Minister Ganta
-
విశాఖలో భారీగా గంజాయి ధ్వంసం
-
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం..
-
ఇంటర్‌లోనూ గ్రేడింగ్
సాక్షి, అమరావతి: పదో తరగతి మాదిరిగానే ఇంటర్‌లోనూ ర్యాంకుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిం చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యం లో సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా, డీజీపీ సాంబశివరావు తది తరులు.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ వివరాలను మంత్రి గంటా మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ర్యాంకుల విధానాన్ని ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ విషయాన్ని ఎంసెట్ నిర్వాహకులు చూసుకుంటారని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను రోజుకు పద్దెనిమిది న్నర గంటల పాటు చదివిస్తున్నారని, దీంతో ఒత్తిడికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చింద న్నారు. కాలేజీల యాజమాన్యాలు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే కఠిన చర్య లు తప్పవన్నారు. ఇకపై విద్యార్థులకు విధిగా ఆదివారం సెలవు ఇవ్వాల్సిందే నని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల బలవన్మర ణాలపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్టు గంటా తెలిపారు. ఈ కమిటీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇస్తుందని, దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు కాలేజీల హాస్టళ్లు 150కి పైగా ఉన్నాయని.. మూడు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోకపోతే వాటిని రద్దు చేస్తామన్నారు. ప్రతి కార్పొరేట్ కాలేజీ కూడా ఒక మానసిక వైద్యుడిని నియమించుకొని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని 2012 నుంచి ఇప్పటి వరకూ 35 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. వీరిలో శ్రీ చైతన్య కాలేజీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని గంటా వెల్లడించారు. -
వర్సిటీ స్థల ఆక్రమణపై నివేదిక ఇవ్వండి
విశాఖపట్నం: యోగి వేమన విశ్వవిద్యాలయం(వైవీయూ) పరిధిలోని భూముల కబ్జా ఆరోపణలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. వైవీయూ వీసీతో ఆయన మాట్లాడగా ప్రహరీ లేకపోవడంతో భూ ఆక్రమణ ప్రయత్నం జరిగిందని వీసీ తెలిపారు. వీసీల సమావేశంలో ప్రహరీ ఏర్పాటు చేసుకోవాలని యూనివర్సిటీలకు మంత్రి సూచిస్తునే ఉన్నారు. ఇప్పటికైనా అన్ని యూనివర్సిటీలు వెంటనే ప్రహరీలు నిర్మించుకోవాలని మంత్రి సూచిస్తున్నారు. ఈ భూ కబ్జా ఆరోపణలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, భూమి కబ్జాకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వీసీని మంత్రి ఆదేశించారు. -
మూడేళ్లుగా కబ్జాలు
విశాఖ భూబాగోతాలపై ‘సిట్’కు అయ్యన్న చిట్టా! - 1700 ఎకరాల భూముల కబ్జాలపై ఫిర్యాదు - మరిన్ని ఆధారాలతో 19న మళ్లీ ఫిర్యాదు చేస్తానని వెల్లడి - పరోక్షంగా గంటా, ఆయన అనుచరులపై ఆరోపణలు సాక్షి, విశాఖపట్నం: ‘2014 నుంచే విశాఖలో భూకబ్జాలు, దందాలు మొదలయ్యాయి. అవి ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి.. నెల్లూ రు, ప్రకాశం జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాదు.. పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని రికార్డుల ట్యాంపరింగ్ చేసి వారి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ భూ దందాలపై నేనేమీ నిన్నా మొన్నా ఆరోపించలేదు. 2014లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా.. త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించమని సీఎం చంద్రబాబుకు, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులకు లేఖలు రాశాను’ అని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ప్రైవేటు భూములను లిటిగేషన్లో పడేటట్టు చేయడం.. కొట్టేయడం లేదా తక్కువ ధరకు కాజేయడం.. ఆ తర్వాత ప్రభుత్వం వద్ద తమకున్న పలుకుబడిని ఉపయోగించి తమ పరం చేసుకుంటున్నారని పరోక్షంగా మంత్రి గంటా ఆయన అనుచరులపై ధ్వజమెత్తారు. విశాఖ సిటీ, జిల్లాలో జరిగిన భూ కబ్జాలు, దందాలపై తన వద్దనున్న ఆధారాలను ‘సిట్’ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రికార్డుల ట్యాంపరింగ్‌పై ఆధారాలుంటే ఫిర్యాదు చేయాలని సీపీ నుంచి నిన్ననే తనకు లేఖ అందిందని, ఆమేరకు తన వద్దనున్న ఆధారాలు.. గడిచిన రెండేళ్లుగా ప్రముఖ దినపత్రికల్లో భూ కబ్జాలు, దందాలపై వచ్చిన కథనాల క్లిప్పిం గ్స్‌తో సహా ఫిర్యాదు చేశానన్నారు. సుమారు 1700 ఎకరాలకు సంబంధించిన అవకతవకలు.. కబ్జాలపై పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు. మెడ్‌టెక్ పరిహారం .. ఓ కుంభకోణం పెదగంట్యాడ మండలంలో ఏర్పాటు చేస్తున్న మెడ్‌టెక్ పార్కుకు భూసేకరణ కోసం జరిపిన పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని..రూ.2 కోట్లకు పైగా బినామీల మాటున కాజేశారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. జిరాయితీ, డి పట్టా రైతులతోపాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వారికి పరిహారం ఇస్తే తప్పు లేదన్నారు. కానీ, ప్రభుత్వ భూముల్లో సాగుబడి లేకపోయినా కొంతమంది పేర్లు సృష్టించి మరీ ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని.. అంటే ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మేశారని ఆరోపించారు. రూ.2 కోట్లకు పైగా బినామీల పేరిట స్వాహా చేసిన విషయాన్ని ‘సిట్’ దృష్టికి తీసుకెళ్లానన్నారు. తనఖా పెట్టిన ప్రభుత్వ భూముల చిట్టా 19న ఇస్తా.. రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఓ బ్యాంకులో రూ.190 కోట్ల రుణం తీసుకుని ఎగనామం పెట్టిన వారి పేర్లు త్వరలోనే చెబుతానని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులు, సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు వాళ్లు ప్రకటన కూడా చేశారన్నారు. ఇవేకాకుండా.. మరికొన్ని కబ్జాలు..దందాలపై ఆధారాలతో ఈనెల 19న ‘సిట్’ను మరోసారి కలసి ఫిర్యాదు చేస్తానన్నారు. ‘సిట్’ చీఫ్‌పై తనకు విశ్వాసం ఉందని, విశాఖలో జరిగిన భూ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. -
‘గంటా’రావం
‘‘దేశంలో ప్రతి పౌరుడు వీఐపీనే’’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం వీవీఐపీలు, వీఐపీల కార్లకు బుగ్గలైట్లు, ప్రత్యేక సైర¯Œ్స నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ కార్లకు అమర్చుకున్న బుగ్గలను ఎవరికి వారే స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. అయితే ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని తొలగించకుండా హల్చల్ చేస్తున్నారు. సోమవారం కాకినాడ జేఎన్టీయూకేకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారుకు నీలిరంగు బుగ్గ, సైర¯ŒS దర్శనమిచ్చాయి. కారు సైరన్, హడావుడి చూసిన జనం.. ఇంకెంతకాలంలే ఈ ఆర్భాటం అని గుసగుసలాడుకున్నారు. ఫొటో : సతీష్‌కుమార్ పేపకాయల, సాక్షి, కాకినాడ -
సీబీఐ విచారణకు సిద్ధమా.?
-
సీబీఐ విచారణకు సిద్ధమా?
ప్రశ్నపత్రాల లీకేజీలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ - సీబీఐ అయితేనే మంత్రి నారాయణ పాత్ర బట్టబయలవుతుంది సాక్షి, అమరావతి: ‘పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణకు సిద్ధమా? సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సాక్షి ఆధారాలను సీబీఐకి ఇచ్చి.. విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. తప్పులను కట్టడి చేయాలనే తపన ఉండాల్సిన ముఖ్యమంత్రి.. వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి మంత్రులను రక్షించడానికి యత్నిస్తున్నారు. దమ్మూ ధైర్యం ఉంటే మా సవాల్‌ను స్వీకరించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. శాసనసభలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. నాలుగు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజులు అడుగడుగునా అడ్డుతగిలేందుకు వారికీ అవకాశమిచ్చారు.. వారు వ్యక్తిగత దూషణలకు దిగుతూ కవ్వించినా జగన్ సంయమనం కోల్పోలేదు. లీకేజీ వ్యవహారంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. సీఎం వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలను విసురుతూ.. ప్రభుత్వ తీరును కడిగిపారేశారు.వివిధ అంశాలను ఎత్తిచూపుతూ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను.. సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన జగన్ ‘‘చంద్రబాబు తరచూ నా చదువులు గురించి మాట్లాడుతారు.. నీ మాదిరిగా నేను వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడలేను.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను.. పదో తరగతిలో.. ఇంటర్మీడియట్లో.. డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను. నీ మాదిరిగా ఎంఫిల్ చేయకుండానే చేసినట్లు చెప్పుకోను. నీ మాదిరిగా పీహెచ్డీ డీస్‌కంటిన్యూ చేయలేదు.. ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంగ్లీషు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే మాట్లాడగలరని పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.. నీ ఇంగ్లీషు ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసుకో.. ప్రజలను నమ్మించలేకపోతే గందరగోళానికి గురిచేయడమే చంద్రబాబు వ్యక్తిత్వం.’’ అని ఘాటుగా స్పందించారు. -
నేటి నుంచి తిరుపతిలో సీఏల సదస్సు
- హాజరు కానున్న 2,500 మంది ప్రతినిధులు - రూ.50 లక్షలతో వేదిక నిర్మాణం ప్రారంభించనున్న మంత్రి గంటా యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం నుంచి రెండ్రోజులపాటు సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) 48వ ప్రాంతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని ఇన్స్టిట్యూట్ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు 2,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. ఐసీఐఏ అధ్యక్షులు ఎం.దేవరాజరెడ్డి, కార్యదర్శి జామన్ కె.జార్జ్ హాజరవుతారు. బుధవారం నిర్వహించే ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్.రమేష్‌కుమార్ హాజరవుతారు. సదస్సుకు 2,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరవుతున్నందున ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ సంస్థలు 30 బిజినెస్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారుు. ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ ఫల్గుణ కుమార్, తిరుపతి చాప్టర్ చైర్మన్ రఘురామిరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ సదస్సులో సీఏల వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన సీఏలు హాజరవుతారన్నారు. ఇటీవల చేపట్టిన పెద్దనోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలపై చర్చించనున్నారన్నారు. 2017 మే నుంచి అమలులోకి రానున్న రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016పై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. -
ఎందు‘గంటా’లేటంట?
మూడు నెలలైనా పిల్లలకందని యూనిఫాం కాంట్రాక్టుకోసం ఓ అమాత్యుని తాపత్రయం రూ. 6.50కోట్ల బడ్జెట్‌ను వదులుకోలేకే ఈ యత్నం క్లాత్ సరఫరాతోబాటే... కుట్టించే బాధ్య కూడా ఆప్కోకే... వారినుంచి అనధికారికంగా దక్కించుకోవాలని మంత్రి ఎత్తుగడ జిల్లాలో యూనిఫాం క్లాత్ కోసం చేసే ఖర్చు : రూ. 5.17కోట్లు కుట్టు కూలి : రూ. కోటి 30లక్షలు విద్యార్థుల సంఖ్య : లక్షా 63వేల 680 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఒక జత యూనిఫాం కుట్టుకూలి రూ. 40లు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే రెండు జతలకూ చేసే ఖర్చు రూ. 80లు. అదే జిల్లాలోని లక్షా 63వేల 680మంది పిల్లలకు ఇచ్చే బట్టల కుట్టుకూలి కోటీ 30 లక్షల 94వేలు. క్లాత్కోసం చేస్తున్న ఖర్చు రూ. 5.17కోట్లు... మొత్తం సుమారు ఆరున్నర కోట్లు. ఇంత పెద్ద మొత్తం చూసిన పచ్చనేతలకు కళ్లు బైర్లు కమ్మాయేమో... ఆ కాంట్రాక్టేదో.. తామే దక్కించుకుంటే బాగుంటుందనుకున్నారు. అంతే అవకాశం ఉన్న అమాత్యుడు రంగంలోకి దిగారు. క్లాత్ సరఫరా చేసే బాధ్యతతోపాటు... కుట్టించే బాధ్యత కూడా వారికే అప్పగించేస్తే... వారినుంచి అనధికారికంగా తానే ఆ కాంట్రాట్టు పొందాలని ఎత్తు వేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే బడులు తెరచి మూడు నెలలైనా... పిల్లలకు యూనిఫాం అందలేదు. ఇవేమీ తెలియని ఆ చిన్నారులు దుస్తులకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బడి పిల్లలకు యూనిఫాంకోసం ఏటా మే నెలలో ఇండెంట్ తీసుకుని, జూన్ నెలలో పంపిణీ చేయాలి. నిబంధనల మేరకైతే ఆప్కో ద్వారా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు క్లాత్ సరఫరా చేస్తే స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా వాటిని కుట్టించాలి. క్లాత్ సరఫరా బాధ్యత అప్కోకు అప్పగిస్తే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించినట్టు అవుతుందనీ, స్థానికంగా కుట్టుపనిచేసేవారికి పని దొరుకుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా కోట్లలో జరిగే ఈ వ్యవహారంపై పచ్చనేతల కళ్లు పడ్డాయి. అంతే... చేనేత కార్మికుల నుంచి నేరుగా ముంబాయి, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో మిల్లుల్లో తయారైన క్లాత్‌నే తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ కీలక నేతలకు, ఆప్కో ఉన్నత స్థాయి వర్గాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా పావులు కదిపినట్టు తెలుస్తోంది. ఈ తరహా లోపాయికారీ తంతు కారణంగానే జిల్లాలకు ఇంతవరకు క్లాత్ చేరలేదని సమాచారం. ఒక్క విజయనగరం జిల్లాలోనే రూ. 5.17కోట్ల మేర క్లాత్ కోసం ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇంకెంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంట్లో కొంత నొక్కేయడానికి నేతలు పన్నాగం పన్నుతున్నారు. కుట్టు కూలిపైనా.. కన్ను! కుట్టు కోసం మంత్రుల స్థాయిలో కక్కుర్తి పడుతున్నారు. నిబంధనల మేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు క్లాత్ సరఫరా చేస్తే స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా విద్యార్థుల నుంచి నేరుగా కొలతలు తీసుకుని కుట్టించి ఇవ్వాలి. అయితే, ఒక మంత్రి దీనికి ససేమిరా అంటున్నారు. కుట్టు కాంట్రాక్ట్‌ను ఎవరికో ఎందుకు... అదేదో మనవద్దే ఉంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే తెగ తాపత్రయం పడుతున్నారు. నేరుగా కుట్టు కాంట్రాక్ట్‌ను తీసుకుంటే విమర్శల పాలవుతామనే ఉద్దేశంతో ఆప్కోను తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. క్లాత్ సరఫరా బాధ్యతలను ఎలాగైతే ఇచ్చారో, కుట్టు కాంట్రాక్ట్‌ను కూడా ఆప్కోకు ఇచ్చేయాలని నిర్ణయినట్టు కూడా తెలిసింది. వాస్తవానికైతే యూనిఫాం కుట్టే యూనిట్లు ఆప్కో వద్ద లేదు. సొంతంగా కుట్టించి ఇచ్చే సౌకర్యం లేదు. కానీ, గుడ్డిగా ఆప్కోకు ఇచ్చేయాలని చూస్తున్నారు. అధికారికంగా ఆప్కోకు ఇచ్చేసి, అనధికారికంగా ఆప్కో నుంచి కుట్టు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకే మంత్రి ఎత్తుగడలా కనిపిస్తోంది. ఒక్కో జతకు రూ. 40చొప్పున, ఒక్కో విద్యార్థికి రెండేసి జతలకు రూ. 80లు కుట్టు కింద ఖర్చు పెట్టనున్నారు. ఈ లెక్కన విజయనగరం జిల్లాలో రూ. కోటి 30లక్షల కుట్టు పనిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇంకెంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఇంతవరకు క్లాత్ రాలేదు– వేణుగోపాలరాజు, ఆప్కో మేనేజర్, విజయనగరం క్లాత్ సరఫరా చేసే బాధ్యతను ఆప్కోకే అప్పగించారు. కుట్టు బాధ్యతలు ఆప్కోకే అప్పగించినట్టు తెలిసింది. కానీ, అధికారిక ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతానికైతే జిల్లాకు క్లాత్ చేరలేదు. మాకొచ్చినట్టయితే వేరొకరికి ఇచ్చి యూనిఫారాలు కుట్టిస్తాం. -
రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం
మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్రహీంపట్నం: రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్య, విజ్ఞాన సమాజం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నత, ప్రాథమిక, సాంకేతిక శాఖలను మానవ వనరుల శాఖలో విలీనం చేశామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమిత దావ్రా మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో ఉత్తీర్ణతా శాతం 45 నుంచి 66 శాతానికి పెరగడం శుభసూచికమన్నారు. సాంకేతిక, కళాశాలల విద్యా కమిషనర్ బి.ఉదయలక్ష్మీ మాట్లాడుతూ అంబేడ్కర్ ఒవర్సిస్ విద్యానిధి పథకం కింద రెండేళ్లల్లో రూ.8.65 కోట్లు ఖర్చుపెట్టి 117 మంది పేద విద్యార్థులు చదువుకునేలా చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, ఉన్నత విద్యామండలి అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణా యూనివర్సిటీ ఉప కులపతి రామకృష్ణారావు, ఎన్టీరంగా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ రాజేంద్రకుమార్, విద్యాశాఖ కమిషనర్ ఎ.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
010 పద్దు ద్వారా వేతనాలకు కృషిచేస్తా
విజయవాడ (గాంధీనగర్) : గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించడానికి కృషిచేస్తానని మానవవనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం రామా ఫంక్షన్‌హాలులో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాలను ఆధునీకరించి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం వేగం పుంజుకోవడం వలన గ్రంథాలయాలకు ఆదరణ తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వాడుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. గ్రంథాలయ సంస్థలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత వారికి మేలు జరిగేలా చూస్తామన్నారు. గ్రంథాలయ ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన దేవదాసు, ఉపాధ్యక్షులు కె శివశంకరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి వెంకటరమణ, విజయకుమార్ పాల్గొన్నారు. -
తెలుగు భాషను కాపాడు కుందాం
సాక్షి,అమరావతి : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అగ్రతాంబూలం ఇచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ లోని కీ.శే.మండలి వెంకటకృష్ణారావు 90 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు అచ్చయ్య కుమార్ రావు కు సంస్కృతి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. మండలి కృష్ణారావు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప ఆదర్శవంతుడన్నారు. కాగా, ఆంగ్ల విద్య మోజులో పడి మాతృభాషను పట్టించుకోవటం లేదన్నారు. దీంతో ప్రా«థమిక విద్యలోనే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అందరూ సహకరిస్తే విశాఖపట్నంలో తెలుగు మహసభల్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రవాసుల స్ఫూర్తితో తెలుగుకు సేవ: బుద్ధప్రసాద్ తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగుభాషాను మరిచిపోతున్నా మనీ ,విదేశాలలో ఉన్న తెలుగు వారిని స్ఫూర్తిగా తీసుకోని బాషాను పరిరక్షించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తన తండ్రి కీ.శే.మండలి వెంకటకృష్ణారావు తెలుగు బాషాపరిరక్షణ కోసం చేసిన సేవలు మరుపురానివన్నారు. ప్రతియేటా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో సంస్కృతి పురస్కారాలను భాషా పరిరక్షకులకు అందజేస్తామన్నారు. ఈ çసభలో ఫ్రాన్స్ దేశస్ధుడు డానియల్ నాజర్స్ వచ్చిరానీ తెలుగు భాషలో ఆయన చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డేవిడ్ రాజు,మాజీ ఎమ్మెల్సీ వెంకయ్య,అమెరికా తెలుగు సంఘనేత ఆళ్ల శ్రీనివాసరెడ్డి,లండన్ యుకె తెలుగు సంఘం నాయకులు సత్యప్రకాశ్, మలేషియా తెలుగు ప్రతినిధులు ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ డైరక్టర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మూడు వర్గాలు...ఆరు గ్రూపులు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మూడు గ్రూపులు...ఆరు వర్గాలు రాజ్యమేలుతున్నాయి. పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో విఫలం కాగా, ప్రాభావం కోసం పాకులాట అధికమైంది. క్రమంతప్పకుండా ఏదో నియోజకవర్గం నుంచి అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. ఫిరాయింపు నేతలు సృష్టించే సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే అధినేతకు తెలుగుతమ్ముళ్లు శిరోభారంగా మారారు. ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం రానున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసేందుకు సన్నద్ధమయ్యారు. టీడీపీలో అప్పటికప్పుడు పసువు కండువా కప్పుకున్న వారికే అధిక ప్రాధాన్యత దక్కుతోందనే వాదన బలపడుతోంది. ఈక్రమంలో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. సమన్యాయం సాధించడంలో అధ్యక్షుడుగా శ్రీనివాసులరెడ్డి విఫలమయ్యారనే వాదనను ఓవర్గం తెరపైకి తెస్తోంది. ఈక్రమంలోనే మంత్రి గంటాకు ఫిర్యాదుల మోత తప్పదనే చెప్పవచ్చు. తీవ్రరూపం దాల్చిన వర్గపోరు టీడీపీ జిల్లా అధ్యక్షుడికి ఓవైపు అనుభవలేమి, మరోవైపు వర్గపోరు పట్టిపీడిస్తున్నాయని ఓ వర్గం తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. సొంత నియోజకవర్గం రాయచోటి నుంచి సైతం కార్యకర్తలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగుల్లో ప్రస్తుతం పతాకస్థాయిలో అంతర్గతపోరు నడుస్తోంది. బద్వేలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన విజయజ్యోతి ఏకంగా ప్రొద్దుటూరులో నిలదీశారు. అదేబాటలో కడప అభ్యర్థి దుర్గాప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. కరివేపాకులా వాడుకోవడం మినహా గుర్తింపు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారనే ఆవేదన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ట్రబుల్షూటర్గా పనిచేయాల్సిన వ్యక్తి ‘ట్రబుల్ మ్యాంగర్’గా తయారైయ్యారని మరోవర్గం ఇప్పటికే పలు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. జంప్జిలానీలకే ప్రాధాన్యం పార్టీని అంటిపెట్టుకొని పనిచేసిన వారికంటే ఫిరాయింపుదారులకు అధికప్రాధాన్యత దక్కుతుండని తమ్ముళ్లు బహిరంగంగానే ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతల చర్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వారి ఆరోపన. కడపలో గుర్తింపు కోసం ఫిరాయింపులకు పాల్పడిన వారికే ఎస్డీఎఫ్ గ్రాంటు ఏకపక్షంగా కేటాయించారనే ఆరోపణలు ఓవర్గం నుంచి విన్పిస్తున్నాయి. పాతకడప, ఆలంఖాన్‌పల్లె, కోఆపరేటివ్ కాలనీ, చిన్నచౌక్ పరిధిల్లో ఉన్న ఆయా నాయకులు సూచనలకు అనుగుణంగానే మొత్తం వ్యవహారం నడుస్తోందని వారు వాపోతున్నారు. ఒక సామాజికవర్గానికే అవకాశం కల్పించారని ఫిర్యాదుల పరంపర తెరపైకి వచ్చాయి. ఈక్రమంలో శుక్రవారం మంత్రి నేతృత్వంలో నిర్వహించే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమేరకు జమ్మలమడుగు, కడప, బద్వేల్, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు వారి ఆవేదనను వెల్లడించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. -
సెజ్‌లో గ‘లీజ్’
అదే ‘సాఫ్ట్’ మోసానికి అవకాశం మంత్రి గంటా అండ ఉందని ప్రచారం ఆర్భాటం చూసి నమ్మేసిన నిరుద్యోగలు రూ.12 కోట్లు దండేసి బిచాణా ఎత్తేసిన ‘ఎక్సాల్ట్’ ఎన్నాళ్లీ ఐటీ సంస్థల వసూళ్ల మేత ఊరూ పేరూ లేని ఓ కంపెనీ.. సాఫ్ట్‌వేర్‌కున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొని కోట్లు కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేసింది. ఐటీ సెజ్‌లో పక్కా భవనం కలిగిన మరో సాఫ్ట్వేర్ సంస్థ నుంచి కార్యాలయ భవనాన్ని లీజుకు తీసుకొని పాగా వేసింది. ఏకంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తీసుకొచ్చి ప్రారంభోత్సవం పేరుతో అట్టహాసం చేసింది. ఐటీ సెజ్‌లో ఆఫీసు.. మంత్రితో ప్రారంభం.. ఇంకేం.. యువత నమ్మేశారు. ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా కౌంటర్ తెరిచేశారు. రూ.కోట్లు దండేశారు. ఆర్నెలల్లోనే దుకాణం చక్కబెట్టి బిచాణా ఎత్తేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సెజ్‌లో ఓ కంపెనీ ఆఫీసు తీసుకుని హడావుడి చేస్తుంటే ఇన్నాళ్లూ అధికారులు ఏం చేస్తున్నట్టు?.. అలాంటి కంపెనీల ప్రారంభానికి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న గంటా ఎలా వెళ్లారన్నదే ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. విశాఖపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐటీ రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్న పాలకుల ఆర్భాటం ఎలా ఉన్నా.. దాన్నే అవకాశంగా తీసుకొని కొన్ని సంస్థలు ‘సాఫ్ట్’గా మోసాలకు పాల్పడుతూ విశాఖ యువతను రోడ్డున పడేస్తున్నాయి. విశాఖ ఐటీ సెజ్‌లో ఎన్నో ఏళ్ల కిందట భూములు తీసుకున్న 12 సాఫ్ట్వేర్ సంస్థల్లో నాలుగు కంపెనీలు ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక భవనాలు నిర్మించిన కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రామాణికాలు లేని నకిలీ ఐటీ సంస్థలకు ఆ భవనాలను అద్దెకిచ్చి వాటి మోసాలకు పరోక్షంగా తోడ్పడుతున్నాయి. ఇటీవల నిరుద్యోగుల నుంచి రూ.12 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఎక్సాల్ట్ సంస్థ నిర్వాకం వెనుక సర్కారు తప్పిదమూ కనిపిస్తోంది. రుషికొండలోని ఐటీ సెజ్ హిల్ నెం-2లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌సోల్ కంపెనీకి 2007లో ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయించింది. నిబంధనల మేరకు ఆ సంస్థ అందులో కార్యకలాపాలు ప్రారంభించి వందమందికి ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఆ స్థలంలో భవన నిర్మాణం పూర్తి చేసిన సాఫ్ట్‌సోల్ సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ఐటీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్సాల్ట్ ఇండియా లిమిటెడ్ అనే బోగస్ సంస్థకు ఇటీవల తన భవనాన్ని లీజు ప్రాతిపదికన అద్దెకు ఇచ్చింది. మంత్రి అండ ఉందని ప్రచారం అద్దెకు తీసుకున్న సదరు సంస్థ తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని ప్రచారం చేసుకుంది. దానికి బలం చేకూర్చేలా గత జనవరిలో జరిగిన ప్రారంభోత్సవానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానించింది. స్వయంగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా వెళ్లి ప్రారంభించడంతో విశాఖ యువతలో.. అది మంచి కంపెనీనే.. అన్న భావన ఏర్పడింది. దీంతో వందలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా కంపెనీ నిర్వాహకులు దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా రెండు నెలల కూడా జీతాలు చెల్లించని సంస్థ ప్రతినిధులు వారం కిందట పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్‌లో ఉన్న శాఖ కార్యాలయాన్ని కూడా ఎత్తేశారు. మోసపోయామని భావించిన బాధితులు పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదేనా ఐటీ ప్రగతి వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లలో విశాఖలో మూడు సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను నట్టేట ముంచాయి. డాబాగార్డెన్స్‌లో గత ఏడాది రెండు కంపెనీలు రూ.3 కోట్లు పోగేసుకుని బోర్డు తిప్పేయగా.. తాజాగా ఎక్సాల్ట్ కంపెనీ ఏకంగా రూ.12 కోట్లకు ముంచేసింది. విశాఖలో ఉద్యోగాల కోసం రూ.2 కోట్లు వసూలు చేసిన ఎక్సాల్ట్ ప్రతినిధులు.. మలేసియాలో ఉద్యోగం ఇస్తామన్న ఆశ చూపి మరో పదికోట్లు వసూలు చేశారని అంటున్నారు. ఐటీ సెజ్‌లో భూములు తీసుకున్న చాలా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించకపోగా, ఎట్టకేలకు తెరుస్తున్న కంపెనీలు ఇలా నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి. కాగా, మురళీనగర్‌లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిలో మూసివేత దిశగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఎక్సాల్ట్ ఎండీ పట్టివేతకు ప్రత్యేక బృందాలు:సీఐ పరారీలో ఉన్న ఎక్సాల్ట్ సంస్థ ఎండీ కిరణ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని భీమిలి సీఐ టి.అప్పలనాయుడు తెలిపారు. రూ.2 కోట్ల మేర నష్టపోయామని బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని కంపెనీని కూడా ఎత్తివేశారని, ప్రధాన నిందితుడు విదేశాలకు పారిపోకుండా త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. అలాంటి కంపెనీలను నమ్మకూడదు -జి.శ్రీధర్‌రెడ్డి, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో (పొటో: 23వీఎస్సీ310ఎ) మోసపూరిత సాఫ్ట్వేర్ సంస్థల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలు ఇస్తామంటే డబ్బులు చెల్లించడం సరైంది కాదు. ముందుగా కంపెనీ విధివిధానాలు తెలుసుకోవాలి. డబ్బులు తీసుకొని ఆరు నెలల శిక్షణ తర్వాత ఉద్యోగాలిస్తాం.. అని చెప్పే సంస్థలను నమ్మకూడదు. ఒక పేరు మీద ఉన్న సంస్థ మరో సంస్థకు లీజుకు ఇవ్వకూడదు. ఎక్సాల్ట్ వంటి కంపెనీలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రికి బాధ్యత లేదా? -జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పొటో: 23వీఎస్సీ310 మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారంటే ఆ కంపెనీ నిబంధనల మేరకు పక్కాగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అలాంటి కంపెనీల గురించి ముందుగా తెలుసుకోవాలి. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటేనే ప్రారంభించాలి. లేదంటే ఎక్సాల్ట్ కంపెనీల వంటి అనుభవాలే ఎదురవుతాయి. ఇప్పటికైనా మంత్రి గంటా స్పందించి ఎక్సాల్ట్ ప్రతినిధులను పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలి. నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా బాధ్యత తీసుకోవాలి. -
ఆగని రాయ‘బేరాలు’
నాలుగు తహశీల్దార్ స్థానాల కోసం పైరవీలు పోస్టుకు అరకోటి సమర్పణకు రెడీ? విశాఖపట్నం: రాజకీయ ఒత్తిళ్లతో అర్ధరాత్రి జరిగిన తహశీల్దార్ల బదిలీల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగినప్పటికీ ఈ బదిలీల రేపిన కలకలం ఇప్పట్లో చల్లారేటట్టు కన్పించడం లేదు. మంత్రులు..వారి అనుచరులు ఒత్తిళ్లు చేసి మరీ తమకు అనువుగా ఉన్నవారికి తాము కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇప్పించుకోగలిగారు. కొన్ని స్థానాలకు సంబంధించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాకపోవడంతో కలెక్టర్ యువరాజ్ వెయిటింగ్లో ఉన్నవారితో పాటు మరికొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు.రూరల్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న జెడ్పీ చైర్ పర్శన్ లాలం భవాని మరిది లాలం సుధాకర్ నాయుడిని మంత్రి గంటా అనుచరుడు పరుచూరి భాస్కరరావు ఒత్తిడి మేరకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అచ్యుతాపురం తహశీల్దార్ ఎం.శంకరరావును ఏరికోరి తెచ్చుకున్నారు. అయితే ఈ పోస్ట్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన విశాఖ ఆర్డీవో ఏఓ రామారావును చోడవరం బదిలీ చేయడంతో ఆయన ఈ పోస్టు కోసం పైరవీలుసాగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈయనతో పాటు మరికొందరు కూడా ఈ పోస్ట్‌ను దక్కించుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. పరుచూరి వ్యతిరేక వర్గీయులు వీరిని ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే గాజువాక, విశాఖ అర్బన్, అనకాపల్లి తహశీల్దార్ పోస్ట్‌ల కోసం విఫలయత్నం చేసిన పలువురు తహశీల్దార్లు కూడా సూట్‌కేస్‌లు తీసుకువెళ్లి మరీ మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.అలాగే గతంలో కలెక్టరేట్లో పనిచేసిన ఓ కీలకాధికారి మరోసారి నగరంలో కీలకమైన తహశీల్దార్ పోస్ట్ కోసం పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. నగర పరిధిలోని ఈ నాలుగు తహశీల్దార్ స్థానాల కోసం తలా రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ముట్ట జెప్పేందుకు వీరు సిద్దపడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నాలుగుపోస్టుల్లో చేర్పులు మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని రెవెన్యూ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. రెండు మూడ్రోజుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ఇక అన్ని పరీక్షలూ ఆన్లైన్లోనే..
- వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో సీసీఈ విధానం - టీచర్లకు బయోమెట్రిక్ - జూన్‌కి 10,300 మంది టీచర్లకు నియామక ఉత్తర్వులు - మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం : వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అన్ని పరీక్షలూ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వీటితోపాటు ప్రభుత్వం నిర్వహించే అన్ని ‘సెట్లు’ కూడా ఆన్లైన్లోనే జరుపుతామన్నారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించామని చెప్పారు. మంగళవారం పదో తరగతి ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఈ విధానంలో సీబీఎస్ఈ తరహాలో నాణ్యమైన విద్యాబోధన ఉంటుందన్నారు. డీఎస్సీలో ఎంపికైన 10,300 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు జూన్ ఒకటికల్లా నియామక ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి తెలిపారు. వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ (ప్లెడ్జ్) చేయిస్తారన్నారు. వీరికి పది రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రేషనలైజేషన్ పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు పనిచేసే చోటనే నివాసం ఉండాలన్న నిబంధన అమలు చేయనున్నామని, దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కూడా చర్చించామని చెప్పారు. వచ్చే నెల నుంచి టీచర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని తెలిపారు. దీంతో టీచర్లు ఆలస్యంగా పాఠశాలలకు రావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటివి నిరోధించడానికి వీలవుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించామన్నారు. తొలిదశలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి.సిసోడియా మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఆంగ్లం బోధించే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. వీరికి ఏప్రిల్ 3న అసెస్మెంట్ టెస్ట్ కూడా నిర్వహించామని తెలిపారు. -
'ఇకపై ఆన్లైన్లో ఏపీ ఎంసెట్'
విజయవాడ : వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌ను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 29 వ తేదీన ఎంసెట్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకూడదని ఆదేశించారు. ఈ పరీక్షకు చేతి గడియారాలకు అనుమతి లేని దృష్ట్యా ప్రతి కేంద్రంలో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద భద్రతపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
'జగన్ బటన్ నొక్కితే ముద్రగడ స్పందిస్తున్నారు'
న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కితే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న ఢిల్లీ వచ్చిన ఆయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీఇరానీ, పెట్రోలియం శాఖ మంతిర ధర్మేంద్ర ప్రదాన్ లను కలిశారు. గంటా శ్రీనివాసరావు గురువారం టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, అవంతీ శ్రీనివాసరావుతో కలిసి ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయ క్రీడలో ముద్రగడ పడొద్దని సూచించారు. ముఖ్యమంత్రికి ముద్రగడ రాసిన లేఖ అనైతికంగా ఉందని గంటా పేర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం పాటుపడేవారు రాసిన లేఖలా లేదని విమర్శించారు. రాజకీయ ఆరాటంతోనే ముద్రగడ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఈ ఏడాదే ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. న్యాక్ గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సాయం చేయాలని కోరినట్టు వివరించారు. -
'ఒక్కనిముషం ఆలస్యమైనా అనుమతించం'
విశాఖపట్నం : బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్న నేపధ్యంలో ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,00,419 మంది విద్యార్థులు హాజరవుతారని, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,93,472 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1363 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్, అమరావతి నగరాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురైనా టోల్ ఫ్రీ నంబరు 18002702701కు ఫోన్ చేయాల్సిందిగా కోరారు.117 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాలలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారని, మాస్ కాపీయింగ్ జరుగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. -
రగిలే జ్వాల!
పక్కా ప్రణాళికతో ఆజ్యం పోస్తున్న అయ్యన్న డిమాండ్ల చిట్టా విప్పుతున్న కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులు మంత్రి గంటా వర్గానికి షాక్ విశాఖపట్నం: అనుకున్నంతా అవుతోంది. కొణతాల వర్గం ప్రభావం టీడీపీ వర్గవిభేదాల చిచ్చును మరింతగా రాజేస్తోంది. ఇంకా అధికారికంగా టీడీపీలో చేరకుండానే కొణతాల వర్గం తమ మనసులో మాట బయటపెట్టింది. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి, పెందుర్తి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీ టిక్కెట్లు తమవేనని వ్యూహాత్మకంగా వెల్లడించింది. అయ్యన్న తెరవెనుక ఉండి ఆడిస్తున్న ఈ రాజకీయ నాటకం గంటా వర్గంలో కలవరం రేకెత్తిస్తోంది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తీవ్రంగా స్పందించగా... మంత్రి గంటా ఆత్మరక్షణలో పడ్డారు. వ్యూహాత్మకం: కొణతాల వర్గం పార్టీలో చేరినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గంటా వర్గానికి తాజా పరిణామం షాక్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో యలమంచిలి టిక్కెట్టు గండి బాబ్జీదేనని కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులిచ్చింది. మునగపాకలో నిర్వహించిన సమావేశంలో కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ గండి బాబ్జీ వస్తేనే యలమంచిలి సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానిచండం ప్రాధాన్యం సంతరించుకుంది. గంటా వర్గంలో కీలకమైన పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తుతం యలమంచిలి ఎమ్మెల్యేగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు దక్కదని కొణతాల వర్గం చెప్పకనే చెప్పింది. ఈ పరిణామంతో పంచకర్ల రమేష్‌బాబే కాదు మొత్తం గంటా వర్గం బిత్తరపోయింది. పంచర్ల ఎదురుదాడికి దిగారు. అసలు పార్టీలో చేరకుండానే యలమంచిలి టిక్కెట్టు తమదేనని కొణతాల వర్గం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యలమంచిలి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ శ్రేణులకు భవిష్యత్తు రాజకీయాలపై ఉప్పందింది. జాబితా ఇంకా పెద్దదే.... మంత్రి గంటా వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మంత్రి అయ్యన్న పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నారు. చక్రం తిప్పుతున్నారు. తాను తెరపైకి రాకుండా కొణతాల వర్గంతో కథ నడిపించాలని ఆయన ఎత్తుగడ వేశారు. వ్యూహాత్మకంగా పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ స్థానాలతోపాటు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు. గండి బాబ్జీ రాకను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గండి బాబ్జీ పెందుర్తి మీద కాకుండా మరో నియోజకవర్గంపై కన్నేశారనే లీకులు ఇచ్చింది. తద్వారా ఎమ్మెల్యే బండారును ప్రస్తుతానికి చల్లబర్చవచ్చన్నది అయ్యన్న వర్గం వ్యూహం. కానీ వాస్తవానికి పెందుర్తి, యలమంచిలి రెండు నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని బలోపేతం చేయడానికి పావులు కదుపుతోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కూడా కొణతాల వర్గం నుంచి పార్టీలో చేరేవారికే వచ్చేలా చేయాలన్నది అయ్యన్న వ్యూహం. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కొణతాల వర్గం, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల మధ్య పూర్తి సఖ్యత ఉంది. ఆ రెండు కుటుంబాల మధ్య వివాహ బంధం ఏర్పడనుంటమే ఇందుకు కారణం. దాంతో గంటా వర్గం నుంచి పెందుర్తి, యలమంచిలి స్థానాలు, అనకాపల్లి ఎంపీ స్థానాన్ని లాక్కోవాలని అయ్యన్న వ్యూహరచన చేశారు. గంటా వర్గం తర్జన భర్జన తాజా పరిణామాలతో గంటా వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతానికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఎదురుదాడి చేశారు. కానీ అయ్యన్న వర్గం పక్కా వ్యూహంతో వెళుతుండటంతో ఏంచేయాలన్నదానిపై మంత్రి గంటా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తమ వర్గం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే జారుకున్నారు. పాకయరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు బండారు, పంకచర్ల, ఎంపీ అవంతి శ్రీనివాస్‌లకు వారి నియోజకవర్గాల్లోనే పొగ బెడుతున్నారు. దాంతో తాము ఎలా ఎదురుదాడి చేయాన్నదానిపై మంత్రి గంటా తమవర్గీయులతో తీవ్రంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గ పోరు మరిన్ని ఆసక్తికర మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. -
మంత్రి గంటాకు బీజేపీ ఎమ్మెల్యే షాక్
-
మంత్రి గంటాకు బీజేపీ ఎమ్మెల్యే షాక్
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్‌కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు షాక్ ఇచ్చారు. విశాఖలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో గంటాను విష్ణుకుమార్ రాజు నిలదీశారు. 'కేజీహెచ్‌కు తగినంత నర్సింగ్ సిబ్బందిని ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అన్ని వసతులు ఉన్న కేజీహెచ్‌లో దంత వైద్య కళాశాల ఎందుకు పెట్టరు?. ఈ విషయంలో పదే పదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా స్పందించడం లేదు. అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు డిమాండ్ చేసినా ప్రయోజనం లేదు' అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న మంత్రి గంటా... విష్ణుకుమార్ రాజుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ బీజేపీ వద్దే ఉంది కదా అని గుర్తు చేశారు. దీనిపై వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
గంటా దిష్టి బొమ్మ దహనం
ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ప్రత్యేక హోదా కోసం తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో విద్యార్ధులు తలపెట్టిన సమావేశానికి అనుమతి నిరాకరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్కే యూనివర్సిటీ లోని అన్ని విద్యర్థి సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిరసన కారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఉన్నత విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు దంపతులు, శ్రీశంకర విద్యానంద స్వామీజీలు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా అర్చకులు వారికి ఆశీర్వచనం పలుకగా, ఉద్యోగులు లడ్డూ ప్రసాదాలను అందజేశారు. -
తేలని పితలాటకం
పట్టువీడని మంత్రులు బీసీ అయితే కాశీ విశ్వనాథం!? ఎస్టీ అయితే ఎం.వి.ఎస్.{పసాద్లకు ఛాన్స్!? నిర్ణయం నేటికి వాయిదాటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిఎంపిక వ్యవహారం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పితలాటకం మరింత జఠిలంగా తయారైంది. జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పప్పల చలపతిరావు పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కాగా రెండో ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక మాత్రం టీడీపీలో వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది. సామాజికవర్గ సమీకరణలతోపాటు వర్గ రాజకీయాల పీటముడి బిగుసుకుంది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. మంత్రులు ఇద్దరు తమ మాటే నెగ్గాలని పంతం పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో శుక్రవారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో మంత్రులు గంటా, అయ్యన్నలతోపాటు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న తమకు అవకాశం కల్పించాలని విడివిడిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రామానాయుడు, పీలా శ్రీనివాస్, బొడ్డేటి కాశీవిశ్వనాథం, అనకాపల్లికిచెందిన డాక్టర్ సరస్వతి తదితరులు తమకు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓసీ వర్గానికి చెందిన పప్పల చలపతిరావుకు కేటాయించినందున రెండో స్థానాన్ని బీసీకిగానీ ఎస్టీకిగానీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దాంతో కన్నబాబు రాజుకు అవకాశాలు మూసుకుపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినందున ఎమ్మెల్సీగా అవకాశమివ్వలేనని రామానాయుడుకు సీఎం చెప్పేశారు. దాంతో అయ్నన్నపాత్రుడు బీసీ వర్గం నుంచి పీలా శ్రీనివాస్ పేరును ప్రతిపాదించారు. కాగా గంటా శ్రీనివాసరావు మాత్రం బీసీ వర్గానికే చెందిన కాశీ విశ్వనాథంకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. ఈమేరకు ఇద్దరు మంత్రులు కూడా సీఎంతో విడిగా మాట్లాడుతూ తమ వాదనను బలంగా వినిపించారు. దాంతో సీఎం ఏమీ తేల్చకుండా శుక్రవారం మరోసారి చర్చించిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేద్దామని చెప్పి అందర్నీ పంపించి వేశారు. ఎస్టీ అయితే ఎం.వి.ఎస్. ప్రసాద్!? తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. బీసీకే ఇవ్వాలని భావిస్తే కాశీ విశ్వనాథంకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పప్పల చలపతిరావు మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు. మరోవైపు అయ్యన్న ప్రతిపాదిస్తున్న పీలా శ్రీనివాస్ సోదరుడు గోవింద సత్యన్నారాయణ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి రెండో అభ్యర్థిగా మంత్రి గంటాతోపాటు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న కాశీ విశ్వనాథంకు అవకాశాలు మెరుగయ్యాయి. కానీ చంద్రబాబు మాత్రం ఎస్టీ నేతను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.సత్యన్నారాయణ కుమారుడు ఎం.వి.ప్రసాద్ పేర్లను పరిశీలిస్తున్నారు. మణికుమారి కంటే యువకుడైన ఎం.వి.ప్రసాద్ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలని నిర్ణయిస్తే కాశీ విశ్వనాథంను, ఎస్టీకి ఇవ్వాలని భావిస్తే ఎం.వి.ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. అనూహ్య మార్పులు జరిగితే తప్పా వీరిద్దరిలో ఒకరికి అవకాశం లభించొచ్చని టీడీపీవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో శుక్రవారం మరోసారి సమావేశమై చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. -
బలవంతపు వసూళ్లకు పాల్పడటం లేదు:గంటా
విశాఖపట్నం: ఈ నెల 23, 24, 25వ తేదీల్లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఆర్కే బీచ్, మధురవాడ జాతర, ఉడా పార్కు, కైలాసగిరి, గురజాడ కళాక్షేత్రం తదితర వేదికల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన ఆయన సోమవారం ఇక్కడ వెల్లడించారు. 23వ తేదీ మధ్యాహ్నం వెయ్యిమంది కళాకారులు, నేవీ బ్యాండుతో ప్రారంభమయ్యే కార్నివాల్ తో విశాఖ ఉత్సవ్ ప్రారంభమవుతుందని గంటా తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ 'ఉత్సవ్' కు సాంస్కృతిక కళాకారులు, సినీ నటులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్నివాల్ ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని గంటా తెలిపారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వైజాగ్ మున్సిపల్ కౌన్సిల్, ఉడా సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఎవరినుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం లేదని తెలిపారు. ఉత్సవ్ ప్రధాన వేదిక నిర్మాణం విషయంలో బీచ్‌కు ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా గంటా హామీ ఇచ్చారు. ఉత్సవాల కోసం బీచ్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కులో 100 అడుగుల కరెంటు ప్రభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ 300 మంది మహిళలతో ముగ్గుల పోటీలు, 22న ఉత్తరాది ప్రజలతో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. -
ముసలం
తెలుగుదేశంలో చేరికలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. వెనకాముందూ చూడకుండా పార్టీలో అందరికీ గేట్లు తెరిచేయడంతో నాయకులు కార్యకర్తలు కంగు తింటున్నారు. అధినేత ధోరణితో వీరంతా మండిపడుతున్నారు. మాజీ మంత్రి గంటా చేరికతో భగ్గుమన్న తెలుగుదేశంలో వుడా మాజీ వీసీ రెహమాన్ తాజాప్రవేశం ఆ పార్టీ నగరనేతవాసుపల్లికి గట్టిషాకే ఇచ్చింది. విశాఖపట్నం : అర్బన్ తెలుగుదేశం పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. గంటా చేరికతో ఓ పక్క అయ్యన్న ఆగ్రహంతో రగిలిపోతుంటే తాజాగా వుడా మాజీ చైర్మన్ రెహమాన్ తెలుగుదేశంలో చేరడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. సాక్షాత్తూ ఆ పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ఈ చేరిక షాకిచ్చినట్టయింది. దక్షిణ నియోజక వర్గంలో మత్స్యకార నేతగా ముద్రపడి పనిచేసుకుపోతున్న ఈయనకు రెహమాన్ చేరిక మింగుడు పడటం లేదు. అధినేత చంద్రబాబునాయుడు తీరుపై వాసుపల్లి వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు. -
రాజీనామాలు చేయొద్దని నిర్ణయించుకున్నాం : మంత్రి గంటా