పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆకస్మిక మృతికి ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆకస్మిక మృతికి ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాడేరులో గురువారం ఉదయం ఏఎస్పీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఏఎస్పీ మరణ వార్త విన్న వెంటనే ఉపముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని విశాఖ బయలుదేరారు. కేజీహెచ్‌లో ఉంచిన శశికుమార్మృతదేహాన్ని సందర్శించనున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.