తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఉన్నత విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు దంపతులు, శ్రీశంకర విద్యానంద స్వామీజీలు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా అర్చకులు వారికి ఆశీర్వచనం పలుకగా, ఉద్యోగులు లడ్డూ ప్రసాదాలను అందజేశారు.