విశాఖ జిల్లా నర్సీపట్నం సాక్షి టీవీ విలేకరి రమణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం సాక్షి టీవీ విలేకరి రమణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రోడ్డు పక్కన నిలబడిన ఆయనను ఓ బైకిస్టు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన రమణను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.