విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నర్సింహనగర్ నుంచి హైవేకు వెళుతున్న ఆదిత్య టూర్స్ ట్రావెల్స్ మినీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. అదే క్రమంలో నడచి వెళుతున్న వారిపైకి కూడా దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. రవాణాశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.