అరకు ఘాట్‌రోడ్డులో చెట్టును ఢీకొట్టిన కారు.. | Five injured in road accident | Sakshi
Sakshi News home page

అరకు ఘాట్‌రోడ్డులో చెట్టును ఢీకొట్టిన కారు..

Published Mon, Sep 19 2016 8:41 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

Five injured in road accident

- ఐదుగురికి గాయాలు
అరకులోయ(విశాఖ)

 వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని రవిచంద్రనగర్‌కు చెందిన ఓ కుటుంబ సభ్యులు అరకు లోయ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషోర్(14)ను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement