దాబాగార్డెన్స్: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసిపాప బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గురువారం వెలుగు చూసింది. విజయనగరానికి చెందిన దంపతులకు గత నెల 4 న ఆడబిడ్డ పుట్టింది. అనంతరం పాపకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో కేజీహెచ్‌లోని పిల్లల వార్డుకు తరలించారు. అప్పటినుంచి అక్కడే ఉండి చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం కన్నుమూసింది. కాగా.. రక్తం ఎక్కించడానికి సిద్ధం చేసిన నర్సులు ఆ తర్వాత రక్తం ఎక్కుతుందా లేదా అనే విషయాన్ని గమనించ లేదని, అందువల్లే పాప మతిచెందినట్లు తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు.