్దరు శిశువులు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతిచెందారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన 29 రోజుల ఆడ శిశువును చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌లో ఈ నెల 4న చేర్పించారు. కాలికి పుండు కావడంతో 5న ఆపరేషన్ చేశారు. 6వ తేదీన రక్తం ఎక్కించారు. ఆ బాలిక గురువారం ఉదయం మృతిచెందింది. అయితే తమ బిడ్డకు వైద్యుడి పర్యవేక్షణలో కాకుండా నర్సు నిర్లక్ష్యంగా వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో మృతి చెందిందని తల్లిదడ్రులు సౌందర్య, సామంతుల శివరావ్ ఆరోపించారు. ఈ మేరకు వారు బంధువులతో కలిసి పిల్లల వార్డు వద్ద ఆందోళనకు దిగారు. తరువాత కేజీహెచ్ సూపరింటెండెంట్ తో పాటు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మధ్యాహ్నం కేజీహెచ్‌లో న వజాత శిశువు ప్రత్యేక వైద్య (ఎస్ఎన్సీయూ) విభాగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావును ఆడ శిశువు కుటుంబీకులు అడ్డగించి తమ గోడును వినిపించే ప్రయత్నం చేయగా, మంత్రి వినిపించుకోకుండా కేవలం ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పిన విషయాన్నే నమ్ముతూ 24 గంటల్లోగా విచారణ జరిపిస్తామని చెప్పి వెళ్లారు. కాగా, వైద్య వర్గాలు మాత్రం రక్తంలో తీవ్రమైన ఇనెఫెక్షన్ (సెప్సీసీమియా) కారణంగా మృతి చెందినట్టు చెబుతున్నారు. ఆక్సిజన్ లేక మరో శిశువు మృతి! ఆయాసంతో బాధపడతున్న విశాఖ జిల్లా అరకులోయ గన్నెల గ్రామానికి చెందిన రెండు నెలల లోపు గిరిజన మగ శిశువును అంబులెన్స్‌లో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తెచ్చారు. తరువాత పిల్లల వార్డులోకి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా తరలించడంతో ఊపిరి ఆడక మృతి చెందినట్టు శిశువు తల్లిదండ్రులు సంతోష్‌కుమార్, చంద్రకళ ఆరోపించారు. వీరు కూడా పిల్లల వార్డు వద్ద కాసేపు ఆందోళనకు దిగారు. అయితే వీరి వెంట బంధువులెవరూ లేకపోడంతో ఏమీ చేయలేక మృతదేహాన్ని తరలించేందుకు కనీసం అంబులెన్స్ సదుపాయమైనా కల్పించాలని అధికారులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఐదేళ్ల పైబడిన గిరిజనులు మృతి చెందినప్పుడు మాత్రమే అంబులెన్స్ సౌకర్యం ఉంటుందని ఆస్పత్రి అధికారులు చెప్పడంతో చేసేది లేక నిరుపేదలైన ఆ గిరిజన దంపతులు అప్పుచేసి రూ.3,500తో ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ సంఘటనలపై ఆస్పత్రి సూపరింటె ండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబురు వివరణ కోరగా ఈ ఇద్దరు శిశువుల మృతిపై ముగ్గురు సభ్యులతో కూడిన ఆస్పత్రి క్రమ శిక్షణ కమిటీతో విచారణకు ఆదేశించామని చెప్పారు. -
కేజీహెచ్‌లో చిన్నారి మృతి
దాబాగార్డెన్స్: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసిపాప బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గురువారం వెలుగు చూసింది. విజయనగరానికి చెందిన దంపతులకు గత నెల 4 న ఆడబిడ్డ పుట్టింది. అనంతరం పాపకు ఇన్ఫెక్షన్ సోకడంతో కేజీహెచ్‌లోని పిల్లల వార్డుకు తరలించారు. అప్పటినుంచి అక్కడే ఉండి చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం కన్నుమూసింది. కాగా.. రక్తం ఎక్కించడానికి సిద్ధం చేసిన నర్సులు ఆ తర్వాత రక్తం ఎక్కుతుందా లేదా అనే విషయాన్ని గమనించ లేదని, అందువల్లే పాప మతిచెందినట్లు తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు. -
విశాఖలో ప్రైవేటు బస్సు బీభత్సం
విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నర్సింహనగర్ నుంచి హైవేకు వెళుతున్న ఆదిత్య టూర్స్ ట్రావెల్స్ మినీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. అదే క్రమంలో నడచి వెళుతున్న వారిపైకి కూడా దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. రవాణాశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రి గంటాకు బీజేపీ ఎమ్మెల్యే షాక్
-
మంత్రి గంటాకు బీజేపీ ఎమ్మెల్యే షాక్
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్‌కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు షాక్ ఇచ్చారు. విశాఖలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో గంటాను విష్ణుకుమార్ రాజు నిలదీశారు. 'కేజీహెచ్‌కు తగినంత నర్సింగ్ సిబ్బందిని ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అన్ని వసతులు ఉన్న కేజీహెచ్‌లో దంత వైద్య కళాశాల ఎందుకు పెట్టరు?. ఈ విషయంలో పదే పదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా స్పందించడం లేదు. అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు డిమాండ్ చేసినా ప్రయోజనం లేదు' అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న మంత్రి గంటా... విష్ణుకుమార్ రాజుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ బీజేపీ వద్దే ఉంది కదా అని గుర్తు చేశారు. దీనిపై వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
కేజీహెచ్ పిల్లల వార్డులో అగ్నిప్రమాదం
విశాఖ: విశాఖ కేజీహెచ్ లోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో సోమవారం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో చంటిబిడ్డలను తీసుకొని తల్లులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్నఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సర్వీస్ వైర్లో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
భౌబోయ్..ఎంత ఘోరం..
ఇంట్లో ఉన్న బాలుడిపై దాడి పీక్కుతిన్న శునకాలు విశాఖలో దారుణం సాక్షి, విశాఖపట్నం : అప్పటిదాకా అమ్మ ఒడిలో ఆటలాడుకున్నాడు. కాసేపు అమ్మతోనే గడిపాడు. అమ్మ బట్టలుతుకుతుంటే బుల్లిచేతులతో సాయమూ చేశాడు. కన్నపేగు చేయూతను చూసి ఆ తల్లి మురిసిపోయింది. బిడ్డపై కోటి ఆశలతో ఆనంద డోలికల్లో మునిగిపోతూ శ్రమను మరిచిపోయింది. నాన్నా! ఇక్కడొద్దు.. ఇంట్లోకెళ్లిపోరా! అంటూ సున్నితంగా ఇంటికి పంపేసింది. అంతే.. కాసేపటికే కీడు శంకించింది. కుక్కల హడావుడి వినిపించింది. చిన్నారి ఏమయ్యాడోనని పరుగు తీసింది. ఇల్లంతా వెతికింది. చివరకు పేగులు బయటకొచ్చిన ముద్దుల బిడ్డను శునకాలు పీక్కుతింటున్న ఘోరాన్ని కళ్లారా చూసి హతాశురాలైంది. ఆమె అరుపులు, కేకలు విని ఇరుగుపొరుగు వారు పరుగు పరుగున వచ్చి చిన్నారి శివకేశవ్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. ప్చ్! అప్పటికే ఘోరం జరిగిపోయింది. అయినా ఆఖరి ఆశతో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు అశువులు బాశాడని బరువెక్కిన గుండెలతో వైద్యులు చెప్పారు..! బతుకు దెరువు కోసం పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరేళ్ల క్రితం వచ్చి తమ బతుకేదో తాము బతుకుతున్నారు.. పోతయ్య, రమణమ్మ దంపతులు. వీరి ఇద్దరి సంతానంలో కుక్కలు పొట్టనబెట్టుకున్న ఏడాదిన్నర శివకేశవ్ ఆఖరి వాడు. రోజూ ఆ ప్రాంతంలో వచ్చీరాని నడకతో, అర్థం కాని ముద్దుముద్దు మాటలతో అక్కడి వారిని అలరించేవాడు. తన చిలిపి చేష్టలతో అమ్మానాన్నల కష్టాన్ని మరిపించేవాడు. అలాంటి అల్లరి పిడుగుని చూసి విధికి కన్నుకుట్టినట్టుంది. శున కాల రూపంలో పంపి పొట్టనబెట్టుకుంది. ‘కుక్కల దాడిలో గాయపడ్డ వారినీ చూశాం.. కానీ ఇంతలా దారుణానికి ఒడిగట్టడాన్ని ఎప్పుడూ చూడలేదు.. పగవాళ్లకు కూడా ఇలాంటి శోకం పెట్టకు దేవుడా!’ అంటూ కేజీహెచ్ క్యాజువాల్టీలో పేగులూడి బయటపడ్డ ఆ బాలుడిని చూసిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. బంధాలకతీతంగా కన్నీరొలికారు. బరువెక్కిన గుండెలతో అక్కడ నుంచి నిష్ర్కమించారు. మార్చురీలో శాశ్వత నిద్రకుపక్రమించిన చిన్నారి, బయట అమ్మానాన్నలు, అయిన వారూ తిరిగి రాని శివకేశవ్ కోసం ఎదురుచూస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. -
'25 ఏళ్లుగా లిఫ్ట్ పనిచేయకపోతే ఏం చేస్తున్నారు'
విశాఖ: నగరంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఆస్పత్రి లిఫ్ట్ పనిచేయడం లేదని చెప్పిన డాక్టర్లపై గంటా మండిపడ్డారు. శుక్రవారం కేజీహెచ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గంటా.. రోగులకు వైద్యం సరిగా అందకపోవడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారంటూ వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే 25 ఏళ్లుగా ఆస్పత్రి లిఫ్ట్ పనిచేయని విషయాన్ని వైద్యులు ఈ సందర్భంగా గంటా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై గంటా తీవ్ర స్థాయిలో స్పందించారు. అప్పట్నుంచి లిఫ్ట్ పనిచేయకపోతే ఇప్పటివరకూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. -
కేజీహెచ్ పై దిగివచ్చిన ప్రభుత్వం
విశాఖ మెడికల్: కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిన కేర్ ఆస్పత్రికి అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎట్టకేలకూ వెనక్కుతీసుకొంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్డియోథొరాసిక్ సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో పీపీపీ విధానంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సర్జన్లను రప్పించి శస్త్రచికిత్సలు చేయించాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సలను కేర్ ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో నిర్వహించాలని తొలుత నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఈ నెల 16న సాక్షిలో ‘కేజీహెచ్ గుండె ప్రైవేటు పరం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇతర పలు ప్రజాసంఘాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం కేర్ ఆస్పత్రితో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.ఖాళీగా ఉన్న ఓపెన్ హార్ట్ సర్జన్ పోస్టును భర్తీచేసింది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీలకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. -
ఏంటీ స్పెషల్ ట్రీట్మెంట్
- మెన్ స్పెషల్‌లో మహిళా ఖైదీ - కేజీహెచ్‌లో కలకలం - అంతా అనధికారికమే.. - ఇతర ఖైదీల బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి విశాఖ మెడికల్: ఓ మహిళా రిమాండ్ ఖైదీకి మెన్ స్పెషల్ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక సదుపాయాలు గల గది కేటాయింపు వ్యవహారం మంగళవారం కేజీహెచ్‌లో వివాదానికి దారితీసింది. తోటి ఖైదీల బంధువులు ఈ విషయాన్ని డెప్యూటీ జైలు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఈ విషయమై కేజీహెచ్ సూపరింటెం డెంట్‌ను ఆరా తీయగా మంగళవారం సంబంధిత విభాగానికి చెందిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లను చాంబర్‌కు పిలిచి నిజానిజాలను విచారించగా ఖైదీకి స్పెషల్ రూమ్ కేటాయింపేకాదు, నాలుగు రోజులుగా రిమాండ్ ఖైదీ తమ యూనిట్లో చికిత్స పొందుతున్న విషయం తమకు తెలియదని తేల్చిచెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన సూపరింటెండెంట్ మొత్తం వ్యవహారాన్ని కూపీ లాగారు. చింతపల్లి ఖజానా కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా అరెస్టయిన పాడేరు అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.స్వప్న కుమారి రిమాండ్ ఖైదీగా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈనెల 23న జ్వరం, డయాబెటిస్తో పాటు గుండె సంబంధ ఇబ్బందితో ఆమెను జైలు వైద్యులు కేజీహెచ్‌కు తరలించారు. అత్యవసర వైద్య విభాగంలో పరీక్షించిన సీఎంఓ మెడిసిన్ నాలుగో యూనిట్లో అడ్మిట్ చేశారు. ఈ వ్యవహారం సంబంధిత యూనిట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు తెలియకుండా జరగడం విశేషం. స్వప్నకుమారి బంధువైన మత్తువైద్య విభాగానికి చెందిన ఓ పీజీ వైద్యుడు సిఫార్సుతో నాలుగో యూనిట్‌కు చెందిన ఓ సహాయ వైద్యురాలు ఆమెను చేర్చుకున్నట్లు తెలిసింది. కేజీహెచ్‌లో మహిళా రిమైండ్ ఖైదీలను ఉంచి చికిత్స అందించేందుకు ప్రత్యేక సెల్ లేకపోవడంతో స్వప్నకుమారిని రాజేంద్రప్రసాద్ వార్డులోని సీ వార్డులో అడ్మిషన్ కల్పించారు. 24వ తేదీ మధ్యాహ్నం వరకూ ఆమెను ఆర్పీసీ వార్డులోఉంచి చికిత్సలు అందించారు. అనంతరం అనధికారికంగా మెన్ స్పెషల్ వార్డుకు తరలించారు. ఈ తరలింపు వెనుక కూడా ఆమెను చేర్చుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, మత్తు విభాగం పీజీలతో పాటు ఆస్పత్రికి చెందిన కొంత మంది అధికారుల హస్తం ఉన్నట్లు తేలింది. మహిళా ఖైదీలకు ప్రత్యేక సెల్ లేకపోవడంతో ఆర్‌పీసీలోని ఓ గదిలో ఉంచి చికిత్సలు అందించాలని తొలుత భావించినప్పటికీ, స్వప్నకుమారి విముఖత వ్యక్తం చేయడంతో మెన్ స్పెషల్ వార్డులో ఉంచేందుకు ఆస్పత్రి అధికారులు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆమెకు సెక్యూరిటీగా వచ్చిన కానిస్టేబుల్‌ను సైతం మచ్చికచేసుకొని, సాధారణ ఖైదీకి ఇవ్వాల్సిన విధంగా కాకుండా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం వెనుక ఆస్పత్రి అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారన్న విమర్శలు వెల్లువెత్తడంతో మంగళవారం మధ్యాహ్నం సూపరింటెండెంట్ ఆమెను యథావిధిగా రాజేంద్రప్రసాద్‌లోని సీ వార్డుకు చికిత్స కోసం వెనక్కి పంపారు. దీంతో వివాదం సద్దుమనిగింది. ఖైదీల బంధువుల ఫిర్యాదు వెనుక ఓ మాజీ ఆర్ఎంఓ హస్తం ఉన్నట్లు సమాచారం. కేవలం బెయిల్ ప్రయత్నంచేసుకోవడానికే ఈ విధంగా చికిత్సకోసం పథకాన్ని రూపొందించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కేజీహెచ్ ‘గుండె’ ప్రైవేటుపరం
గుండె శస్త్ర చికిత్సల విభాగంపై కార్పొరేట్ కన్ను * సిబ్బందిని, వైద్యపరికరాలను సమకూర్చని ప్రభుత్వ పెద్దలు * వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిన అధికారులు * ఆగస్టునుంచి కేజీహెచ్‌లో కార్పొరేట్ రాజ్యం * పేదలకు వైద్యం సహాయంపై కొరవడిన స్పష్టత సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)... ఉత్తరాంధ్ర పేద, మధ్యతరగతి రోగులపాలిట సంజీవని. అందులో కీలకమైన గుండె శస్త్రచికిత్సల విభాగం ఇప్పుడు ప్రైవేటుపరం కానుంది. సిబ్బంది లేరన్నదాన్ని సాకుగా చూపి ఆ విభాగాన్ని ఓ కార్పొరేట్ అస్పత్రికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఇప్పుడు సొమ్మొకడిది... సోకొకడిది అన్నట్లుగా కేజీహెచ్ ఆస్పత్రిలో కార్పొరేట్ డాక్టర్లు రాజ్యమేలనున్నారు. వ్యూహాత్మకంగానే నిర్వీర్యం... విశాఖ కేజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్సల విభాగం కొన్ని నెలల కిందటి వరకూ బాగానే పనిచేసింది. నెలకు ఏడెనిమిది ఆపరేషన్లు చేస్తుండటంతో ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది పేద, మధ్యతరగతి రోగులు కేజీహెచ్‌కు వస్తుండేవారు. కానీ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఓ పథకం ప్రకారం ఈ విభాగాన్ని నిర్వీర్యం చేశారు. అవసరమైన పరికరాలుగానీ సిబ్బందినిగానీ కేటాయించకుండా ఇబ్బంది పెట్టారు. హార్ట్‌లంగ్ మెషిన్ పాడైతే ఆరునెలలుగా మరమ్మతులు చేయించలేదు. కీలకమైన పెర్ఫ్యూజనిస్ట్ పోస్టు ఖాళీ అయితే భర్తీ చేయలేదు. దాంతో ఐదారు నెలలుగా ఆ విభాగంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ విభాగానికి చెందిన వైద్య అధికారి కేజీహెచ్ ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదని తెలుసుకున్న ఆయన బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆ విభాగాన్ని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగిస్తూ తాజాగా నిర్ణయించారు. సొమ్ములు ప్రభుత్వానివే కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించాలని నిర్ణయించిన తరువాత ఆ విభాగానికి వైద్య, ఆరోగ్య శాఖ నిధులు కేటాయించడం విస్మయపరుస్తోంది. హార్ట్‌లంగ్ మెషిన్‌తోపాటు పలు మోనిటర్లు, వెంటిలేటర్లు, ఇతర పరికరాలను దాదాపు రూ.6కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి ఈ విభాగంలో శస్త్రచికిత్సలు మాత్రం చే సి వెళ్లిపోతారు. వారికి కేజీహెచ్‌లోని అసిస్టెం ట్ ప్రొఫెసర్లు, ఇతర పీజీ వైద్య విద్యార్థులు సహకరించాలి. పోస్టు ఆపరేటివ్ సేవలతోపాటు రోగులకు అవసరమైన ఇతరత్రా వైద్య సేవలన్నీ కూడా కేజీహెచ్ సిబ్బందే చేయాలి. పేద రోగులపై వేటే ఇప్పటివరకూ కేజీహెచ్‌లోని అన్ని విభాగాల్లోనూ ఉచితంగానే వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు/ తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు, లేనివారు కూడా ప్రస్తుతం కేజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు. గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని కార్పొరేట్ సంస్థకు అప్పగించిన తరువాత పరిస్థితి ఏమిటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్ బాబును సంప్రదించగా... గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ఆగస్టు 1 నుంచి తెరుస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. -
రెప్పల మాటున ఉప్పెన
లోకేష్, రాజు మృతదేహాలు లభ్యం విజయ్ కోసం బంధుమిత్రుల గాలింపు తుదిలేని కుటుంబ సభ్యుల కన్నీటి వేదన సాగర్‌నగర్(విశాఖపట్నం) : కన్నవారికి కడుపు కోత మిగులుస్తూ గురువారం గల్లంతైన బి.లోకేష్, పి.రాజు మృతదేహాలు సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న తీరంలో శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. ఆరిలోవ బాలాజీనగర్‌కు చెందిన వీరు జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానానికి దిగి కెరటాలకు బలైన విషయం తెలిసిందే. వీరితోపాటు గల్లంతైన ఆకుల విజయకాంత్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం బంధువులు, స్నేహితులు, పోలీసులు తీరం వెంబడి గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కుప్పకూలిన తల్లిదండ్రులు చెట్టంత కొడుకులు ప్రయోజకులవుతారని, అండగా ఉంటారని ఆశించిన కన్నవారి కలలు కల్లలయ్యాయి. లోకేష్, రాజు మృతదేహాలు లభించడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా పెద్దపెట్టున రోదించారు. క్షేమంగా ఉన్నారేమో.. ఎలాగైనా తిరిగి వస్తారేమోనని మిణుకుమిణుకుమంటున్న చిన్నపాటి ఆశ కూడా చెదిరిపోవడంతో కుప్పకూలిపోయారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని ఆనందిస్తున్న సమయంలో విధి తమపై చిన్నచూపు చూసిందని లోకేష్ నాన్నమ్మ చంద్రవతి వాపోయింది. రాజు తల్లిదండ్రుల పరిస్థితీ అలాగే ఉంది. స్నేహితులతో సరదాగా వెళ్లిన కొడుకు తిరిగి వస్తాడన్న ఆశంతా ఆవిరైపోయిందని... మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుతో విలపిస్తున్నారు. మృతదేహాలకు పీఎం పోలీస్‌ల ఆధ్వర్యంలో పంచనామా చేసి కేజీహెచ్‌కు తరలించారు. విజయ్ కోసం ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గాలిస్తున్నారు. తొందరగా వచ్చేస్తానన్నాడు నైట్ డ్యూట్ చేసి ఇంటికొచ్చాను. టిఫిన్ చేస్తుండగా బయలు దేరాడు. తొందరగా వచ్చేస్తాను నాన్నా.. అని స్నేహితులతో కలిసి వెళ్లాడు. మరి తిరిగిరాడనుకోలేదు. చిన్నోడని గారాబంగా పెంచాను. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. -బి.వి.వి.రామారావు, లోకేష్ తండ్రి తమ్ముడూ... ఎక్కడున్నావు? విజయ్‌కాంత్ మృతదేహం కోసం తెల్లవారుజాము నుంచి పదిమంది స్నేహితులం గాలిస్తున్నాం. ఎక్కడా లభించలేదు. తెన్నేటిపార్కు, జాలరీపేట, సాగర్‌నగర్, తిమ్మాపురం బీచ్ వరకు వెదుకుతున్నాం. - లక్ష్మణ్, విజయ్‌కాంత్ అన్న, ఆరిలోవ -
కేజీహెచ్‌కు త్వరలో నవశకం
విశాఖ మెడికల్: కేజీహెచ్ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. కొత్త భవనాలు రానున్నాయి. నిధులున్నా ఏడాదిన్నరగా నిర్మాణ అనుమతులు రాక ఎదురుచూస్తున్న ఆసుపత్రిలోని ప్రతిష్టాత్మక సీఎస్ఆర్ (సామాజిక భాధ్యతానిధులు) ప్రాజెక్టు కింద వీటిని నిర్మించనున్నారు. రూ.70 కోట్ల వ్యయంతో ఆసుపత్రి ఆవరణలో పాత ఈఎన్టీ బ్లాకు స్థానే ఎకరా స్థలంలో పది అంతస్తుల సర్జికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ భవన సముదాయ నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేసినా, ఇంతవరకు అనుమతులురాలేదు. దీంతో ఈప్రాజెక్టు చతికిలపడింది. ఈమేరకు ఆసుపత్రి వర్గాలు అనుమతులు కోసం పదేపదే ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని,ఆశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంలు తాజాగా ఈప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈప్రాజెక్టు నిర్మాణంపై ఆసుపత్రి వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు ఆసుపత్రి సర్వీసులు మౌలిక వసతుల సంస్థ డీఈ ప్రభాకర్ లు రెండురోజులు క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎస్ఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్టీల్‌ప్లాంట్, పోర్టుట్రస్టు,ఓఎన్జీసీ,గెయిల్,ఎన్టీపీసీలు నిధులు సమకూర్చేందుకు కేజీహెచ్‌తో ఎంఓయూలను కుదుర్చుకున్నాయి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కూడా ఐదుకోట్లు ఇవ్వడానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రప్రభుత్వ సంస్థలు 65 కోట్ల రూపాయలను రానున్న నాలుగు ఐదు ఏళ్లలో దశల వారీగా ఇవ్వడానికి అంగీకారం తెలిపాయి. ఇందులో భాగంగా రూ.5 కోట్లు చెక్కును తొలివిడతగా ఓఎన్జీసీ ఇప్పటికే అందచేసింది. టీఎస్సార్ చొరవ: ఈప్రాజెక్టు నిర్మాణ నిధులను సేకరించడంలో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలతో చర్చించి నిధులు వచ్చేలా చొరవ చూపారు. వాస్తవానికి ఈప్రాజెక్టు నిర్మాణ అనుమతులు కోసం ప్రభుత్వానికి ఆర్నెళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపగా అప్పట్లోనే అనుమతులు వస్తాయని ఆసుపత్రి వర్గాలు భావించాయి. ఈలోగా ప్రభుత్వం కేజీహెచ్ సమగ్ర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ప్లాన్పైకి తమ దృష్టిని మరల్చడంతో ఈప్రాజెక్టు నిర్మాణ అనుమతులకు బ్రేక్ పడింది. మాస్టర్ ప్లానులో భాగంగా సీఎస్ఆర్ నిధులతో పాటు మరికొంత సొమ్మును జతచేసి వందకోట్లుతో మాస్టర్‌ప్లానును రూపొందించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఇందుకోసం సీఎస్ఆర్ భవన సముదాయానికి ముందు వరుసలో మరో పది అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించి వార్డులు, ఐసీయూలు అన్నింటినీ అందులోకి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం అదే స్ధలంలో ఉన్న ఎముకలు,ప్రసూతి వార్డులను తొలగించాలని ఆలోచిస్తున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బహుల అంతస్తుల భవన నిర్మాణం కూడా సాకారమైతే కేజీహెచ్ మొత్తం సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌తో సహా 20అంతస్తులు భవన సముదాయాల కల నెరవేరనుంది. ఇవీ ప్రతిపాదనలు ఈప్రాజెక్టు కింద రానున్న పది అంతస్తుల సీఎస్ఆర్ర్ భవన సముదాయంలో ఐదు వందల పడకలు ఏర్పాటు కానున్నాయి. తొలిఅంతస్తులో క్యాన్సర్‌కు సంబంధించిన వైద్యసదుపాయాలు ఉంటాయి. తరువాతఅంతస్తులలో ఆపరేషన్ ధియేటర్ల కాంప్లెక్సు, సెమినార్ హాళ్లు, లెర్చర్హాళ్లు,రోగుల ప్రత్యేక గదులు, ఆరోగ్యశ్రీవార్డులుతోపాటు పలు రకాల వసతి సదుపాయాలు వచ్చే విధంగా ప్రణాళాకలను రూపొందించారు. దిగువ అంతస్తులో వాహనాల పార్కింగ్‌కు సదుపాయాన్ని కూడా కల్పించాలని నిర్ణయించారు. -
స్వైన్ ఫ్లూ 'ఫ్రీ సిటీగా విశాఖ': మంత్రి గంటా
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాను స్వైన్ ఫ్లూ ఫ్రీ సిటీగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యనించారు. ఆయన ఇక్కడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్టైడ్స్, కరపత్రాలు ఇతర సాధనాల ద్వారా స్వైన్ ఫ్లూపై విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) లో త్వరలోనే వైరాలజీ విభాగాన్ని అప్‌గ్రేడ్ చేసి తగిన సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, స్వైన్ ఫ్లూ మందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖ ఉత్సవ్‌లో స్వైన్ ఫ్లూ అవగాహన కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. -
ప్రభుత్వం వైద్యంపై నమ్మకం పెంచండి:మంత్రి కామినేని
విశాఖ:నగరంలోని కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్పిటల్)పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ వైద్యం బాగుందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎక్కడా లేదని దుయ్యబట్టారు. అవినీతిలో కేజీహెచ్ నంబర్ వన్ లో ఉందని ఆయన విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కామినేని.. ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యం సరిగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైద్యం బాగుందని చెప్పుకునే పరిస్థితి కల్పించి.. సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలని విజ్ఞప్తి చేశారు. మరో మూడు నెలల్లో విమ్స్ తొలివిడత పూర్తవుతుందని కామినేని తెలిపారు. ఇదిలా ఉండగా ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీం కోర్టు తీర్పును మంత్రి స్వాగతించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించి భవిష్యత్తుకు ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. కౌన్సిలింగ్ పూర్తి చేయడానికి సహకరించాలని విన్నవించారు. -
దీనికి మందు లేదా..
- అక్రమాలకు నిలువెత్తు అడ్డాగా కేజీహెచ్ - రోగుల పేరుతో నిధుల దోపిడి - వైద్య పరికరాలు, మందులు దారిమళ్లింపు - రోగులకు ఆహారంలోనూ అవినీతి - రూ.3కోట్లకుపైగా దుర్వినియోగమని ఏసీబీ అంచనా! సాక్షి,విశాఖపట్నం : కేజీహెచ్‌లో ఇప్పటికే అనేకసార్లు ఏసీబీ దాడులు నిర్వహించింది. మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరిగెత్తుతున్నాయి. . ముఖ్యంగా ఖరీదైన వైద్య పరికరాల కొనుగోలులో అక్రమాలున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రికార్డుల్లో మాత్రం సవ్యంగానే ఉన్నా పరికరాలు కనిపించడం లేదు. కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు తమ క్లినిక్కులకుతరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి విధులపై వచ్చి కొందరు పరికరాలు కూడా తీసుకుపోతున్నట్లు ఏసీబీ పసిగట్టింది. 1045 పడకల ఆస్పత్రిలో సుమారుగా వెయ్యి మంది రోగులు ఇన్పెషెంట్లుగా ఉంటున్నారు. వీరికిచ్చే ఆహారం పేరుతోనూ భారీగా నిధులు బొక్కేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులోనే రూ.12 లక్షల వరకు దారిమళ్లినట్లు సమాచారం. గైనిక్ వార్డులో మరీనూ. ఎవరికైనా మగబిడ్డ పుడితే రూ.1500, ఆడపిల్లకైతే రూ. 1000 ఇవ్వాల్సిందే. రోగులను క్యాజు వాల్టీ నుంచి వార్డుకు తరలించడానికి రూ. 500 సమ ర్పిం చుకోవాల్సిందే. లేదం టే బెడ్ దక్కదు. కీలకమైన మెడికల్ సర్టిఫికేట్ల జారీకి కొందరు మినిస్టీరిచల్ సిబ్బంది రూ. 5000కు పైగా పుచ్చుకుంటున్నారు. ఎక్స్‌రే, రేడియాలజీ విభాగాల్లో వైద్య పరీక్షలకు నేరుగా కాసులు ఇచ్చుకోవాల్సిందే. పెద్దాసుపత్రిమందుల కొరత లేకుండా వైద్యశాఖ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే ఇక్కడ కొందరు సిబ్బందికి వరంగా మారుతోంది. స్టోర్‌రూంలో ఉండాల్సిన ఈ మందులు కొందరు పెద్దల ప్రమేయంతో నేరుగా వారిసొంత క్లినిక్కులకు దారిమళ్లిపోతోంది. రికార్డుల్లో మాత్రం రోగులకు వినియోగించినట్లుగా నమోదుచేస్తున్నారు. కాటన్ కొనుగోలుకు లక్షల్లో వినియోగిస్తుంటే చాలామంది రోగులకు అసలు దీన్ని చేతికి ఇవ్వడం గగనమవుతోంది. ఆపరేషన్ థియేటర్లు, ముఖ్యు ల ఛాంబర్లకు ఏసీలు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాని వీటి జాడే ఉండడంలేదు. ఇదే విషయాన్ని ఏసీబీ గుర్తించి రికార్డులు తనిఖీ చేస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క ఆస్పత్రిలో 60మంది ప్రైవేటు భద్రత సిబ్బంది పనిచేస్తున్నారు. కాని 100నుంచి 150మంది పనిచేస్తున్నట్లు రికార్డు ల్లో చూపి కొందరు ఈ నిధులను భారీగా బొక్కేస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో అవినీతికి అడ్డేలేకుండా పోయిందని ఏసీబీ ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి కనీసం లెక్కలు లేకపోవడం అవినీతికి మచ్చుతునకగా కనిపిస్తోంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారుగా 40 మంది ఏసీబీ సిబ్బంది బుధవారం కూడా తనిఖీలు కొనసాగించనున్నారు. రూ. 3కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు అనధికారికంగా తెలిసింది. -
అవినీతిలో వాటాలపేచీలు : కెజిహెచ్లో వెలుగు చూసిన నిజాలు!
విశాఖపట్నం: ఎంతో పేరున్న కెజిహెచ్లో అవినీతి వెలుగు చూసింది. దోచిన సొమ్ము పంచుకోవడంలో పేచీలు వచ్చాయి. దాంతో కొందరు ఉద్యోగులే అసలు విషయలు వెళ్లగక్కారు. కేజీహెచ్‌పై ఏసీబీ అధికారులు ఈ రోజు దాడి చేశారు. డీఎస్పీ నరసింహారావు పర్యవేక్షణలో ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. 6 బృందాలుగా రికార్డులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ పథకంలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బయోమెట్రిక్ మిషన్లు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడలేదని ఏసిబి తనిఖీలలో తేలింది. డాక్టర్లు, నర్సులు కలిపి తమ వాటాను కూడా స్వాహా చేస్తున్నారని నాలుగోతరగతి ఉద్యోగులు ఏసిబి అధికారుల ఎదుట ఆరోపించారు. ఇంధన నిర్వహణలో టోకెన్ల అక్రమాలు కూడా ఈ సోదాలలో వెలుగు చూశాయి. -
కేజీహెచ్‌లో ఏసీబీ అధికారుల దాడులు
-
విశాఖ కేజీహెచ్‌లో ఏసీబీ సోదాలు
విశాఖ : ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో పలు ఆస్పత్రుల్లో ఆకస్మిత తనిఖీలు చేసింది. విశాఖ కేజీహెచ్‌లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నరసింహరావు పర్యవేక్షణలో ఆరు బృందాలు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాయి. రికార్డుల పరిశీలనలో ఆరోగ్యశ్రీ పథకం అమలులో పలు అక్రమాలు బయటపడ్డాయి. అలాగే బయోమెట్రిక్ మిషన్లు కూడా కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉపయోగించలేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. కాగా డాక్టర్లు, నర్సులు కలిసి తమ వాటాను కూడా స్వాహా చేస్తున్నారని ఏసీబీ ఎదుట నాలుగో తరగతి ఉద్యోగులు ఆరోపించారు. అలాగే ఇంధన నిర్వహణలోనూ టోకెన్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తిరుపతి స్విమ్స్, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
పేదలకు మెరుగైన వైద్యం
విశాఖపట్నం : బడుగు, బలహీన వర్గాల ప్రజ లకు మెరుగైన వైద్యం అందించేలా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అందుకనుగుణంగా కేజీహెచ్‌లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర కేబినెట్ తొలి సమావేశంలో పాల్గొనేం దుకు నగరానికి వచ్చిన ఆయనను బీజేపీ నేత లు దసపల్లా హిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ బుధవారం కేజీహెచ్, ఘోషా ఆస్పత్రులను స్వయంగా పరి శీలించానన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోని విమ్స్ ఆస్పత్రిని ఆరు నెలలోపు ప్రారంభిస్తామని లేదంటే ఎయిమ్స్ సహకారంతో నడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో సూపర్ హాస్పిటల్ ఏర్పాటు విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కన్నా పేదలకు వైద్యం అందించడమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.వి. చలపతి రావు, నగర అధ్యక్షుడు పి.వి. నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, నాయకులు చెరువు రామకోటయ్య, నరేంద్ర, విమ్స్ ఆస్పత్రి వైద్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
'పిల్లల్లేరన్న బాధలోనే ఆ చిన్నారిని అపహరించా'
-
కేజిహెచ్లో అదృశ్యమైన బాబు ఆచూకి లభ్యం
-
తల్లి చెంతకు చేరిన శిశువు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ కేజీహెచ్ నుంచి అపహరణకు గురైన శిశువు తల్లి చెంతకు చేరింది. వారం రోజులు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు శిశు అపహరణ కేసు ఛేదించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. కేజీహెచ్ ప్రసూతి వార్డు నుంచి ఈనెల 21 వేకువజామున శిశువు అపహరణకు గురైన విషయం తెలిసిందే. జాలారిపేటకు చెందిన వాసుపల్లి గుణ 21 అర్ధరాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఒంటిగంట సమయంలో బిడ్డకు పాలిచ్చి గంట నిద్రపోయింది. ఆ సమయంలో కేజీహెచ్‌లో పనిచేస్తున్న నాలుగో తరగతి సిబ్బంది ఇద్దరు, మార్చురి వద్ద అనధికార విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు కలిసి ఆ బిడ్డను అపహరించారు. వార్డు గోడ మీదుగా బిడ్డను మాయం చేసి మల్కాపురం ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన ఓ పిల్లలు లేని మహిళకు రూ.30 వేలకు విక్రయించారు. కొద్దిసేపటికి పక్కలో బిడ్డ లేకపోవడం గమనించిన గుణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి వారు బిడ్డను అమ్మేసినట్లు తెలుసుకున్నారు. మల్కాపురం వెళ్లి ఆ శిశువును తీసుకొచ్చి ఆస్పత్రిలో తల్లికి అప్పగించారు. నిందితులతోపాటు బిడ్డను కొనుగోలు చేసిన మహిళను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సహకరించనందున కేసు ఛేదించేందుకు వారం రోజులు పట్టిందని వన్‌టౌన్ సీఐ చెప్పారు. -
రెండురోజుల పసికందు అపహరణ
-
రెండురోజుల పసికందు అపహరణ
విశాఖ : విశాఖ కేజీహెచ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కేజీహెచ్‌లో రెండు రోజుల పసికందు అదృశ్యమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఓ మగ శిశువు అపహరణకు గురైంది. దాంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బంధువులపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కేజీహెచ్‌లో సీసీ కెమెరాలు కూడా పనిచేయక పోవడంతో శిశువును ఎవరు అపహరించారనే పోలీసులు విచారణ ప్రారంభించారు. -
సాక్షి టీవీ విలేకరి రమణకు గాయాలు
విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం సాక్షి టీవీ విలేకరి రమణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రోడ్డు పక్కన నిలబడిన ఆయనను ఓ బైకిస్టు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన రమణను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైద్యుల నిర్లక్షానికి నిండు ప్రాణం బలి
-
కేజీహెచ్‌లో మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య నిరసన