తెలుగు భాషను కాపాడు కుందాం
సాక్షి,అమరావతి : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అగ్రతాంబూలం ఇచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ లోని కీ.శే.మండలి వెంకటకృష్ణారావు 90 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు అచ్చయ్య కుమార్ రావు కు సంస్కృతి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. మండలి కృష్ణారావు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప ఆదర్శవంతుడన్నారు. కాగా, ఆంగ్ల విద్య మోజులో పడి మాతృభాషను పట్టించుకోవటం లేదన్నారు. దీంతో ప్రా«థమిక విద్యలోనే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అందరూ సహకరిస్తే విశాఖపట్నంలో తెలుగు మహసభల్ని నిర్వహిస్తామని తెలిపారు.
ప్రవాసుల స్ఫూర్తితో తెలుగుకు సేవ: బుద్ధప్రసాద్
తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగుభాషాను మరిచిపోతున్నా మనీ ,విదేశాలలో ఉన్న తెలుగు వారిని స్ఫూర్తిగా తీసుకోని బాషాను పరిరక్షించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తన తండ్రి కీ.శే.మండలి వెంకటకృష్ణారావు తెలుగు బాషాపరిరక్షణ కోసం చేసిన సేవలు మరుపురానివన్నారు. ప్రతియేటా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో సంస్కృతి పురస్కారాలను భాషా పరిరక్షకులకు అందజేస్తామన్నారు. ఈ çసభలో ఫ్రాన్స్ దేశస్ధుడు డానియల్ నాజర్స్ వచ్చిరానీ తెలుగు భాషలో ఆయన చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డేవిడ్ రాజు,మాజీ ఎమ్మెల్సీ వెంకయ్య,అమెరికా తెలుగు సంఘనేత ఆళ్ల శ్రీనివాసరెడ్డి,లండన్ యుకె తెలుగు సంఘం నాయకులు సత్యప్రకాశ్, మలేషియా తెలుగు ప్రతినిధులు ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ డైరక్టర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.