అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రధాన రహదారిలో పెరుగు జంక్షన్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఉన్న తోపుడు బండిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. మృతులను అనకాపల్లి ములపాడుకు చెందిన శివతేజ(17), సాయి(18)గా పోలీసులు గుర్తించారు.