
మంత్రి గంటాకు బీజేపీ ఎమ్మెల్యే షాక్
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు షాక్ ఇచ్చారు. విశాఖలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో గంటాను విష్ణుకుమార్ రాజు నిలదీశారు. 'కేజీహెచ్కు తగినంత నర్సింగ్ సిబ్బందిని ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అన్ని వసతులు ఉన్న కేజీహెచ్లో దంత వైద్య కళాశాల ఎందుకు పెట్టరు?. ఈ విషయంలో పదే పదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా స్పందించడం లేదు. అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు డిమాండ్ చేసినా ప్రయోజనం లేదు' అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.
దీంతో కంగుతిన్న మంత్రి గంటా... విష్ణుకుమార్ రాజుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ బీజేపీ వద్దే ఉంది కదా అని గుర్తు చేశారు. దీనిపై వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.