అవినీతిలో వాటాలపేచీలు : కెజిహెచ్లో వెలుగు చూసిన నిజాలు! | Corruption in KGH | Sakshi
Sakshi News home page

అవినీతిలో వాటాలపేచీలు : కెజిహెచ్లో వెలుగు చూసిన నిజాలు!

Published Tue, Jul 1 2014 7:27 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిలో వాటాలపేచీలు : కెజిహెచ్లో వెలుగు చూసిన నిజాలు! - Sakshi

అవినీతిలో వాటాలపేచీలు : కెజిహెచ్లో వెలుగు చూసిన నిజాలు!

విశాఖపట్నం: ఎంతో పేరున్న కెజిహెచ్లో  అవినీతి వెలుగు చూసింది. దోచిన  సొమ్ము పంచుకోవడంలో పేచీలు వచ్చాయి. దాంతో కొందరు ఉద్యోగులే అసలు విషయలు వెళ్లగక్కారు. కేజీహెచ్‌పై ఏసీబీ అధికారులు ఈ రోజు  దాడి చేశారు.  డీఎస్పీ నరసింహారావు పర్యవేక్షణలో  ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. 6 బృందాలుగా రికార్డులను పరిశీలించారు.

 ఆరోగ్యశ్రీ పథకంలో  పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.  బయోమెట్రిక్ మిషన్లు కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడలేదని ఏసిబి తనిఖీలలో  తేలింది. డాక్టర్లు, నర్సులు కలిపి తమ వాటాను కూడా స్వాహా చేస్తున్నారని  నాలుగోతరగతి ఉద్యోగులు ఏసిబి అధికారుల ఎదుట ఆరోపించారు. ఇంధన నిర్వహణలో టోకెన్ల అక్రమాలు కూడా ఈ సోదాలలో వెలుగు చూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement