mandali krishnarao anniversary
-
Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి. మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి) ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు) – డా. జె. వి. ప్రమోద్ కుమార్, పైడిమెట్ట (సెప్టెంబర్ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి) -
తెలుగు భాషను కాపాడు కుందాం
సాక్షి,అమరావతి : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అగ్రతాంబూలం ఇచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ లోని కీ.శే.మండలి వెంకటకృష్ణారావు 90 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు అచ్చయ్య కుమార్ రావు కు సంస్కృతి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. మండలి కృష్ణారావు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప ఆదర్శవంతుడన్నారు. కాగా, ఆంగ్ల విద్య మోజులో పడి మాతృభాషను పట్టించుకోవటం లేదన్నారు. దీంతో ప్రా«థమిక విద్యలోనే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అందరూ సహకరిస్తే విశాఖపట్నంలో తెలుగు మహసభల్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రవాసుల స్ఫూర్తితో తెలుగుకు సేవ: బుద్ధప్రసాద్ తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగుభాషాను మరిచిపోతున్నా మనీ ,విదేశాలలో ఉన్న తెలుగు వారిని స్ఫూర్తిగా తీసుకోని బాషాను పరిరక్షించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తన తండ్రి కీ.శే.మండలి వెంకటకృష్ణారావు తెలుగు బాషాపరిరక్షణ కోసం చేసిన సేవలు మరుపురానివన్నారు. ప్రతియేటా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో సంస్కృతి పురస్కారాలను భాషా పరిరక్షకులకు అందజేస్తామన్నారు. ఈ çసభలో ఫ్రాన్స్ దేశస్ధుడు డానియల్ నాజర్స్ వచ్చిరానీ తెలుగు భాషలో ఆయన చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డేవిడ్ రాజు,మాజీ ఎమ్మెల్సీ వెంకయ్య,అమెరికా తెలుగు సంఘనేత ఆళ్ల శ్రీనివాసరెడ్డి,లండన్ యుకె తెలుగు సంఘం నాయకులు సత్యప్రకాశ్, మలేషియా తెలుగు ప్రతినిధులు ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ డైరక్టర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.