సాక్షి, అమరావతి: పదో తరగతి మాదిరిగానే ఇంటర్‌లోనూ ర్యాంకుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిం చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యం లో సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా, డీజీపీ సాంబశివరావు తది తరులు.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ వివరాలను మంత్రి గంటా మీడియాకు వెల్లడించారు.
ఈ ఏడాది నుంచి ర్యాంకుల విధానాన్ని ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ విషయాన్ని ఎంసెట్ నిర్వాహకులు చూసుకుంటారని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను రోజుకు పద్దెనిమిది న్నర గంటల పాటు చదివిస్తున్నారని, దీంతో ఒత్తిడికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చింద న్నారు. కాలేజీల యాజమాన్యాలు పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే కఠిన చర్య లు తప్పవన్నారు. ఇకపై విద్యార్థులకు విధిగా ఆదివారం సెలవు ఇవ్వాల్సిందే నని స్పష్టం చేశారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం..
కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల బలవన్మర ణాలపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్టు గంటా తెలిపారు. ఈ కమిటీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇస్తుందని, దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు కాలేజీల హాస్టళ్లు 150కి పైగా ఉన్నాయని.. మూడు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోకపోతే వాటిని రద్దు చేస్తామన్నారు.
ప్రతి కార్పొరేట్ కాలేజీ కూడా ఒక మానసిక వైద్యుడిని నియమించుకొని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని 2012 నుంచి ఇప్పటి వరకూ 35 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. వీరిలో శ్రీ చైతన్య కాలేజీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని గంటా వెల్లడించారు.
ఇంటర్‌లోనూ గ్రేడింగ్
Published Tue, Oct 17 2017 1:30 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment